Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 28th:చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర స్థానాన్ని దక్కించుకున్న లక్ష్మీ.. కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్రని ఛైర్మన్‌గా వద్దని ఆ స్థానాన్ని అరవింద, జయదేవ్‌లు కోడలు లక్ష్మీకి ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ అందరికీ స్వీట్స్ ఇస్తుంది. ఇక వివేక్ మిత్ర దగ్గరకు వెళ్లి మళ్లీ ఛైర్మన్‌లా సంతకం పెట్టమని అంటాడు. లక్ష్మీ కూడా మిత్రతో ఛైర్మన్‌గా రిజైన్ చేశారు కదా దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మళ్లీ సంతకం పెట్టడని చెప్తుంది. మనీషా దేవయానితో ఆ మాట మిత్రతో నేను చెప్పాల్సింది లక్ష్మీ చెప్తుందని ముఖం మాడ్చుకుంటుంది. మిత్ర సంతకం పెడుతుంటే అరవింద మిత్రని ఆపుతుంది.
అరవింద: ఛైర్మన్ పదవికి మిత్ర వద్దు.
లక్ష్మీ: ఆయన తప్ప ఇంకెవరు ఉంటారు.
అరవింద: నువ్వే. కష్టపడి నువ్వు ఆ కంపెనీని సాధించావు.
లక్ష్మీ: ఇదంతా నేను ఆయన కోసమే చేశాను అత్తయ్య గారు.
జయదేవ్: మీ అత్తయ్య అన్నదాంట్లో అర్థముంది లక్ష్మీ.
అరవింద: ఇక నుంచి నువ్వు ఈ నందన్ వంశ కోడలివే కాదు నందన్ వంశ కంపెనీ అధినేతవి కూడా.
మనీషా: అలా ఎలా చేస్తారు ఆంటీ మిత్రని అవమానిస్తారా
అరవింద: ఇది మా కుటుంబ విషయం మనీషా నువ్వు మధ్యలో రావొద్దు.
దేవయాని: నేను మాట్లాడొచ్చా నేను ఇంటి కోడలినే కదా. మిత్ర లక్ష్మీని తన భార్యనే కాదు అంటున్నాడు అలాంటి దాన్ని ఈ కంపెనీకి ఎలా ఛైర్మన్‌గా చేస్తారు. ఒక ఆడదానికి అంత పెద్ద కంపెనీలో ఎలా కూర్చొపెడతారు
అరవింద: ఈ ఆడదే మన కంపెనీ కాపాడింది. మనందరం ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చొంటే ఈ ఆడదే వెళ్లి కంపెనీనీ కాపాడింది అయినా ఆడదానివి అయిండి సాటి ఆడదాని మీద ఎందుకు అంత పగ. ఆడవాళ్లు చేయలేని పని ఏముంది. లక్ష్మీనే మన కంపెనీకి కొత్త ఛైర్మన్.
లక్ష్మీ: వద్దు అత్తయ్య గారు అది నా పని కాదు. నేను చేసిన పని ఆయన చేయలేక కాదు కోపంతో ఆగిపోయారు.
అరవింద: మేం మిత్రని తక్కువ చేయడం లేదు. నువ్వు ముందు కొనసాగు.
లక్ష్మీ: నేను ఆ పదవిలో ఒదగలేను అది ఎప్పటికీ అతనిదే
మిత్ర: నీ డెసిషన్ నాకు అక్కర్లేదు ఇది నీ కష్టార్జీతం అంటున్నారు కదా నాకు అవసరం లేదు నేను మిత్రానందన్‌ని ఆ పేరు నాకు చాలు.
మనీషా: మిత్రని బాధ పెట్టడం కాదు అవమానించారు.
దేవయాని: ఇంట్లో చెట్టంత మగాడు ఉంటే ఆడదానికి అధికారం ఇవ్వడం ఏంటి.
అరవింద: ఇది మా నిర్ణయం మా నిర్ణయానికి తిరుగులేదు. లక్ష్మీ సంతకం చేయ్.
అందరూ చెప్పడంతో లక్ష్మీ ఛైర్మన్‌గా సంతకాలు చేస్తుంది. మిత్ర దగ్గరకు వెళ్లి దీవెనలు అడుగుతుంది. మిత్ర కాళ్లు తాకబోతే మిత్ర కాళ్లు లాగేసుకుంటాడు. దానికి మిత్ర నా ఆశీర్వాదం కోసం వచ్చావా ఇంకా నన్ను రిక్వెస్ట్ చేయడానికి అనుకున్నా అంటాడు. నీకు నా కంటే ఛైర్మన్ పదవే ఎక్కువైందా అని అడుగుతాడు. దానికి లక్ష్మీ మనసులో మనల్ని కలపడానికే అత్తయ్య మామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకొని మిత్రతో కాదు నాకు మీరే ఎక్కువ అంటుంది. దాంతో మిత్ర మరి ఎందుకు ఛైర్మన్ పదవి తీసుకున్నావని అడుగుతాడు. పెద్ద వాళ్ల కోసం అని అంటుంది. రేపటి నుంచి ఎప్పుడూ నేనే చూసుకోవాలి అని అంటుంది. దానికి మిత్ర నువ్వు పల్లెటూరి మొద్దువి నా దగ్గర అన్నీ నేర్చుకున్నావ్ అంటాడు.
అవును అని లక్ష్మీ అంటుంది. నీ వల్ల ఆఫీస్ పాడవకుంటే చాలు అని అంటాడు. దానికి లక్ష్మీ మీరు ఆఫీస్‌కి రారు కదా మీకు ఎందుకు అంటుంది. దానికి మిత్ర నేను వస్తాను అని అన్నీ నాకు తెలిసే జరుగుతాయి అని మన కంపెనీకీ ఎండీగా వస్తానని అంటాడు. లక్ష్మీ కావాలనే మిత్రని రెచ్చగొట్టి తనతో మిత్ర ఆఫీస్‌కి వచ్చేలా చేస్తుంది. తర్వాత మిత్రకు థ్యాంక్స్ చెప్పి నాకు అదే కావాలి అని వెళ్లిపోతుంది. తర్వాత మిత్ర అంటే నన్ను ఆఫీస్‌కి రప్పించడానికి ఇలా రెచ్చగొట్టి మాట్లాడిందా ఛా అనవసరంగా రెచ్చిపోయా అనుకుంటాడు.
మనీషా ఆలోచనలో కోపంతో ఉంటే దేవయాని మనీషా దగ్గరకు వచ్చి చిడతలు ఇస్తుంది. ఇకపై వీటితో మనం భజన చేసుకుందామని సరయుని తీసుకొచ్చినందుకు తిడుతుంది. మిత్ర, లక్ష్మీలు కలిసిపోతారు. నా కొడుకు జానుతో వెళ్లిపోతాడు ఇక మనం ఈ చిడతలతో భజన చేసుకోవాలి అంటుంది. దాంతో మనీషా దేవయాని గొంతు పట్టి నా జోలికి వస్తే ఎవరినీ వదలని అంటుంది. ఇక పిల్లలు స్వీట్ బాక్స్ పట్టుకొని ఆంజనేయస్వామిని పిలుస్తారు. స్వామి ప్రత్యక్షమవుతారు. తన తల్లి గెలిచిందని అందరూ సంతోషంగా ఉన్నామని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌కి ఆశలు ఉంటాయ్ నువ్వు భార్యగా ఉండాల్సిందే: అనసూయ మాటలకు ఆలోచనలో దీప