Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 22nd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: కుప్పకూలిపోయిన మనీషా.. అఖండ జ్యోతిని ఎత్తుకున్న లక్ష్మీ.. దగ్గరుండి నడిపించిన మిత్ర!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషా కళ్లు తిరిగిపడిపోవడం లక్ష్మీ వచ్చి ప్రదక్షిణలు చేయడం మిత్ర లక్ష్మీకి సాయం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా బెల్లం బుట్ట పట్టుకొని ప్రదక్షిణలు చేస్తుంటుంది. బరువు మోయలేక చాలా ఇబ్బంది పడుతుంది. మిత్ర ఇబ్బంది అయితే డ్రాప్ అయిపోమని అంటాడు. కానీ మనీషా తిరుగుతాను ఏం కాదు అని అంటుంది. ఇక మిత్ర మనీషాని తిరగమని పిన్ని, పిల్లలు తాను వెళ్లి మరో మొక్కు తీర్చుతామని.. మనీషాని చూసుకోమని వివేక్‌తో చెప్తాడు. మిత్ర లేకపోతే ఎన్నో కొన్ని చేసి 108 అయిపోయావని చెప్పేయాలి అనుకున్న మనీషాకి తన పక్కన వివేక్ ఉండటంతో తెగ ఇబ్బంది పడుతుంది. మరోవైపు లక్ష్మీ రెడీ అయి మత్తు మత్తు గానే గుడికి బయల్దేరుతుంది. మిత్ర దేవుడి ఎదుట కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటే జున్ను జై శ్రీరామ అని దేవుడి ఎదురుగా దీపాలు వెలిగిస్తాడు.
జాను: అక్క నీకు మత్తే వదలలేదు ఇలాంటప్పుడు ఎలా మొక్క తీర్చుకుంటావక్కా.
లక్ష్మీ: మొక్కు చెల్లించడం నా బాధ్యత.
జాను: మైకం వదలకుండా లేస్తే ప్రమాదమని డాక్టర్ చెప్తారు.
లక్ష్మీ: నాకు ఏమైనా పర్లేదు మొక్క తీర్చాలి.
జాను: అక్క గుడి వచ్చింది పద.
వివేక్: ఏంటి మనీషా మూడు ప్రదక్షిణలకే ఇలా అయిపోతే ఇంకా 105 ఉన్నాయి.
జాను: నేను అక్క గుడికి వచ్చాం అండీ మీరు ఎక్కడ ఉన్నారు.
వివేక్: జాను వదినకు ఏమైంది ఎందుకు అలా ఉంది.
జాను: ఇందంతా మీ అమ్మ మనీషా చేసిన కుట్ర.
లక్ష్మీ: జాను వద్దు.
జాను: ఈ రోజు అక్క గుడికి రాకూడదు అని రాత్రి పాలలో మత్తు మందు కలిపారు. నాకు విషయం తెలీక నేను అక్కతో తాగించేశాను. బావగారికి చెప్దాం అంటే అక్క వద్దు అంటోంది.
వివేక్: అందుకేనా మనీషా ఇందాక ఓవర్ చేసింది.
వివేక్ మిత్రకు విషయం చెప్తాను అంటే లక్ష్మీ వద్దని అంటుంది. ఇక వివేక్ మనీషా మోయలేని భారం మోస్తుందని ఏ క్షణం అయినా పడిపోతుందని అంటాడు. ఇక లక్ష్మీ మిత్ర వాళ్ల దగ్గరకు వెళ్తుంది. మిత్ర పట్టించుకోడు.
మిత్ర: పొద్దున్న రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చావ్.
లక్ష్మీ: లేవలేకపోయానండీ. మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను.
దేవయాని: నీ మొక్కు మనీషా తీర్చుతుంది. లక్కీ నీ కన్నకూతురు అయితే ఇలా చేసేదానివా. ఊరికే కూతురని చెప్పుకోవడం కాదు బాధ్యత ఉండాలి.
మిత్ర: తన వల్ల కాకపోయినా మనీషా మొక్కు తీర్చుతుంది తనకున్న బాధ్యత నీకు లేదు. నువ్వు ఇక ఏం చేయాల్సిన అవసరం లేదు మనీషా మొక్కు తీర్చుకుంటుంది. ఇంతలో ఒకావిడ వచ్చి మనీషా ప్రదక్షిణలు చేయలేక పడిపోయిందని చెప్తుంది. దాంతో అందరూ షాక్ అయి మనీషా దగ్గరకు పరుగులు తీస్తారు.
మనీషా: సారీ మిత్ర నా వల్ల కాలేదు.
దేవయాని: మిత్ర ముందే చెప్పాడు కదా నువ్వే చేశావు.
మిత్ర: పిన్ని తన కనీసం ప్రయత్నించింది కొందరు ఉన్నారు బాధ్యత లేకుండా ఇంట్లో నిద్ర పోయారు.
పంతులు: అఖండ జ్యోతి కింద పెట్టారేంటి అలా మధ్యలో వదిలేయకూడదు త్వరగా ఎత్తుకోండి.
మనీషా: నా వల్ల కాదు పంతులు గారు.
పంతులు: అలా ఆపకూడదమ్మా అమ్మవారు ఆగ్రహిస్తారు. ఆవిడ బదులు ఇంకెవరైనా ఎత్తుకొని ప్రదక్షిణలు చేయండి.
లక్ష్మీ: నేను చేస్తాను.
జాను, వివేక్‌లు వద్దని లక్ష్మీకి చెప్పినా లక్ష్మీ చేస్తాను అని అంటుంది. దేవుడి మీద భారం వేసి మొక్కు చెల్లిస్తానని అంటుంది. దాంతో వివేక్, జానులు జ్యోతిని లక్ష్మీ తల మీద పెడతారు. లక్ష్మీ ప్రదక్షిణలు చేస్తుంది. మనీషాని తీసుకొని దేవయాని పక్కకు వెళ్తుంది. ఎప్పటిలాగే లక్ష్మీ నీ పని పూర్తి చేస్తుందని దేవయాని అంటే సగం మత్తులో సగం స్ఫృహలో ఉన్న లక్ష్మీ ఏం చేయలేదని అనుకుంటారు. ఎలా అయినా మిత్రకు తాను దగ్గరవ్వాలని మనీషా అంటుంది. లక్ష్మీ తిరుగుతూ ఉండగా మత్తుతో సరిగా నడవలేకపోతుంది.
కళ్లు తిరిగి పడిపోతున్నట్లు నడుస్తుంది. మిత్ర చూసి వివేక్‌తో లక్ష్మీ ఎందుకు అలా ఉంది నిజంగా తనకు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. దాంతో వివేక్ హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్తాడు. అయినా ఎందుకు వచ్చిందని మిత్ర అంటే మొక్కు తీర్చుకోవడానికి వచ్చిందని చెప్తాడు వివేక్. ఇక లక్ష్మీ పడిపోబోతే మిత్ర చూసి వెళ్లి లక్ష్మీని పట్టుకుంటాడు. నేను పట్టుకొని నడిపిస్తానని అంటాడు. మనీషా, దేవయానిలు షాక్ అయిపోతారు. మిత్ర లక్ష్మీని పట్టుకొని నడిపిస్తాడు. ప్రదక్షిణలు పూర్తి చేసి అఖండ జ్యోతిని దేవుడి దగ్గర పెట్టి లక్ష్మీ మత్తుతో మిత్ర మీద పడిపోతుంది. మిత్ర లక్ష్మీని దగ్గరకు తీసుకుంటాడు. మనీషా రగిలిపోతాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.