Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 21st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషా నెత్తి పగిలే మొక్కు.. దెబ్బకు తిక్క కుదిరిందిగా.. మత్తు వదించుకోవడానికి లక్ష్మీ తిప్పలు!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషా బెల్లం బుట్టతో మొక్క తీర్చుకుంటుందని దేవయాని మనీషాని మిత్ర ముందు ఇరికించేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ నీ మాట వినదని తన మాటే నువ్వు వినాలని అనుకొంటుందని అందుకే పడుకొని ఇంకా లేవలేదని మనీషా మిత్రకు చెప్తుంది. ఇక వివేక్ లక్ష్మీకి నిజంగానే బాలేదని జాను దగ్గరుండి చూసుకుంటుందని అంటాడు. దాంతో మిత్ర వెటకారంగా జానుతో మీ అక్క లేవగానే కాఫీ ఇవ్వు తినడానికి ఏమైనా ఇవ్వు అని చెప్పి మిగతా అందరినీ తీసుకొని గుడికి వెళ్తాడు.
జాను వైపు మనీషా, దేవయాని చూసి నవ్వుతారు. దాంతో జానుకి అనుమానం వస్తుంది. లక్ష్మీ దగ్గరకు వెళ్లి మరోసారి లేపుతుంది. లక్ష్మీ లేవకపోవడంతో డాక్టర్‌కి కాల్ చేస్తుంది. మిత్ర వాళ్లు గుడికి చేరుకుంటారు. ఇక పంతులు ఎదురుగా వచ్చి మనీషాతో మీరు చెప్పినట్లు అన్ని సిద్ధం చేశానమ్మా అంటాడు. నేనేం చెప్పాను అని మనీషా మనసులో అనుకుంటుంది. మిత్ర, వివేక్‌లు ఏం మొక్కుకున్నావని ప్రశ్నిస్తారు.
దేవయాని: అదే మిత్ర లక్కీకి తగ్గితే బుట్టెడు బెల్లంతో గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి అఖండ దీపం వెలిగిస్తానని మొక్కుకుంది. చెప్పవేంటి మనీషా.
మనీషా: అవును మిత్ర.
వివేక్: ఈ విషయం నిన్న ఎందుకు చెప్పలేదు.
మనీషా: ఇప్పుడు చెప్పి మిత్రకు సర్‌ఫ్రైజ్ చేద్దామనుకున్నా.
జున్ను: మొక్కుల విషయంలో కూడా సర్‌ఫ్రైజ్‌లు ఉంటాయా.
దేవయాని: మీ అమ్మలా షాక్‌లు కూడా ఉంటాయిరా మొక్కలు చెల్లిస్తానని చెప్పి పడుకుంది.
లక్కీ: అమ్మకి ఆరోగ్యం బాలేక పడుకుంది.
మనీషా: లక్ష్మీకి ఈ పిల్లల సపోర్ట్ ఏంటి ఆంటీ.
దేవయాని: ముందు నీకు మిత్ర సపోర్ట్ ఉండేలా చూసుకో.
వివేక్: అఖండ దీప సమర్పణ అన్నావ్ అది ఎలాగో నీకు తెలుసా మనీషా.
మిత్ర: అలవాటు లేని పనులు ఎందుకు మనీషా. 108 ప్రదక్షిణలు ఉంటే చాలా కష్టం కదా.
మనీషా: అదేంటి మిత్ర లక్కీ నీ కూతురు అంటే నాకు కూతురే. తన కోసం నేను మొక్కుకోకూడదా కష్టపడకూడదా మనం కాబోయే భార్యభర్తలం. లక్కీకి అమ్మానాన్నలం. లక్కీపై నీకు ఎంత బాధ్యత ఉందో నాకు అంతకు మించి బాధ్యత ఉంది.
మిత్ర: థ్యాంక్యూ మనీషా నాకు భార్యనని లక్కీకి అమ్మ అని చెప్పుకునే మనీషా ఇంట్లో పడుకొని ఉంది. నువ్వేమో అలవాటు లేని పనులు చేస్తున్నావ్ థ్యాంక్యూ.
మనీషా: ఆంటీ ఈ మొక్కు ఏంటి నాకు ముందే చెప్పొచ్చు కదా. ఈ మొక్కల విషయంలోనే నేను లక్ష్మీతో రెండు సార్లు ఓడిపోయాను. నావల్ల అవుతుందా.
దేవయాని: లక్కీతో ఎంత కష్టం అయినా పడతాను అన్నావు ఇప్పుడు నువ్వు వెనక్కితగ్గితే మిత్ర దృష్టిలో చెడు అవుతావ్. పద..
డాక్టర్ లక్ష్మీని చూస్తుంది. నిద్ర మాత్రలు వేసినట్లుంది మూడు నాలుగు గంటలు పడుకుంటుందని అంటుంది. డీప్ స్లీప్‌లో ఉందని డాక్టర్ చెప్తుంది. మా అక్క వెంటనే లేవాలి లేదంటే మా బావ మిస్ అండర్ స్టాండ్ చేసుకుంటాడని అంటుంది. మిత్రకు చెప్పడానికి జాను వెళ్లబోతే లక్ష్మీ చేయి పట్టుకుంటుంది. డాక్టర్‌కి ఏదో ఒకటి చేయమని జాను అంటే తన బ్రైన్ పని చేస్తుంది కానీ మత్తు వదిలే వరకు లేవలేదని అంటుంది. ఏం చేయాలి ఎలా అక్కని గుడికి తీసుకెళ్లాలి అని జాను టెన్షన్ పడుతుంది. మరోవైపు మొక్కు చెల్లిస్తాను అని మనీషా అంటే వివేక్ అడ్డు పడతాడు. దాంతో మిత్ర వివేక్‌తో మనీషా మొక్కు చెల్లిస్తుందని అంటాడు.
మరోవైపు పిల్లలు ఆంజనేయ స్వామిని పిలుస్తారు. తన తల్లి పడుకుందని లక్కీ కోసం మొక్కు తీర్చకుండా పడుకుందని తండ్రి తిడుతున్నాడని పిల్లలు చెప్తారు. దాంతో ఆంజనేయ స్వామి కొన్ని మంచి పనులు జరగడానికి కొన్ని సార్లు ఇలా చేస్తానని మీ అమ్మ సంకల్పం గొప్పదని తాను సాధిస్తుంది దృఢ సంకల్పం ఉన్న వాళ్లని ఏ శక్తి ఆపలేదని అంటారు. ఇక లక్ష్మీ లేవడానికి ప్రయత్నిస్తుంది. జానుకి నీళ్లు తీసుకురమ్మని చెప్పి తన ముఖం మీద కొట్టమని చెప్తుంది. లక్ష్మీ లేవడానికి ప్రయత్నించి కళ్లు లేపలేక లేవడానికి ముఖం మీద కొట్టుకుంటుంది. ఇక ఆంజనేయ స్వామి పిల్లలో మీ అమ్మ వస్తుంది నా మొక్కు తనే చెల్లిస్తుందని అంటారు. లక్ష్మీ బలవంతంగా లేచి ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్తుంది.
ఇక మనీషా తల మీద ఆడవాళ్లందరూ బెల్లం బుట్ట దాని మీద అఖండ దీప పెడతారు. బరువు ఉందని చెప్పి మనీషా ఇబ్బంది పడుతుంది. మీకు అంతా ముందే తెలిసి నన్ను బుక్ చేశారా అని అంటుంది. మనీషా నడవలేక చాలా ఇబ్బంది పడుతుంది. మిత్ర వాళ్లు రావడంతో మనీషా ఏం కాదు బరువు లేదు ఎంత అయినా మోస్తానని చెప్తుంది. ఇబ్బంది అయితే ఆగిపో అని మిత్ర చెప్తాడు మనీషా మాత్రం వద్దని ప్రదక్షిణలు చేస్తానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: చక్రవర్తికి సర్‌ఫ్రైజ్ ఇచ్చిన క్రిష్.. మైత్రి ఇంట్లో హర్ష.. నందిని ఫైర్!