Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 3rd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: దేవుళ్లు సినిమాలో పిల్లల్లా ఇంటి నుంచి పారిపోయిన జున్ను, లక్కీ.. తల్లీదండ్రుల కోసం దీక్ష!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode తల్లిదండ్రులు విడిపోయేలా ఉన్నారని వాళ్లని ఒకటి చేయాలని జున్ను, లక్కీ ఇంటి నుంచి వెళ్లిపోయి దీక్ష ప్రారంభించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode ఉదయం లక్ష్మీ పిల్లల కోసం వెతుకుతుంది. ఇళ్లంతా అందరూ వెతుకుతారు ఎక్కడా పిల్లలు కనిపించరు. పొద్దున్నే మనకు చెప్పకుండా పిల్లలు ఎక్కడికి వెళ్లారు అని లక్ష్మీ కంగారు పడుతుంది. దాంతో మిత్ర కంగారు పడొద్దని సీసీ టీవీ ఫుటేజ్ చూడమని వివేక్‌కి చెప్తాడు. జున్ను, లక్కీ ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం సీసీ టీవీ ఫుటేజ్‌లో ఉంటుంది. అందరూ కంగారు పడతారు. లక్ష్మీ ఏడుస్తుంది.
జయదేవ్: నీకు ఇంకా అర్థం కాలేదా లక్ష్మీ పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోయారు.
మిత్ర: ఏంటున్నారు డాడ్ పిల్లలు వెళ్లిపోవడం ఏంటి.
జయదేవ్: ఇదిగో ఈ మనీషా వల్లే ఇదంతా జరిగింది. మొత్తం తనే చేసింది. పిల్లలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం నువ్వే. రాత్రి నువ్వు పిల్లల్ని తిట్టావ్. తోసేశావ్ వాళ్ల ముందు అనకూడని మాటలు అన్నావ్.
మిత్ర: నిజమా మనీషా నువ్వు తిట్టవా వాళ్లని ఏమన్నావ్.
జయదేవ్: అసలేం జరిగిందో చెప్పు లక్ష్మీ. మిత్రని పెళ్లి చేసుకోనున్నట్లు మనీషా చెప్పిందా లేదా. అందుకే పిల్లలు హర్ట్ అయి వెళ్లిపోయారు.
మనీషా: నేను అలా అనలేదు మిత్ర నా విషయంలో నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావ్ అని మాత్రమే చెప్పాను.
లక్ష్మీ: అబద్దం చెప్పకు మనీషా పిల్లలు మనసు గాయపరచకు అని చెప్పానా లేదా.
మనీషా: ఏం మాట్లాడుతున్నావ్ లక్ష్మీ పిల్లల్ని దాచి ఇలా నా మీద నింద వేస్తున్నావా.
లక్ష్మీ: నాటకాలు ఆడుతుంది నువ్వు. జరగని తప్పు జరిగింది అని రాని ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆయన మీద నిందలు వేస్తుంది నువ్వు.
మనీషా: మా మధ్య తప్పు జరగలేదని నువ్వు చూశావా.
లక్ష్మీ: చేయకూడని పనులు చేస్తున్నావ్ ఇంకెంత దిగజారి పోతావ్.
మనీషా: కొట్టడానికి చేయి ఎత్తి నన్నే అంత మాట అంటావా.
మిత్ర: మనీషా చేయి పట్టుకొని ఏంటి లక్ష్మీ మీద చేయి ఎత్తుతున్నావ్. ఇంకోసారి రిపీట్ చేయకు.
మనీషా: నన్ను ఏమందో విన్నావా మిత్ర నేను అబద్ధం చెప్తున్నానా నాటకాలు ఆడుతున్నానా.
మిత్ర: అవన్నీ తర్వాత చూద్దాం ముందు పిల్లల్ని వెతుకుదాం.
జయదేవ్: పిల్లలకు ఏమైనా నువ్వే కారణం అవుతావు మనీషా నిన్ను లక్ష్మీ వదిలినా నేను వదలను.
అందరూ వెతకడానికి వెళ్తారు. మనీషా తను ఏం మాట్లాడలేదని దేవయానితో అంటుంది. అందరూ తలో వైపు వెతుకుతారు. పిల్లలు ఇద్దరూ ఆంజనేయస్వామి విగ్రహం దగ్గరకు వెళ్లి పిలుస్తారు. మా అమ్మ చాలా కష్టాలు పడుతుంది. రా స్వామీ అని పిలుస్తారు. ఇంతలో పంతులు వచ్చి ఇక్కేడేం చేస్తున్నారు అని అడిగితే స్వామిని పిలుస్తున్నాం ఎప్పుడు పిలిచినా వచ్చేవారు కానీ ఇప్పుడు రావడం లేదని అంటారు. మీరు స్వామిని ఏమైనా కోరిక కోరుకుంటే ఆ మొక్కు తీర్చాలని అంటారు. కొంగ గుడికి వెళ్లాలని మొక్కుకున్నామని జున్ను అంటే దీక్ష చేసి వెళ్లండి అని అంటారు. లక్ష్మీ గుడికి వెళ్లి దండం పెట్టుకుంటుంది. దీక్ష చేయాలి అంటే డబ్బు కావాలని ఏం చేయాలా అని అనుకుంటారు.
పిల్లలు తల్లిదండ్రల ఫొటో పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే ఆ ఫొటో గుడిలో ఉన్న పనామె దగ్గరకు వెళ్తుంది. ఆవిడ లక్ష్మీ తమకు తెలుసు అని అనడంతో పిల్లలు ఆమెకు డబ్బులు అడుగుతారు. అమ్మానాన్నలు విడిపోయేలా ఉన్నారని తల్లిదండ్రులకు తెలీకుండా మాల వేసి మొక్కుతీర్చుకుంటామని అంటారు. ఇక ఈ విషయం లక్ష్మీకి చెప్పాలి అని పనామె డబ్బు తీసుకొస్తా అని చెప్పి లక్ష్మీకి ఫోన్ చేస్తుంది. ఫోన్ కలవదు. ఇక పిల్లలు పంతులకు సాయం అడుగుతారు. దేవుడే తనకు అవకాశం ఇచ్చారని పంతులు భావించి పిల్లలతో మాల వేయిస్తారు. ముడుపు కట్టి కొండ గట్టుకు వెళ్లమని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: చెల్లిని చావగొట్టిన దీప.. కన్నకూతురి చెంప పగలగొట్టిన సుమిత్ర.. దీప విశ్వరూపం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

