Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 29th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ఫైల్ కొట్టేసిన దేవయాని.. ముసుగు దొంగ దేవయానిని చితక్కొట్టిన వివేక్, జాను
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode దేవయాని మిత్ర గదిలోకి వెళ్లి ఫైల్ కొట్టేయడం, జాను, వివేక్లు దేవయాని స్మార్ట్ వాచ్ కొట్టేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర ఫైల్స్ చూస్తుంటే లక్ష్మీ తాను కూడా సాయం చేస్తానని అంటుంది. మిత్ర సరే అని చెప్తాడు. ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ టెండర్ పనులు చేస్తుంటారు. మనీషా, దేవయానిలు బయట నుంచి చూస్తుంటారు. వాళ్లు ఇంకా పడుకోలేదని దేవయాని అంటే ఆ ఫైల్ పూర్తి అయితేనే కొట్టేద్దాం అని అందుకు అర్థరాత్రి మంచిదని అంటుంది.
జాను, వివేక్లు దేవయాని స్మార్ట్ వాచ్ కొట్టేయాలని అందుకు రాత్రి ఒంటి గంటకు లేవాలని ఇద్దరూ అనుకొని అలారం పెట్టుకుంటారు. ఆ టైం అయితే మంచిదని అనుకుంటారు. వాచ్ కొట్టేసి వాళ్ల మాటలు వినేలా సెట్ చేసి మళ్లీ వాచ్ అక్కడ పెట్టేద్దామని అనుకుంటారు. లక్ష్మీ, మిత్రలు పని చేసి పడుకోవడంతో అది చూసిన మనీషా టైం ఒంటి గంట అయింది త్వరగా రండి అని దేవయానిని పిలుస్తుంది. దేవయాని నల్లరంగు బట్టలు క్యాప్, మాస్క్ వేసుకొని ముసుగు దొంగలా మారిపోతుంది. నాతో ఈ గెటప్ ఎందుకు వేయించావని దేవయాని అడిగితే మనీషా మీరే దొంగతనం చేయాలి అంటుంది. ఈ ముసుగులో మిమల్ని ఎవరూ కనిపెట్టలేరని ఉదయం అందరూ సీసీ కెమెరాల్లో చూస్తే ముసుగు దొంగ జాను మనిషి అని చెప్దామని అంటుంది. లక్ష్మీ తల కింద ఫైల్ ఉందని అప్పుడు లక్ష్మీ పని కూడా అయపోతుందని మనీషా చెప్తుంది.
దేవయాని మిత్ర, లక్ష్మీల గదిలోకి వెళ్లి చాటుగా ఫైల్ కొట్టేస్తుంది. మరోవైపు జాను అలారం మోగడంతో జాను లేచి వివేక్‌కి లేపుతుంది. ఇద్దరూ దేవయాని వాచ్ కొట్టేయడానికి వెళ్తారు. దేవయాని గదిలో మనీషాని చూసి షాక్ అవుతారు. మనీషా ఇంకా పడుకోలేదు అని దేవయాని ఎక్కడికి వెళ్లిందా అని అనుకుంటారు. ఇద్దరూ దాక్కొని చాటుగా ఉంటారు. మనీషా బయటకు వెళ్లగానే దేవయాని గదిలోకి వెళ్తారు. దేవయాని దొంగతనం చేసిన ఫైల్ బయటకు చేరవేయడానికి వెళ్తుంది. మరోవైపు వివేక్‌కి దేవయాని వాచ్ దొరుకుతుంది. ఇద్దరూ పట్టుకొని వెళ్తారు. తిరిగి వస్తుండగా జాను దేవయానిని చూసి దొంగ అనుకొని భర్తకి చెప్తుంది. వివేక్, జాను ఇద్దరూ ముసుగులో ఉన్న దేవయానిని చితక్కొట్టేస్తారు.
మనీషా చూసి ఆంటీ బుక్ అయిపోయింది నేను దొరికితే నా పని అయిపోతుందని దాక్కుంటుంది. దేవయాని మళ్లీ బయటకు పారిపోతుంది. తర్వాత గదిలోకి వచ్చి కొడుకు కోడలు కొట్టిన దెబ్బలకు ఒళ్లు హోనం అయిపోతుంది. మనీషా ఏం తెలీనట్లు ఏమైందని అడిగితే నా కొడుకు కోడలు చితక్కొట్టేశారని నొప్పులు పడుతుంది. ఫైల్ ఏది అని మనీషా అడిగితే బయట పడేశానని చెప్తుంది. మనీషా నెత్తి బాదుకొని బయటకు వెళ్తుంది. లక్ష్మీ నిద్రర్లో తనకు ఓ ఆడ బిడ్డ పుట్టినట్లు కల వస్తుంది. తుళ్లుపడి లక్ష్మీ లేస్తుంది. దాంతో కడియాలు విడిపోతాయి. జీవితంలో జరగని కల వచ్చిందని ఆ కల నిజం అయితే బాగున్ను అని లక్ష్మీ బాధ పడుతుంది. మనకు లక్కీ ఉందిలే లక్ష్మీ అని మిత్ర లక్ష్మికి సర్దిచెప్తాడు. ఇక ఇద్దరూ కడియాలు విడిపోయిన సంగతి గుర్తిస్తారు. పొద్దున్న కడియాలు తీసుకొని గుడికి వెళ్తానని లక్ష్మీ చెప్తుంది. ఉదయం లక్ష్మీ కడియాలు తీసుకొని గుడికి బయల్దేరుతుంది. ఎందుకు కడియాలు తీసేశారని పిల్లలు అడుగుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

