Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 26th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ, మిత్రల చేతికి సీతారాముల జంట కడియాలు.. మనీషా, మిత్రలకు కొంగుముడి పడనట్లేనా!!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషా, మిత్రలతో అరవింద కొంగుముడి పూజ చేయించాలి అనుకోవడం మిత్ర, లక్ష్మీలు చేతికి జంట కడియాలు పెట్టుకొని రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, మిత్ర ఇద్దరూ గుడికి వెళ్తారు. లక్ష్మీ పూజారితో ఓ పక్షి తన మీదకు వచ్చిందని గాజులు పగిలిపోయాయని ఏదైనా కీడు జరుగుతుందా అని అడుగుతుంది. దాంతో పంతులు మంగళవారం రోజు సుమంగళి గాజులు విరిగిపోవడం మంచిది కాదని చెప్తారు. అందుకు పరిహారంగా సీతారాముల గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేయమని చెప్తారు. పిల్లలు ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్తామని పరుగులు తీస్తారు.
అరవింద హాల్‌లో కూర్చొని ఉంటే సోదమ్మ ఇంట్లోకి వస్తుంది. దేవయాని ఆమె మీద అరుస్తుంటే అరవింద ఆపి ఆమెకు సోది చెప్పమని అంటుంది. సోదామె అరవిందతో నీ ఇంట అనుకోకుండా ఓ శుభకార్యం జరిగిందని నీ బిడ్డని గండాల నుంచి తప్పించే అదృష్టం వచ్చిందని కానీ కోడలు కొంగు ముడి పడకుండానే కడుపుతో ఉందని తల్లి కోరి వస్తున్న బిడ్డ కడుపులో ఉందని చెప్తుంది. కొడుకు కోడలికి కొంగు ముడి వేయించమని.. ముప్పూటలా ఇద్దరు ఒక్కటిగా ఉండాలని అప్పుడే కడుపులో బిడ్డ కష్టం లేకుండా పుడుతుందని చెప్తుంది. దేవయాని మనీషాని చూసి కింద ఇంత జరిగినా మీద నుంచి చూస్తుంది అంటే ఇదంతా మనీషా ప్లానే అయింటుందని అనుకుంటుంది.
సోదమ్మ చెప్పింది మనీషా, మిత్రలకు కొంగుముడి వేయాలని అరవింద అంటుంది. జాను, వివేక్‌లు ఇదంతా ప్లాన్ అనుకొని దేవయాని స్మార్ట్ వాచ్ కొట్టేసి ఇలా వాళ్ల ప్లాన్ పసిగడదామని అంటుంది. దేవయాని, మనీషాలు అదంతా తన ప్లానే అని అనుకుంటుంది. మూడు రాత్రులు మిత్రతో కలిసి ఉంటే లైఫ్ లాంగ్ కలిసే ఉంటామని మనీషా అనుకుంటుంది. ఇక లక్ష్మీ, మిత్రలు పూజలు చేస్తారు. పిల్లలు ఆంజనేయ స్వామితో మీ సీతారాముల మధ్య ఎవరైనా వస్తే ఊరుకుంటావా మరి మా అమ్మానాన్నల్ని నువ్వే కాపాడు అని అంటారు. ఇంతలో ఆంజనేయస్వామి తాతగా వచ్చి మీ అమ్మానాన్నల మధ్యకు ఎవరూ రాకూడదు అంటే వాళ్లని ఒక్కటిగా కట్టేయండి అంటారు.
లక్ష్మీ చెట్టు దగ్గర పూజ చేస్తుంటే జంటగా ఉన్న రెండు కడియాలు లక్ష్మీ ఒడిలో పడతాయి. వాటిని చూసి లక్ష్మీ పంతులుకి చూపిస్తుంది. అవి సీతారాముల కడియాలు అని సీతారాముల కల్యాణం రోజు జంట కడియాలను పెడతారని కల్యాణం తర్వాత ఈ చెట్టుకు పెడతారని అలాంటి పవిత్ర కడియాలు నీ ఒడిలో పడ్డాయంటే నువ్వు చాలా పుణ్యం చేసుకొని ఉంటావని అంటారు. పిల్లలు వాటిని తల్లిదండ్రులకు పెట్టేస్తారు. దేవుడు మీకు ఇదే పరిష్కారం చూపించారని మీకు జరగబోయే అనర్థం ఆపేది ఈ పవిత్రమైన కడియాలే అని మీ మధ్యకు ఏ చెడు రానివ్వవు అని వాటిని ఇలాగే ఉంచుకోవాలని అంటారు. అవి తీస్తే అనర్థం అని వాటి అంతట అవి విడిపోయే వరకు చేతికి ఉంచుకోవాలని పంతులు చెప్తారు. కడియాలు వాటి అంతట అవి విడిపోయే వరకు తీస్తే మా మీద ఒట్టే అని పిల్లలు అంటారు. పంతులు కూడా పిల్లలకు మాట ఇవ్వమని చెప్పడంతో లక్ష్మీ, మిత్రలు తాము వాటిని తీయమని చెప్పి మాట ఇస్తారు. పిల్లలు చాలా సంతోషిస్తారు.
అరవింద కొంగు ముడి కోసం పంతుల్ని పిలిచి ఏర్పాట్లు చేస్తుంది. దేవయానితో మనీషాని కిందకి తీసుకురమ్మని చెప్తుంది. మిత్ర, పిల్లలు అందరూ ఇంటికి వస్తారు. అరవింద మిత్ర వాళ్లతో ఇంట్లో పూజ ఉంది త్వరగా రెడీ అయి రమ్మని చెప్తుంది. లక్ష్మీతో పిల్లల్ని చూసుకోమని మిత్రకు పూజ ఉందని చెప్తుంది. దాంతో పిల్లలు అమ్మానాన్న చేతులకు కడియాలు ఉన్నాయని జంట కడియాలు చూపిస్తారు. వాటి గురించి అరవింద అడిగితే పిల్లలు విషయం చెప్తారు. ఆంజనేయ స్వామే మిత్ర, లక్ష్మీలను కలిపారని జయదేవ్ అంటారు. జాను, వివేక్‌లు చాలా సంతోషిస్తారు. అరవింద ఆ కడియాలు తీయమని మనీషాతో కలిసి పూజలో కూర్చొవాలి అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: త్రిపుర అఖండ జ్యోతి దీక్ష నెరవేరిందా...? ఆమెకు ఎదురైన అడ్డంకులు ఏంటి..?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

