Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: సంయుక్తే తన కోడలని తెలుసుకున్న జయదేవ్‌కి జున్ను మనవడని చెప్పేసిన లక్ష్మీ..!
chiranjeevi lakshmi sowbhagyavathi today episode సంయుక్తే తన కోడలని తెలుసుకున్న జయదేవ్‌కి జున్ను మిత్రకు, తనకు పుట్టిన కొడుకని లక్ష్మీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: వీడియో ప్లాన్ పనికి రాదని సంయుక్త అనడంతో మనీషా షాక్ అయిపోతుంది. ఈ వీడియో గురించి చెప్తున్నప్పుడు తను బెరకలేదు అని మనీషా అంటే తను లక్ష్మీ కాదు జేఎమ్మార్ కూతురు కాదని దేవయాని అంటుంది. అయినా మనీషా లక్ష్మీనే తను అని నిరూపిస్తాననని అనుకుంటుంది.
మరోవైపు జున్నతో లక్కీ వీడియో చూపించి తను మీ అమ్మే అంటుంది. జున్ను కాదని అంటాడు. లక్కీ తను మీ అమ్మే అని చెప్పి ఫోన్ తీసుకొని కిందకి వెళ్లి తన తండ్రితో పాటు అందరిని పిలుస్తుంది. జున్ను తల్లి వీడియో చూపిస్తానని అంటుంది. సంయుక్తగా ఉన్న లక్ష్మీ తన బండారం బయట పడిపోతుందని భయపడుతుంది. జాను, వివేక్‌లు కూడా టెన్షన్ పడతారు. లక్కీ తండ్రికి వీడియో చూపిస్తే అందులో వేరే వీడియో ఉంటుంది. ఇక జున్న వాళ్ల వీడియో అని ఫోన్ మొత్తం వెతుకుతుంది కానీ ఆ వీడియో మిస్ అయిపోయి ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో జున్ను ఆ వీడియోని లక్కీ ఫోన్ నుంచి డిలీట్ చేసేసి ఉంటాడు. ఇక వీడియో చూపించనందుకు లక్కీ సారీ చెప్పి వెళ్లిపోతుంది. జాను, వివేక్, లక్ష్మీలు ఊపిరి పీల్చుకుంటారు. ఇక కోపంగా మీదకు వెళ్లిన లక్కీతో జున్ను తనే ఆ వీడియోని డిలీట్ చేసేశానని అంటాడు. లక్కీ కూడా జున్నుని అర్థం చేసుకొని సారీ చెప్తుంది. లక్కీ మనసులో తను మీ అమ్మే అని నేను నిరూపిస్తానని అనుకుంటుంది.
లక్ష్మీ: నా దగ్గర ఎన్ని కారణాలు ఉన్నా పిల్లల కోసం ఈ కారణం సరిపోవడం లేదు జాను. అందరి దగ్గర నటించినట్లు పిల్లల దగ్గర నటించలేకపోతున్నా. వాళ్ల దగ్గర ఇంక నేను నటించలేను. నిజం చెప్పేస్తా.
జాను: అక్క వద్దక్కా తొందర పడి నిజం చెప్పొద్దు. అందరి కళ్లు నీ మీదే ఉన్నాయి. మనీషా నిన్ను లక్ష్మీగా నిరూపించాలని అనుకుంటుంది.
ఇక జయదేవ్ అక్కడికి వచ్చి తన కోడలు వెళ్లిపోవడం వల్ల ఇంటి వైభవం పోయిందని నువ్వు రావడంతో మళ్లీ ఇంటికి కల వచ్చిందని అరవింద నువ్వే తన కోడలు అని ఫీలవుతుందని.. నువ్వే తన కోడలు అని నువ్వు చెప్పేస్తే ఇంకా సంతోషపడుతుందని అంటాడు. జాను, వివేక్, సంయుక్తలు షాక్ అయిపోతారు. జయదేవ్ తనకు నిజం తెలిసిపోయిందని లక్ష్మీ వేషం మార్చినంత మాత్రానా నేను గుర్తుపట్టలేనా సంయుక్తనే నా కోడలు లక్ష్మీ అని నాకు ముందే తెలుసని జయదేవ్ షాక్ ఇస్తాడు. వివేక్ కవర్ చేయాలని చూసినా చూసినా జయదేవ్ మొదటి సారి సంయుక్తగా లక్ష్మీ మిత్రని కలిసి కాళ్లకు మొక్కడం అన్నీ చెప్తాడు. ఇక లక్ష్మీ పరిస్థితుల వల్ల ఇలా మార్చాల్సి వచ్చిందని క్షమించమని అంటుంది. దానికి జయదేవ్ నువ్వే మమల్ని క్షమించాలని అంటాడు. ఇక జున్ను మిత్ర గారి కొడుకని లక్ష్మీ జయదేవ్‌తో చెప్తుంది. జయదేవ్ షాక్ అయిపోతాడు. సంతోషంతో పొంగిపోతాడు. ఇక ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్తా అని జయదేవ్ అంటే లక్ష్మీ ఆపేస్తుంది. ఇక జయదేవ్ జున్నుని మనసారా హత్తుకుంటానని కిందకి వెళ్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.