అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today July 22nd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇరుక్కుపోయిన మనీషా.. సంయుక్త కచ్చితంగా లక్ష్మీనే అన్న మిత్ర, ఆధారాలు చూపించిన వివేక్!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode సంయుక్తగా ఉన్న లక్ష్మీని చూసి జున్ను, లక్కీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode సంయుక్తగా ఉన్న లక్ష్మీ మిత్ర కుటుంబంతో మాట్లాడి మిత్రకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఆ స్పర్శకి లక్ష్మీ గతంలోకి వెళ్తుంది. మిత్ర కూడా ఆలోచనలో పడతాడు. సంయుక్తని చూస్తూ ఉండిపోతాడు. ఇక సంయుక్త వెళ్లిపోతుంది. మిత్రని చూసినందుకు చేయి టచ్ చేయడం, కాళ్లకు దండం పెట్టుకోవడం గుర్తు చేసుకొని మురిసిపోతుంది. ఇక అక్కడికి అర్జున్, జాను, వివేక్‌లు వస్తారు. 

జాను: అది నేను నిన్ను ఇప్పుడు అక్క అని పిలవాలా సంయుక్త అని పిలవాలి.
సంయుక్త: వేషం మాత్రమే మారింది జాను. నేను మారలేదు. మనసు మారలేదు.
జాను: అసలు ఇదంతా ఏంటి అక్క. నాకు అర్థం కావడం లేదు. ఇన్ని మార్పులకు కారణం ఏంటి.
సంయుక్త: కొన్ని మంచి పనులు జరగడానికి కొన్ని వేషాలు వేయక తప్పదు. 
వివేక్ : అదే ఇదంతా ఎందుకు.
సంయుక్త: మిత్ర గారికి అడుగడుగునా వెంటుండి కాపాడుకోవాలి. మిత్ర మనీషాకి పెళ్లి జరగకుండా ఆపాలి. నీకు జానుకి ఎలా అయినా పెళ్లి జరిగేలా చూడాలి. అన్నింటికి మించి మనీషా నుంచి నందన్ కుంటుంబానికి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే నేను ఆ ఇంట్లో అడుగుపెట్టాలి. 
వివేక్: మరి హఠాత్తుగా ఈ జేఎమ్మార్ కూతురి నాటకం ఏంటి.
సంయుక్త: అది మీకు అర్థమవ్వాలి అంటే ఏం జరిగిందో తెలియాలి అని జేఎమ్మార్‌ని కలవడం ఆయన కూతురు లక్ష్మీలా ఉండటం ఆయన లక్ష్మీని సంయుక్తగా ఉండమని దానికి అర్జున్ ఒప్పించడం మొత్తం లక్ష్మీ అలియాస్ సంయుక్త జాను, వివేక్‌లకు చెప్తుంది. అడుగు ఎటు వేయాలో తెలియని నాకు అర్జున్‌ గారు ఓ దారి చూపించారు. అర్జున్ గారు ధైర్యం ఇవ్వకపోతే నేను ఎటూ తేల్చుకోలేపోయేదాన్ని. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేపోయేదాన్ని. 
జాను: ఎవరికీ సాధ్యం కాని ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నావ్ అక్క. ఏదో ఒక రోజు ఇది నాటకం అని తెలిస్తే. మళ్లీ నువ్వు తప్పు చేశావ్ అంటారేమో అక్క.
అర్జున్: అలా అని ఇప్పుడు వెనకడుగు వేస్తే లక్ష్మీ ముందుకు వెళ్లలేదు. అనుకున్నవి సాధించలేదు. 
వివేక్: మీరు చెప్తుంది నిజమే అర్జున్ గారు కానీ ఎదో ఒక రోజు అందరికీ నిజం తెలిస్తే వదినను ఎంత నిందిస్తారో అర్థం చేసుకోండి. 
అర్జున్: ఎవరో నిందిస్తారు అని లక్ష్మీ ఆగిపోకూడదు. తన బాధ్యతలు నెరవేర్చుకోవడానికి ముందుడుగు వేసింది అది అర్థం చేసుకుంటారో అపనిందలు వేస్తారో వాళ్ల ఇష్టం. 
వివేక్: మీరు చెప్పింది నిజమే అర్జున్ గారు మేం వదినకు సపోర్ట్ చేస్తాం.
సంయుక్త: అంతా బాగుంది కానీ ఆ మనీషాతోనే జాగ్రత్తగా ఉండాలి. మనీషాలో ఇప్పటికే అనుమానం మొదలైంది. తన అనుమానం పక్కవాళ్లకి పాకొచ్చు. 
వివేక్: ఆ విషయంలో అయితే మీరు అస్సలు టెన్షన్ పడొక్కర్లేదు వదిన. అందరి దగ్గర మెప్పు పొందడానికి జేఎమ్మార్ కూతురు తనకు క్లోజ్ ఫ్రెండ్ అని నోటికి వచ్చిందని మాట్లాడింది. మా మామ్ అలా చెప్పించింది. నిజానికి వాళ్లిద్దరికీ నువ్వే లక్ష్మీ అని తెలిసినా నోరు తెరవలేరు. 
జాను: కానీ అనుమానం రాకుండా చూసుకోవడం ముఖ్యం కదా.
అర్జున్: దాని కోసం నా దగ్గర ఓ ఐడియా ఉంది. అని తన ఐడియా చెప్తాడు. ఇలా చేస్తే వాళ్లకు అనుమానం రాకుండా కాదు వచ్చిన అనుమానాలు తొలగిపోతాయి. కానీ జాగ్రత్త వివేక్ ఇదంతా నీ మీదే ఆధారపడి ఉంది. సరే లక్ష్మీ మేం నీతో ఎక్కువ మాట్లాడితే అందరికీ అనుమానం వస్తుంది. మేం వెళ్తాం.  ఇంకోమాట జేఎమ్మార్ గారు నిన్ను నమ్మి ఓ పెద్ద బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతకు నువ్వు వంద శాతం న్యాయం చేయాలి అని గుర్తు పెట్టుకో.

మిత్ర, అరవింద అందరూ సంయుక్త గురించి ఆలోచిస్తారు. అచ్చుగుద్దినట్లు లక్ష్మీ సంయుక్త ఒకేలా ఉండటం ఏంటని అనుకుంటారు. లక్ష్మీని చూసినట్లు ఉందని అంటుంది. ఇక మనీషా అయితే తను లక్ష్మీనే అని అనుమానంగా ఉందని అందరికీ చెప్తుంది. కచ్చితంగా తను లక్ష్మీనే అని చెప్తుంది. దేవయాని కొట్టి పడేస్తుంది. ఇక మిత్ర కూడా తనకి సంయుక్త లక్ష్మీనే అని అనిపిస్తుందని సంయుక్త మొత్తం లక్ష్మీగానే ఉందని అన్నింటికంటే ముఖ్యంగా తన స్పర్శ తనకు తెలుస్తుందని ఆ స్పర్శని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని తను లక్ష్మీనే అని మిత్ర చెప్తాడు. 

వివేక్: మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అన్నయ్య తను లక్ష్మీనే. 
మిత్ర: నువ్వు కూడా ఇలా మాట్లాడుతావేంటిరా. తను లక్ష్మీ అయితే ఇదంతా ఏంటి. 
వివేక్: నేను మీలా అనుమానపడ్డాను. కానీ తర్వాత తెలిసింది అసలు విషయం ఏంటో అని. ఇక వివేక్ తన కుటుంబానికి సంయుక్త పాత ఫొటోలు చూపిస్తాడు. 
మిత్ర తండ్రి: నిజమేరా డౌటే లేదు ఈ అమ్మాయి జేఎమ్మార్ గారి కూతురే. 
మిత్ర: మనసులో.. అలా అయితే తన స్పర్శ సేమ్ లక్ష్మీలా ఎందుకు ఉంది. ఆ స్పర్శ అబద్ధమా.. మనీషా నువ్వు సంయుక్తతో కలిసి చదువుకున్నాను అన్నావు కదా.
మనీషా: అమ్మో ఇప్పుడు ఈ పాయింట్ తీశాడేంటి. అవును మిత్ర నేను సంయుక్త కలిసి చదువుకున్నాం. 
మిత్ర: అలా అయితే నువ్వు నా పెళ్లిలో లక్ష్మీ కంటే ముందు సంయుక్తనే కలిసుండాలి. మరి లక్ష్మీని మొదటి సారి చూసినందుకు  నీకు సంయుక్త ఎందుకు గుర్తు రాలేదు. లక్ష్మీలా మరో అమ్మాయి ఉందని ఎందుకు చెప్పలేదు. 
మనీషా: దొరికిపోయాను. 
దేవయాని: అమ్మో ఇప్పుడు మనీషా ఏం చెప్పి కవర్ చేస్తుంది. 
వివేక్: ఇప్పుడు మనీషా దొరికిపోవడం ఖాయం.
మిత్ర: నీకు లక్ష్మీని చూసినప్పుడు సంయుక్త గుర్తు రాలేదు అంటే అసలు మీరు కలిసి చదువుకున్నారా. లేక మాకు అబద్ధం చెప్పావా. 
మనీషా: అదేం లేదు మిత్ర. నేను చదువుకున్నప్పుడు మీ పెళ్లికి చాలా టైం ఉంది కదా అందుకే నేను గుర్తు చేసుకోలేపోయాను. కానీ ఇప్పుడనిపిస్తుంది ఇద్దరూ ఒకేలా ఉన్నారని తను సంయుక్తనే.

ఇక సంయుక్త తన స్పీచ్ ఇవ్వబోతుందని అనౌస్స్ చేస్తారు. ఇక అర్జున్ పక్కనే ఉన్న జున్ను లక్ష్మీని చూస్తే గొడవ చేస్తాడని లక్ష్మీని జున్ను చూడకూడదని అనుకుంటాడు. ఇక లక్కీ కూడా ఇంపార్టెంట్ వ్యక్తి ఎప్పుడు కనిపిస్తారని అడుగుతుంది. ఇక సంయుక్త స్టేజ్ మీదకు వస్తుంది. తనని చూసి జున్ను, లక్కీ ఇద్దరూ షాక్ అవుతారు దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: పుర్రెలదీవికి మంచంతో పాటు ఎగిరిపోయిన నయని, గాయత్రీపాప.. పాప బలి తప్పదా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget