Trinayani Serial Today July 22nd: 'త్రినయని' సీరియల్: పుర్రెలదీవికి మంచంతో పాటు ఎగిరిపోయిన నయని, గాయత్రీపాప.. పాప బలి తప్పదా!
Trinayani Serial Today Episode గంటలమ్మ ఇచ్చిన విభూది వల్ల గాయత్రీ పాప మంచం మీద నుంచి ఎగిరిపోగా నయని కూడా అదే మంచం ఎక్కి పుర్రెలదీవికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode గంటలమ్మ వెళ్తూ వెళ్తూ పోయొస్తానే పిల్లా అని గాయత్రీ పాపని చూసి ఎందుకు అనిందో అని హాసిని నయని, విశాల్‌లను అడుగుతుంది. పిల్లలు ఇష్టం ఉండి అలా ఉంటుందని విశాల్ అంటాడు. ఇక నయని గాయత్రీ అమ్మగారి ఆత్మను సంరక్షించుకోవాలని మరోవైపు గాయత్రీ దేవిగారి పునర్జన్మలో ఆశ్రయించిన ఆ దేహానికి గండం రాకుండా చూడాలని అంటుంది.
హాసిని: రెండు ఒకేలా అనిపించినా ప్రయత్నాలు రెండు వైపులా చేయాలి.
విశాల్: ఏది ఏమైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
సుమన: ఈ ఇంటికి పట్టిన ఆత్మకు విముక్తి కలుగుతుందని గంటలమ్మ చెప్పింది కదా. గాయత్రీదేవి అత్తయ్య ఆత్మ వెళ్లిపోతే మా అక్క కన్న తొలిబిడ్డ జాడ కూడా ఈ జన్మలో దొరకదు అనే కదా.
విక్రాంత్: ఇంత పైశాచికం ఏంటే నీకు. ఒకరు బాధ పడితే ఇంత ఆనంద పడతావా.
సుమన: కోట్లు ఉన్నాయని ఫోజులు కొట్టే మా అక్క ఫ్యూజులు ఎగిరిపోతాయి. మీ పెద్దమ్మ ఆత్మే మాకు అండ అన్నది కదా రేపటి నుంచి ఆపద్భాంధవులు ఎవరూ ఉండరు.
విక్రాంత్: ఏమీ లేని ఆకువు నువ్వు. రెపరెపలాడుతావ్ నువ్వు. గంట ఊపుకుంటూ వచ్చిన ఆ గంటలమ్మని మా అమ్మ నమ్మడం ఆవిడ ఏదో చెప్తే అది అవుతుందని నువ్వు నమ్మడం. ఛీ.. ఛీ..
తిలోత్తమ, వల్లభలు గంటలమ్మ ఇచ్చిన విభూదిని గాయత్రీ పాప పడుకున్న మంచం కోళ్లకి రాస్తారు. ఇక నయని గాయత్రీ పాపని ఆడిపించుకుంటూ తీసుకొచ్చి పాపని విభూది రాసిన మంచం మీద పడుకోపెడుతుంది. తిలోత్తమ, వల్లభలు చాటుగా దాక్కుంటూరు. ఇక నయని పని ఉందని కిచెన్‌కి వెళ్తుంది. నయని పాపని పడుకోపెట్టి కిందకి వచ్చే సరికి పెద్ద గాలి వీస్తుంది. నయనికి ఏదో జరుగుతుందని అనుమానం వస్తుంది. తన బిడ్డకి ప్రాణ గండం ఉందని గురువుగారు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని కుడి కన్ను అదురుతుంది. అపశకునంలా అనిపిస్తుందని కొంగుకు కట్టుకున్న మంత్ర పుష్పం చూస్తూ గాయత్రీ అమ్మగారికి గండం వస్తుందేమో అని అనుకుంటుంది. ఇక గాలికి గాయత్రీ పాప ఏడ్చేలా ఉందని మీదకు పరుగులు తీస్తుంది. నయని వెళ్లే సరికి గంటలమ్మ ఇచ్చిన విభూది ఫలితంగా మంచం కదులుతూ గాల్లో తేలుతుంది. మంచం ఎగురిపోయే టైంకి నయని వస్తుంది. గాయత్రీ గాయత్రీ అని అరుస్తూ పరుగున మంచం మీదకు ఎక్కిపోతుంది. ఇక నయని, గాయత్రీ పాప ఇద్దరూ మంచం మీద ఎగురుకుంటూ గాల్లో ప్రయాణిస్తారు. గాయత్రీ పాప లేస్తే భయపడుతుందని నయని అనుకుంటుంది. ఇద్దరూ
ఎగురుతూ పుర్రెల దీవికి వెళ్లిపోతారు. అక్కడ మాంత్రికుడు రక్త చాముండికి పూజలు చేస్తాడు.
నయని: ఏయ్ ఎవరు నువ్వు.
మాంత్రికుడు: నువ్వు ఎవరు.
నయని: త్రినయని..
మాంత్రికుడు: త్రినయని అనే పేరు గల సాధ్వీమని నువ్వేనా.
నయని: నీకు నేనే తెలుసా. నేను ఎప్పుడూ ఇలాంటి చోటుకి రాలేదు. ఏం చేస్తున్నావ్ ఇక్కడ.
మాంత్రికుడు: నా పేరు రక్తపుంజి. ఎప్పుడూ విని ఉండవు. రక్త చాముండీ ఆరాధకుడిని. తాంత్రిక శక్తిని కూడగట్టుకోవడానికి తల్లిని బలి ఇస్తుంటామ్ చూస్తున్నావ్ కదా పుర్రెలదీవి ఎలా ఉందో.
నయని: పిచ్చి ప్రయత్నాలు మానుకో నా బిడ్డ నిద్ర పోతుంది. నిన్ను చూస్తే ఏడుస్తుంది.
మాంత్రికుడు నయనిని ఎటూ కదలకుండా అగ్నితో బంధించేస్తాడు. ఇక గాయత్రీ పాప దగ్గరకు వెళ్తాడు. పుర్రెలదిబ్బలో పడుకున్నావా పాప రక్త చాముండి నిన్ను పిలుస్తుంది రా అని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తాడు. నయని వద్దు నా బిడ్డను ఏం చేయొద్దని ఏడుస్తుంది. మాంత్రికుడు గాయత్రీని తన మంత్ర దండంతో మాయం చేసేస్తాడు. ఇక ఇంట్లో అందరూ నయని, గాయత్రీ పాప కలిపించడం లేదని టెన్షన్ పడతారు. తిలోత్తమ తనకు ఏం తెలీనట్లు నటిస్తుంది. ఎక్కడికీ వెళ్లిందని విశాల్ బాధ పడతాడు. సుమన విశాల్‌తో మీ కన్న తొలిబిడ్డకు ప్రాణం గండం కాబట్టి కాపాడటానికి వెళ్లుంటుందని అంటుంది. మరోవైపు నయని ఏడుస్తుంటే గాయత్రీ పాప కోసం ఏడుస్తుంది. ఇంతలో గాయత్రీదేవి ఆత్మ వస్తుంది. నయనికి బయట పడొద్దని చెప్తుంది. నయని తన బిడ్డని కాపాడమని వేడుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.