అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: సంయుక్తని కలుసుకున్న మిత్ర ఫ్యామిలీ.. తెలివిగా భర్త కాళ్లకు దండం పెట్టిన లక్ష్మీ!

chiranjeevi lakshmi sowbhagyavathi today episode మిత్ర కుటుంబాన్ని పరిచయం చేసుకున్న సంయుక్త ఎవరికీ తెలీకుండా మిత్ర కాళ్లకు దండం పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: లక్ష్మీని సంయుక్తగా పరిచయం చేయడానికి ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. మిత్ర కుటుంబంతో వస్తాడు. అర్జున్, జున్న, జానులు వస్తారు. మిత్ర అర్జున్‌తో హర్టింగ్‌గా మాట్లాడటంతో మిత్ర తండ్రి మిత్రను తీసుకెళ్లి ఎందుకు అర్జున్‌తో అంత కఠినంగా మాట్లాడుతున్నావని అడుగుతారు. దానికి మిత్ర అర్జున్ తనకు పోటీగా వస్తున్నాడని అందుకే తన అలా ప్రవర్తిస్తున్నానని అంటాడు. ఇక మిత్ర మనీషా వాళ్లతో సంయుక్తని సెలబ్రిటీలా చూస్తారని అందరిలా మీద మీద పడిపోకుండా ప్రవర్తించాలిని చెప్తాడు. ఇక దేవయాని, మనీషాలు సంయుక్తని మచ్చిక చేసుకోవాలని అనుకుంటారు.

వివేక్: అవును జాను వదిన ఎందుకు రాలేదు. వదిన ప్లేస్‌లో నువ్వు ఎందుకు వచ్చావ్.
జాను: అయ్యో వివేక్ అక్క వస్తే ఇంట్లో అందరూ చూస్తారు. కదా రకరకాల ప్రశ్నలు వేస్తారు కదా. అక్క ఏం సమాధానం చెప్తుంది. అక్క రాదు కానీ ఇంకేదో సర్‌ఫ్రైజ్ ఉందని అర్జున్ గారు నాతో చెప్పారు. అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అదేంటో నాకు తెలిదా.
వివేక్: అయితే వదిన ఇక్కడికి రాదు కదా.
జాను: అంతే కదా.
అర్జున్: లేదు జాను లక్ష్మీ వస్తుంది. లక్ష్మీ ఇన్ని రోజులు ఓ గూటిలో పక్షిలో అజ్ఞాతంలో గడుపుతోంది. ఇక ఇప్పుడు  లక్ష్మీ తనకు వచ్చిన ఓ అవకాశాన్ని వాడుకోబోతుంది. 
జాను: అసలు అక్క ఎప్పుడు రాబోతుంది.
అర్జున్: అటు చూడండి.

లక్ష్మీ సంయుక్తగా మోడ్రన్ డ్రస్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. పార్టీ దగ్గరకు సంయుక్త రావడంతో అందరూ చుట్టు ముడతారు. మిత్ర ఫ్యామిలీ మాత్రం వెళ్లదు. జాను, వివేక్ సంయుక్తగా ఉన్న లక్ష్మీని చూసి షాక్ అయిపోతారు. మనీషా, దేవయానిలు బొకే తీసుకొని వెళ్తారు. మిత్ర ఫ్యామిలీ దూరం  నుంచి సంయుక్తని చూడాటానికి ప్రయత్నిస్తారు. కానీ చూడలేదు. ఇక మనీషా, దేవయాని వెళ్లి సంయుక్త అచ్చం లక్ష్మీగా ఉండటంతో బిత్తర పోతారు. సంయుక్తగా ఉన్న లక్ష్మీ ఇంగ్లీష్‌లో మీరు నా వైపు ఎందుకు అలా చూస్తున్నారని అడుగుతుంది. సంయుక్తా అమెరికా అమ్మాయిలా మాట్లాడుతుంది. ఇద్దరి దగ్గర నుంచి అడిగి మరి బొకే తీసుకుంటుంది. ఇక దేవయాని మీరు ఎవరు అంటే జేఎమ్మార్ కూతురు సంయుక్త సంయు అని అంటుంది. 

జాను: అర్జున్ గారు తను అక్కేనా..లేదంటే అక్కలా ఉన్న మరో అమ్మాయా.
వివేక్: చెప్పండి అర్జున్ గారు. మీరు చెప్పిన సర్‌ఫ్రైజ్ ఇదేనా. అసలు ఎవరు తను. వదినేనా.
అర్జున్: చెప్పాను కదా భగవంతుడు అవతారాలు మార్చినట్లే ఇప్పుడు లక్ష్మీ కూడా జేఎమ్మార్ కూతురు అవతారం ఎత్తింది. పదండి.

అర్జున్‌ని పీఏ సంయుక్తకి గొప్పగా పరిచయం చేస్తుంది. ఇక జాను వివేక్‌లు కూడా అక్కడికి వెళ్తారు. జాను అక్క తనని పలకరించలేదని అంటే లక్ష్మీ సంయుక్తగా ఉందని అందుకే తాను సంయుక్తలా ప్రవర్తిస్తుందని చెప్తాడు. చుట్టూ ఉన్న జనాలను చూస్తే భయంగా ఉందని అక్క ఎలా మ్యానేజ్ చేస్తుందని జాను అంటుంది. అర్జున్ కంగారు పడొద్దని జానుకి చెప్తాడు. ఇక మనీషా, దేవయానిలు సంయుక్త లక్ష్మీనేనా అని అనుకుంటారు. మనకు చాలా పెద్ద షాక్ తగిలిందని మిత్ర వాళ్లకు ఇంకెతలా ఉంటుందో అని అనుకుంటారు. సంయుక్త దగ్గరకు వెళ్దామని మిత్రతో తండ్రి అంటే లేటుగా పలకరిద్దామని మిత్ర అంటాడు. ఇక పీఏ వచ్చి మిత్రని పరిచయం చేసుకోమని అంటుంది. మిత్ర ఫ్యామిలీ బొకే తీసుకొని వెళ్తారు. మిత్ర, అరవింద, మిత్ర తండ్రి లక్ష్మీని చూసి షాక్ అయిపోతారు. 

అరవింద: మరీ అచ్చు గుద్ది నట్లు లక్ష్మీలానే ఉందేంటి. 
మిత్ర: లక్ష్మీలా ఉందేంటి. అని లక్ష్మీ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. 
సంయుక్త: ఎక్స్‌క్యూజ్మి నన్ను మీరు ఎందుకు అంత వింతలా చూస్తున్నారు. ఎనీథింగ్ రాంగ్.
మిత్ర: నథింగ్ వెల్‌కమ్‌టూ ఇండియా.
సంయుక్త: యువర్ మిత్ర రైట్, నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్. మిత్ర గారు మీరు మీ నాన్న స్థాపించిన కంపెనీని డెవలప్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారంట. మీలాంటి వారిని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా టాలెంట్ ఉన్నవారని తెలుసుకున్నాను. కానీ ఈ ప్రాజెక్ట్‌కి మీలా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఆల్ ది బెస్ట్.
మనీషా: చూశారా అంటీ మనలానే వాళ్లు ఎలా షాక్ అయ్యారో. ఎలా నోరెళ్లబెట్టారో.
దేవయాని: తను అచ్చం లక్ష్మీలా ఉంటే ఎవరికైనా షాక్ ఉంటుంది కదా.
మనీషా: తను లక్ష్మీలా ఉండటం కాదు. తనే లక్ష్మీ అని నా అనుమానం. 

సంయుక్త ఫోన్ కింద పడిపోవడంతో ఫోన్ తీసినట్లు మిత్ర కాళ్లకు దండం పెడుతుంది. ఇక మిత్రకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. మిత్ర ఆ స్పర్శకి అలా ఉండిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తల్లి పుట్టింటి గురించి తెలుసుకున్న రామ్.. అమ్మమ్మ, మామలను పట్టుకొని ఎమోషనల్..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget