అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: లక్ష్మీని ఉద్యోగం నుంచి తీసేసిన అర్జున్.. జేఎమ్మార్‌ని ఇంప్రెస్ చేసేదెవరు.. ప్రాజెక్ట్ దక్కించుకునేదెవరు? 

chiranjeevi lakshmi sowbhagyavathi today episode జేఎమ్మార్ ప్రాజెక్ట్ కోసం మిత్రకు ప్రత్యర్థిగా లక్ష్మీ ఉండకూడదని అర్జున్ లక్ష్మీని ఉద్యోగం నుంచి తీసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: మిత్ర తన భర్త అని లక్ష్మీ అర్జున్, వసుంధరలకు చెప్తుంది. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని అర్జున్ అడుగుతాడు. దానికి లక్ష్మీ మనీషా చేసిన కుట్ర, మనీషాకు ఇచ్చిన మాట గురించి చెప్తుంది. తన అత్తయ్య కారణంగా మనీషా తల్లి ఎలా చనిపోయిందో చెప్తుంది. తర్వాత భాస్కర్ ఇంటికి చేరడం తర్వాత అక్కడ నుంచి బిడ్డను తీసుకొని రావడం ఆర్జున్‌కి యాక్సిడెంట్ అవడంతో కాపాడి ఈ ఇంటికి చేరడం వరకు మొత్తం చెప్తుంది. 

లక్ష్మీ: మిత్రగారు, మా అత్తయ్య గారు, నందన్ కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే నేను తిరిగి ఆ ఇంటి గడప తొక్క కూడదు. తిరిని నేను మిత్ర గారి భార్య స్థానాన్నిపొందాలని ఆశ పడకూడదు. జీవితాంతం ఇలా అజ్ఞాతంలో ఉండాల్సిందే. అందుకే నా గతం గురించి ఎవరికీ చెప్పకూడదు అనుకున్నా. అందుకే నన్ను ఇంత ప్రేమించే మీకు కూడా చెప్పకూడదు అనుకున్నా. నన్ను క్షమించండి. ఒకప్పుడు ఏ దిక్కూ లేని నాకు మీరే దిక్కు అయ్యారు. అండ అయ్యారు. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నేను సంతోషంగా లేను అర్జున్ గారు. ఇప్పుడు నా ముందు మరికొన్ని సమస్యలు పడ్డాయి. వాటిని పరిష్కరించడానికి నాకు మీ సాయం కూడా కావాలి. మీరు ఎప్పటిలా నాకు తోడుగా అండగా ఉంటారని భావిస్తున్నా.
వసుంధర: పోనీలేరా తన చుట్టూ ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా చివరకు మన గూటికి చేరడానికి ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. ఆ పైవాడు లక్ష్మీని ఇక్కడికి పంపాడు అంటే లక్ష్మీకి కొత్త జీవితం ఇవ్వాడానికే అయింటుంది. తన రాతతో మన జీవితాలు ముడి పెట్టడానికే అయింటుంది. 
అర్జున్: మనసులో.. ఇప్పుడు లక్ష్మీ నన్ను నమ్ముతుంది. అందుకే తన గతం పూసగుచ్చినట్లు చెప్పేసింది. తన భర్త దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ఇకపై నాతో ఉండాలి అనుకుంటుంది. అందుకే తనకి నేను తోడుగా ఉండాలి అనుకుంటుంది. ఏదో ఏమైనా అర్ధాంతరంగా ఆగిపోయిన తన జీవితానికి నేను అండగా ఉండాలి. నేనే జీవం పోయాలి.

పేపర్ చూస్తున్న మిత్రను తన తండ్రి ఆనందంతో మిత్రని హడావుడిగా పిలుస్తాడు. మిత్ర, లక్కీ, అరవిందతో పాటు అందరూ వస్తారు. జేఎమ్‌ఆర్ స్వదేశానికి తిరిగి వస్తున్నారన్న వార్త చెప్తాడు. పెద్ద బిజినెస్ మాన్ అయిన జేఎమ్‌ఆర్ మరో పెద్ద బిజినెస్‌లు ఇండియాలో చేయనున్నారని వార్తలు వస్తుంది. అది చూసి మిత్ర చాలా సంతోషిస్తాడు. జేఎమ్‌ఆర్ ప్రాజెక్ట్ సంపాదించే అవకాశం వచ్చిందని చాలా సంతోషపడతాడు. ఎలా అయినా ప్రాజెక్ట్ దక్కించుకోవాలని అంటాడు. ఈ ప్రాజెక్ట్ బరిలో అర్జున్ కూడా ఉన్నాడని.. జాగ్రత్తగా ఉండాలని మిత్ర తండ్రి చెప్తాడు. మనీషా మిత్రకు సపోర్ట్‌గా మాట్లాడుతుంది. మిత్ర కూడా అర్జున్‌ని తక్కువ చేసి మాట్లాడుతాడు. అర్జున్‌ వెనకున్న ఆ లేడీ వల్లే ప్రాజెక్ట్ దక్కించుకున్నాడని మిత్ర అంటాడు. అది విన్న లక్కీ జున్ను వాళ్ల అమ్మ అది అని లక్ష్మీ ఫోటో చూపిస్తాను అని పరుగులు తీస్తుంది. వివేక్ లక్ష్మీ గురించి తెలిసిపోతుందని టెన్షన్ పడతాడు. లక్ష్మీ ఫొటో లక్కీ చూపించే టైంకి దేవయాని ఫోన్ తీసుకొని సైలెంట్‌గా ఉండమని అంటుంది. 

ఇక వివేక్ పెళ్లి గురించి మాట్లాడటం వల్లే ఇంకో గుడ్ న్యూస్ తెలిసిందని వివేక్ పెళ్లితో పాటు మిత్ర, మనీషాల పెళ్లి చేసేద్దామని అంటుంది. ఎందుకు సైలెంట్ అయిపోయావ్ అని మనీషా అడుగుతుంది. దానికి మిత్ర జేఎమ్‌ఆర్ దగ్గర ప్రాజెక్ట్ దక్కించుకోవడమే ప్రస్తుతం తన లక్ష్యమని తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని అంటాడు. మరోవైపు వసుంధర దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి లక్ష్మీ స్థానంలో తాను పని చేస్తానని అంటాడు. లక్ష్మీ, వసుంధర షాక్ అవుతారు. అర్జున్ రమేశ్‌ని తానే అపాయింట్ చేశానని అంటాడు. లక్ష్మీ ప్లేస్ వేరే వాళ్లకి ఎలా ఇస్తావ్ అని వసుంధర కొడుకుని అడుగుతుంది. 

అర్జున్: సారీ లక్ష్మీ నిన్ను అడిగే నేను నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ నువ్వు నా నిర్ణయం గౌరవిస్తావని నేనే తీసుకున్నా.
వసుంధర: అదే ఎందుకు అని..
అర్జున్: ఇప్పుడు నేను ట్రై చేయబోయే ప్రాజెక్ట్ చాలా పెద్దది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైంది. దీనికోసం నాతో పోటీ పడేది మిత్ర. నేను మిత్రతో పోటీ పడేటప్పుడు లక్ష్మీ నాకు సపోర్ట్‌గా మిత్రకు ప్రత్యర్థిగా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే ప్రస్తుతం లక్ష్మీ చేసే ఉద్యోగం మరొకరికి ఇవ్వాల్సి వచ్చింది. 
లక్ష్మీ: మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది. 

ఇక జున్ను లక్ష్మీని తనని డ్రాప్ చేయమని అంటే అర్జున్ తాను డ్రాప్ చేస్తా అని తీసుకెళ్తాడు. ఇక వసుంధర లక్ష్మీతో అర్జున్ నిర్ణయం నీకు నిజంగానే ఇష్టమేనా అని అడుగుతుంది. ఇక లక్ష్మీ గుడికి వెళ్లి వస్తానని వెళ్తుంది. మరోవైపు జేఎమ్ఆర్ గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తారు. తాను రావడం ఎవరికీ తెలీకూడదు అంటే దేశమంతా చెప్పారేంటి అని పీఏ మీద సీరియస్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: తెలుగింటి పాలసంద్రంలా ముస్తాబైనా శ్రీముఖి.. బాపుగారి బొమ్మలా మారిన యాంకర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
Embed widget