Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 2nd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అనుకున్నదొకటి.. అయినది ఒకటి.. బోల్తా కొట్టిందిలే జాను ప్లానూ!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode పొలం అమ్మడం విషయంలో లక్ష్మీ జానుకి షాక్ ఇవ్వడం మనీషాకి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ తన తాతయ్యకి పొలం డాక్యుమెంట్లు పట్టుకొని ఇంటికి పిలుస్తుంది. జాను వాళ్లు చూసి తన కోసం అక్క ఆస్తి అమ్మడానికి పిలిచిందని అనుకుంటుంది. మిత్ర, జయదేవ్‌లు ఆస్తి అమ్మొద్దని లక్ష్మీతో చెప్తారు. దానికి లక్ష్మీ వాళ్లని పిలిచింది ఆస్తి అమ్మడానికి కాదని ఆ పొలంలో పిడికెడు మట్టి కూడా తీయనివ్వను అని అంటుంది. ఎందుకు తాతయ్యని రమ్మన్నానో మీకు తెలుస్తుంది కిందకి రండి అని పిలుస్తుంది.
మనీషా: పొలం కొనడానికి వచ్చిన వారికి మర్యాదలు చేసి అక్కాచెల్లెళ్లు సంతకాలు పెట్టడానికి రెడీగా ఉన్నారు పెద్దాయన డాక్యుమెంట్స్‌తో వచ్చారు ఈ రోజే మిగతా డబ్బు రెడీ చేసుకోండి.
దేవయాని: ఇన్ని రోజులు అడ్డంగా దున్నుకున్న పొలం అక్కాచెల్లెళ్లు అమ్ముకుంటుంటే పెద్దాయన గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది.
వివేక్: మామ్ ఎందుకు ఆయన్ని బాధ పెట్టేలా మాట్లాడుతావు.
లక్ష్మీ: పోయిన సారి జాను అంత కంటే పెద్ద మాటలు మాట్లాడి ఇంకా బాధ పెట్టిందిలే వివేక్ ఇప్పుడు నేను మళ్లీ ఆయన్ను పిలిచి బాధ పెట్టాను నన్ను క్షమించండి తాతయ్య గారు.
తాతయ్య: పర్వాలేదులే అమ్మ మీ అక్కాచెల్లెళ్ల సమస్య పరిష్కారం కోసమే కదా పిలిచావు.
జాను: అయితే త్వరగా పరిష్కరించండి ఇంకెంత సేపు వెయిట్ చేయాలి.
తాతయ్య: ఇవిగో లక్ష్మీ డాక్యుమెంట్స్.
మనీషా: డాక్యుమెంట్స్ నాకు ఇస్తున్నావేంటి జానుకి ఇవ్వు.
లక్ష్మీ: మా పొలం వ్యవహారం మొత్తం నువ్వే చూసుకుంటున్నావ్ కదా మనీషా. పొలం కొనడానికి పార్టీని కూడా ఏర్పాటు చేశావ్.
మనీషా: నేను అనుకోవడం ఏంటి వివేక్‌తో బిజినెస్ పెట్టించాలని జాను పొలం అమ్మాలి అనుకుంది అందుకే వీళ్లని అప్రచో అయింది.
దేవయాని: అవును అందులో మనీషా ఏం చేసింది మొత్తం జానునే చేసింది కదా..
జాను: అవును నేనే చేశా అయితే ఏంటి.
లక్ష్మీ: సరే నేను ఆ డాక్యుమెంట్స్‌లో ఏముందో చదవమని మనీషాతో చెప్పా అంతే.
మనీషా డాక్యుమెంట్స్ చూసి బిత్తరపోయి.. జాను దీన్ని ఒకసారి చూడు అని ఇస్తుంది. జాను కూడా షాక్ అయిపోతుంది. దేవయాని కూడా షాక్ అయిపోతుంది. అందులో లక్ష్మీ తాతయ్య ఆస్తిని ఇద్దరు మనవరాళ్లు సమానంగా అనుభవించే హక్కు ఉంది కానీ అమ్ముకునే హక్కు కేవలం లక్ష్మీకి మాత్రమే ఉందని వీలునామా రాసుంటారు. దాంతో లక్ష్మీ తాను పొలం అమ్మను అని తనని కాదని అమ్మిన వారు కొన్న వారు జైలుకి వెళ్తారని అంటుంది. తాతయ్య మంచి పని చేశారని జయదేవ్, మిత్ర అనుకుంటారు. నేను ఇలాంటి వీలునామానే రాస్తాను అని జయదేవ్ అంటాడు. ఇక లక్ష్మీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఫ్యాక్టరీ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయాలి అని అంటుంది లక్ష్మీ. అంతే కదా మనీషా అని లక్ష్మీ అంటుంది. లక్ష్మీ జానుతో వీలునామా కాపీ ఇచ్చి భద్రంగా దాచుకో ఎప్పుడైనా పొలం అమ్మాలి అనిపిస్తే బయటకు తీసి చదువుకో అని అంటుంది. ఇక లక్ష్మీ దేవయానితో చిన్నత్తయ్య వెళ్లి జానుని ఓదార్చు అంటే వివేక్ నవ్వుతూ నేను ఓదార్చుతా వదినా అని వెళ్తాడు.
మనీషా యూనియన్ లీడర్‌కి కాల్ చేసి తనే సమ్మె చేస్తున్నట్లు లక్ష్మీకి తెలిసిపోయిందని ఆ విషయం బయటకు రాకుండా చూడమని చెప్తుంది. ఇక సమ్మె కూడా ఆగకూడదు అని చెప్తుంది. ఇక వివేక్ జానుని ఉడికించేలా అనుకున్నది ఒకటి అయింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అని పాడుతాడు. జాను పొలం విషయంలో తన ప్లాన్ రివర్స్ అయింది అనే కదా ఈ పాటలు అంటుంది. ఇక పార్థసారథి గారు జాను దగ్గరకు వచ్చి తనకు కొడుకులు అమెరికాలో ఉన్నారని బాగా డబ్బుందని తనకు పొలం విషయంలో కక్కూర్తి పడాల్సిన అవసరంలేదని స్నేహితుడి కోసమే మీ పొలం చూసుకుంటున్నా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, రోహిణిలకు పెళ్లైందని కుప్పకూలిపోయిన రూప.. మళ్లీ గొడవ అవుతుందా!