Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today December 25th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: చిన్నపిల్లాడని చూడకుండా తోసేసిన జాను.. నా కొడుకు అంటూ అదరగొట్టిన మిత్ర.. వేరు వేరు వంటలు!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode జాను జున్నుని తన గది నుంచి గెంటేయడం మిత్ర వివేక్ మీద సీరియస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను మాటలు తలచుకొని లక్ష్మీ తన బాధని మిత్రతో చెప్పుకొని ఏడుస్తుంది. ఈ గొడవ దేనికి దారి తీస్తుందో అని భయంగా ఉందని అంటుంది. ప్రేమలు, బంధాలు గురించి మాట్లాడుకోవాల్సిన ఇంట్లో ఆస్తి పంపకాల మాటలు ఏంటి అని ఏడుస్తుంది. మిత్ర లక్ష్మీని దగ్గరకు తీసుకుంటాడు. జయదేవ్ అది చూసి సంతోషపడతాడు.
మిత్ర: లక్ష్మీ ఏంటి చిన్నపిల్లలా అయినా నీకు వివేక్ జున్నులా కనిపిస్తే నాకు జాను లక్కీలా కనిపిస్తుంది. మన పిల్లల లాంటోళ్లు ఈ పిల్లల గొడవను నువ్వు మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఉన్నాను కదా నేను చూసుకుంటా.
జయదేవ్: మిత్ర నీలో ఈ మార్పే కదా నేను అరవింద కోరుకున్నది.
జున్ను: లక్కీ నేను అమ్మతో గొడవ పడ్డాను కదా నా పనులు అన్నీ నాన్నే చేస్తారని చెప్పాను కదా ఇప్పుడేం చేయాలి. ఇప్పుడు నా డ్రస్ బటన్ కుట్టమని అమ్మకి చెప్తే తిడుతుంది.
మనీషా: అవును జున్ను అందుకే నువ్వు మీ పిన్ని దగ్గరకు వెళ్లి బటన్ కుట్టమని చెప్పు.
లక్కీ: సూపర్ ఐడియా పిన్నితో బటన్ కుట్టించుకుంటే అమ్మ మమల్ని తిట్టదు. మనీషా మొదటి సారి నువ్వు మాకు మంచి ఐడియా ఇచ్చావ్. థ్యాంక్యూ.
మనీషా: జున్ను మీ అమ్మ నీ మీద ఇంకా కోపంగా ఉంది. అందుకే ఎవరూ చూడకుండా మీ పిన్ని దగ్గరకు వెళ్లు. మనసులో వెళ్లండి వెళ్లండి ఇప్పుడు మళ్లీ గొడవ అవుతుంది.
జున్ను, లక్కీ లోపలకి వెళ్లే సరికి మిత్ర అక్కడ ఉండటంతో లక్కీ చాటుగా జున్ను జాను దగ్గరకు వెళ్లిపోతాడు. మిత్ర లక్కీని పలకరిస్తాడు. జున్ను గురించి అడిగితే జున్ను ఫ్రెష్ అవడానికి వెళ్లాడు అని చెప్తుంది. జున్ను జాను దగ్గరకు వెళ్లి పిన్ని నా బటన్ ఊడిపోయింది అమ్మకు తెలీకుండా ఈ హెల్ప్ చేయ్ అని అంటాడు. దాంతో జాను నీకు మీ అమ్మకి సేవలు చేయడానికి నేను ఇక్కడ ఉన్నానా ఎలా కనిపిస్తున్నానురా అని జున్నుని చెడామడా తిట్టేస్తుంది. ఇంతలో వివేక్ వస్తాడు. జున్నుతో అలా ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అంటే వేలెడంత లేదు నేను వీడికి పని చేసి పెట్టాలా పనిదాన్ని అనుకున్నాడా అని అంటుంది. ఇక జాను జున్నుని బటన్ లేదు షర్ట్ లేదు అని బయట తోసేసి తలుపు వేసేస్తుంది. మిత్ర, లక్కీ, జయదేవ్ అక్కడికి వెళ్లి ఏమైందని అడిగితే బటన్ ఊడిపోతే పిన్నిని అడిగాను అని పిన్ని తిట్టి బయటకు నెట్టేసింది అని చెప్తాడు.
జున్ను: పిన్ని ఎప్పుడూ ఇలా చేయలేదు నాన్న. అమ్మ ఎప్పుడూ నాతో ప్రేమగా ఉండే పిన్ని ఈరోజు ఎందుకమ్మా నా మీద అరిచింది.
లక్ష్మీ: ఈ రోజు పిన్ని మూడ్ బాలేదు జున్ను నువ్వు ఏడ్వకు.
మిత్ర: ఏంటి వివేక్ ఇది ఏదైనా ఉంటే మనం మనం చూసుకోవాలి కానీ పిల్లల మీద కోపాలు ఏంటి.
వివేక్: సారీ అన్నయ్య నేను తనకి చెప్పాను.
మిత్ర: ఏం చెప్పావురా ఇందాక నుంచి చూస్తున్నాను. చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు. ఏదైనా ఇష్యూ ఉంటే అది మన మధ్య ఉండాలి కాని పిల్లలు ఏం చేస్తారు. చూస్తుంటే ఈ చిన్న సమస్యని చిలికి చిలికి గాలి వాన చేయాలి అనుకుంటున్నారేమో. ఇది నేను సహించను వివేక్. జున్ను నా కొడుకు. నీలా నాలా ఈ ఇంటి వారసుడు. వాడిని ఓ మాట అన్నా వాడి ఒంటి మీద చిన్న దెబ్బ పడినా వాడి కంటి నుంచి నీరు వచ్చినా నేను సహించను. ఇప్పుడు చెప్తున్నా మళ్లీ ఇది రిపీట్ అవ్వకూడదు. గొడవ ఏమైనా ఉంటే మనం చూసుకుందాం పిల్లల జోలికి వెళ్లొద్దు.
జయదేవ్: మిత్ర గొడవ వద్దు అమ్మా లక్ష్మీ పిల్లల్ని తీసుకెళ్లు.
జున్ను, లక్కీలు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. బాగా ఆకలిగా ఉందని ఎవరూ ఏం వండలేదని అమ్మకి చెప్పాలని వెళ్తుంటారు. ఇంతలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి లక్కీ, జున్నులకు ఫుడ్ ఇచ్చి వెళ్లిపోతాడు. లక్కీ మిత్రనే ఆర్డర్ చేసుకుంటాడని తినడానికి రెడీ అవుతారు. ఇంతలో జున్ను చూసి ఇది పిన్ని ఆర్డర్ చేసింది మనం తినొద్దని అంటాడు. జయదేవ్ వచ్చి ఏమైందని అడిగితే ఇంట్లో ఎవరూ వంట చేయలేదు ఫుడ్ ఆర్డర్ చేశారని అంటారు. ఇక మనీషా, దేవయానిలు వచ్చి ఆ ఫుడ్ తీసుకొని జాను మా కోసం ఫుడ్ తెచ్చిందని చెప్పి తీసుకెళ్లిపోతుంది. దేవయాని జాను తేవడం ఏంటి అని అడిగితే మనీషా జాను పేరు మీద నేనే తీసుకొచ్చానని అంటుంది. అక్కాచెలెళ్లు ఎవరూ వంట గది వైపు రాలేదని ఈ ఫుడ్‌తో అక్కా చెలెళ్ల మధ్య గొడవ పెడతానని అంటుంది. ఇక మనీషా, దేవయానిలు ఫుడ్ తీసుకెళ్లి జానుకి ఇస్తారు. నీ మీద కోపంతో మీ అక్క వంట చేయాలేదని సొంత చెల్లిని ఆకలితో మాడ్చాలి అని మీ అక్క అనుకుంటుందని ఇద్దరూ చెప్పి జానుని తినమంటారు.
జాను మనీషాకి సారీ చెప్తుంది. ఇన్నాళ్లు నువ్వు చెడ్డదానివి అనుకున్నా కానీ నువ్వు చాలా మంచిదానివని అంటుంది. తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ అని అంటుంది. దానికి నేను ఎప్పుడూ నీ కోసం చాలా చేశానని పెళ్లి తర్వాత ఆంటీ రానివ్వకున్నా నేనే ఒప్పించానని, ఫస్ట్‌నైట్‌లో కూడా ఆంటీ అనుమతి తీసుకోమని నేను చెప్పానని అంటుంది. ఇక జాను బిర్యాని తీనేస్తుంది. ఇక జున్ను, లక్కీలు డైనింగ్ టేబుల్ మీద ఉంటే లక్ష్మీ వస్తుంది. ఫుడ్ ఎవరూ వండలేదని ఆకలేస్తుందని ఏం చేయాలో తెలీక కామ్‌గా కూర్చొన్నామని అంటారు. దాంతో లక్ష్మీ ఇద్దరికీ సారీ చెప్పి పది నిమిషాలు ఆగండి అందరికీ భోజనం వండుతా అంటే జయదేవ్ వచ్చి మనకు మాత్రమే వండు వాళ్లు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారని అంటాడు. మిత్ర ఆర్డర్ చేస్తానంటాడు. లక్ష్మీ వద్దని తానే వండటానికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆ రోజు పొదుపే ఈ రోజు కొండంత అండ.. ఫ్యామిలీని మాటలతో చంపేసిన సుమిత్ర..!