Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today December 13th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: గర్బసంచి లేని మహిళకు పిల్లలు.. ఇదెలా సాధ్యం.. లాజిక్స్ అదరగొట్టిన లక్ష్మీ!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ పార్వతికి అసలు గర్భసంచే లేదని రుజువు చేసి లక్కీని మిత్ర దగ్గరే ఉంచేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్కీ పార్వతి అలియాస్ దేవి కూతురు కాదని మిత్రని బిజినెస్ పరంగా ఓడించడానికి సరయు ఇలా నాటకం ఆడిందని అర్జున్ ఫ్రూవ్ చేస్తాడు. ఆర్టిస్ట్ అయిన దేవి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకొని లక్కీ కోసం నటించిందని చెప్తాడు. లక్కీ అసలు తల్లి ఎవరో భాస్కర్‌కి మాత్రమే తెలుసని ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరని చెప్తాడు. భాస్కర్‌ని కూడా సరయునే మాయం చేసుంటుందని అర్జున్ అంటాడు. లక్కీని లక్ష్మీకి అప్పగించాలి చెప్తాడు.
లాయర్ చాణక్య క్లాప్స్ కొడుతూ బాగా కట్టు కథ అల్లారని అంటాడు. చిన్నా చితక ఆధారలతో వాదన చేస్తున్నారు కానీ అర్జున్ చెప్పింది పూర్తిగా నిజం కాదని అంటాడు. పార్వతి పేరు బ్యాంక్ బుక్‌లో దేవి అని ఉన్నా ఆమె పూర్తి పేరు పార్వతీదేవి అని అందుకు ఐడీ కార్డ్ సాక్ష్యం అని చూపిస్తారు. సరయు స్పాన్షర్ చేసింది సాటి స్త్రీ అనే జాలితో అని మిత్ర మీకు కోపంతో కాదని చెప్తాడు. డీఎన్‌ఏ రిపోర్ట్స్ ఉండగా ఇంకేం ఆధారాలు అవసరం లేదని పాపని పార్వతికి అప్పగించమని అంటాడు. అర్జున్ వాదించడానికి ఇంకేం లేదు అని చెప్పడంతో జడ్జి పాపని పార్వతి కూతురని కోర్టు నమ్ముతుందని చెప్పి పాపని కన్నతల్లి పార్వతికి అప్పగించాలని కోర్టు మిత్రని ఆదేశిస్తుంది. ఇంతలో లక్ష్మీ జడ్జికి అడ్డుపడుతుంది. కాసేపు తీర్పు ఆపమని కోరుతుంది. ఇక డాక్టర్ గాయత్రీ ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూసి పార్వతి భయపడుతుంది. పార్వతి ఎందుకు భయపడుతుందని మనీషా, సరయు వాళ్లు అనుకుంటారు.
పాపని మీరు ఎప్పుడు కన్నారు అని లక్ష్మీ అడిగితే పార్వతి తడబడుతుంది. ఇక లక్ష్మీ నీకు యాక్సిడెంట్ ఎప్పుడు అయిందో గుర్తుందా అని అంటుంది. గతంలో పార్వతికి పెద్ద యాక్సిడెంట్ అయిందని గర్భసంచి తొలగించారని లక్ష్మీ చెప్తుంది. డాక్టర్ గాయత్రీ తానే పార్వతికి సర్జరీ చేశానని అంటుంది. 2015లో గర్భసంచి పోతే 2017లో ఎలా బిడ్డను కంటుందని అసలు గర్భసంచి లేని స్త్రీ బిడ్డని ఎలా కంటుందని లక్ష్మీ ప్రశ్నిస్తుంది. తనకు పుట్టని బిడ్డకి తాను తల్లి అని చెప్పి పాపని మిత్ర గారికి దూరం చేయాలనుకుందని అంటుంది. పార్వతి జడ్జిని క్షమాపణ కోరుతుంది. నీతో ఇదంతా ఎవరు చేయించారని లక్ష్మీ అడిగితే తన వెనక ఎవరూ లేరని తనకు పిల్లలు పుట్టరని ఇలా నాటకం ఆడి పాపని తీసుకోవాలని అనుకున్నానని అంటుంది. ఇక జడ్జి పాపని మిత్రకే అప్పగిస్తారు. మనీషా, సరయులు డిసప్పాయింట్ అవుతారు.
జడ్జి లక్ష్మీని అభినందిస్తారు. లక్కీని తీసుకొని అందరూ బయటకు వెళ్తారు. అర్జున్‌కి జయదేవ్ వాళ్లు కృతజ్ఞతలు చెప్తారు. ఇక అర్జున్ పార్వతికి గర్బసంచి లేదని ఎలా తెలుసుకున్నావ్ అంటే దానికి లక్ష్మీ పార్వతి తమ ఇంట్లో ఉన్న రోజు పార్వతి తినేసి ట్యాబ్లెట్ వేయడం చూశానని లక్ష్మీ చెప్తుంది. దాని గురించి అడిగితే పార్వతి కంగారు పడి వెళ్లిపోయిందని అందుకే అనుమానంతో ఆ స్లిప్ చూసి అది అర్జున్ వాళ్ల అమ్మ వేసుకోవడం చూసి అడిగితే గర్బసంచి ఇన్‌ఫెక్షన్ కోసం వేసుకుంటారని చెప్తే అప్పుడు పార్వతి బ్యాగ్ చెక్ చేసి డాక్టర్ నెంబరు తీసుకొని మొత్తం డాక్టర్‌ని అడిగితే తెలిసిందని లక్ష్మీ చెప్తుంది. అందరూ లక్ష్మీని పొగిడేస్తారు. మిత్ర లక్ష్మీకి థ్యాంక్స్ చెప్తాడు. ఇక మనీషాకి మిత్ర కాల్ చేయడంతో రౌడీల ప్లాన్ ఏం వద్దని మనీషా వాళ్లని పంపేయమని చెప్తుంది. ఇక పిల్లలు ఇంట్లో ఆడుకుంటుంటే ఆంజనేయస్వామి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్య పుట్టింటికి వచ్చి రచ్చ చేసిన భైరవి.. సత్యకి మహదేవయ్య మాస్ వార్నింగ్!