Chiranjeevi Lakshmi Sowbhagyavathi August 14th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీ మిత్ర కూతురు కాదని లక్కీతో చెప్పేసిన మనీషా.. తండ్రి స్థానం అర్జున్‌కిచ్చిన జున్ను!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషా లక్కీతో నువ్వు మిత్ర కూతురు కాదని చెప్పడంతో మిత్ర మనీషాని తిడతాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode సంయుక్త అర్జున్, మిత్ర ఇద్దరినీ లోపలికి పిలిచి ఇద్దరి ప్రజెంటేషన్ బాగుందని ఇద్దరిలో ఎవరో ఒకరికే ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుందని అంటుంది. కానీ ఇద్దరికీ ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం లేదని సంయుక్త అంటుంది. మిత్ర షాక్ అవుతాడు. ఎందుకుని అడిగితే మీ ఇద్దరిలో ఎవరికీ ఇవ్వాలో ఇంకా డిసైడ్ అవ్వలేదని దానికి ఇంకా మూడు రోజులు ఆగాలని చెప్తుంది. మీ ఇద్దరి ప్రజెంటేషన్ మా డాడీకి పంపించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటానని అంటుంది.
సంయుక్త: నాకున్న అనుభవంతో మీ ఇద్దరినీ సెలెక్ట్ చేశా మా డాడ్ తన అనుభవంతో మీ ఇద్దరిలో ఒకర్ని ఫైనల్ చేస్తారు.
మిత్ర: అయితే ఇంకా మూడు రోజులు ఆగాలన్నమాట. సరే సంయుక్త గారు వెయిట్ చేస్తా.
అర్జున్: లక్ష్మీ ఈ ప్రాజెక్ట్ మిత్రకే ఇచ్చేస్తే బాగుండేది కాదా.
సంయుక్త: అర్జున్ గారు నేను మీకు ముందే చెప్పాను ఇది జేఎమ్మార్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. నేను బంధాలకు లొంగదలచుకోలేదు. మీ ఇద్దరి ప్రజెంటేషన్ నాకు నచ్చింది. నిర్ణయం తీసుకోవడానికి కాస్త టైం పడుతుంది. అందుకే ఇదంతా త్వరలో మీరు అయినా తప్పుకునే అవకాశం రావొచ్చు మిత్ర గారు అయినా తప్పుకునే అవకాశం రావొచ్చు అప్పటి వరకు వెయిట్ చేయండి.
అర్జున్: ఓకే లక్ష్మీ టేక్ యువర్ టైం.
లక్కీ ఇంట్లో అందరికీ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు అడుగుతుంది. ఎందుకని అడిగితే తన స్కూల్‌లో ఫ్యామిలీ ట్రీ వేసుకురమ్మన్నారని అందుకే అని అంటుంది. అందరితో పాటు మనీషా కూడా ఫొటో ఇస్తే నువ్వు మా ఫ్యామిలీ కాదు కదా నీ ఫొటో అవసరం లేదు అంటుంది. మనీషా షాక్ అయిపోతుంది. పెద్దవాళ్లతో ఇలాగే మాట్లాడేదా అని దేవయాని అంటుంది.
మనీషా: లక్కీ నేను కూడా ఈ ఫ్యామిలీ మెంబర్నే నీ కంటే ముందు నుంచి ఈ ఫ్యామిలీలో ఉన్నాను.
లక్కీ: అవునా అయితే ఈ ఫ్యామిలీ ట్రీలో నిన్ను ఎక్కడ పెట్టాలి.
మనీషా: ఇంకెక్కడ పెడతావ్ నీ తల్లి ప్లేస్‌లో పెట్టు.
లక్కీ: నా తల్లి ప్లేస్‌లో పెట్టడానికి నువ్వేమైనా నన్ను కన్నావా.
మనీషా: రేపు మీ నాన్నని పెళ్లి చేసుకుంటే నేను ఆయనకు భార్యని అవుతా నీకు తల్లిని అవుతా.
లక్కీ: నేను పెట్టను ఎందుకంటే నువ్వు నాకు తల్లివి కాదు కాబట్టి.
మనీషా: అలా అయితే నువ్వు కూడా మిత్రకు కూతురివి కాదు.
దేవయాని: మనీషా కంట్రోల్.
మనీషా: మీరు ఆగండి ఆంటీ వేలెండంత లేదు నన్నే వెలెత్తి చూపిస్తుంది. నిన్న కాక మొన్న వచ్చి నా స్థానాన్నే ప్రశ్నిస్తుంది.
లక్కీ: ఏమన్నావ్ నేను నాన్న కూతురిని కాదా.
మనీషా: కాదు ముమ్మాటికీ కాదు.
మిత్ర: మనీషా.. ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకునే మాట్లాడుతున్నావా. లక్కీ నా కూతురు తను ఈ ఇంటి ఆడపిల్ల. తన ఉనికిని గానీ తన స్థానాన్ని కానీ గుర్తు చేయాల్సిన పని లేదు. అలా చేస్తే ఈ ఇంట్లో నీ స్థానం ప్రశ్నార్థకంలా మారుతుంది. అది గుర్తుపెట్టుకో.
మనీషా: అయినా నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది మనకు పెళ్లి అయితే నేనే కదా లక్కీకి తల్లిని. ఒక అనాథకి తల్లి కావడానికి నేను ఒప్పుకున్నాను కదా. నన్ను తల్లిగా ఒప్పుకోవడానికి అనాథకి ఏంటి నొప్పి.
మిత్ర: నోర్ముయ్ ఇంకొక్కసారి లక్కీని అనాథ అంటే నా చేయి నీ చెంప చెల్లుమనిపిస్తుంది. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకో.
జున్ను కూడా ఫ్యామిలీ ట్రీ చేస్తుంటాడు. అర్జున్, వసుంధర అది చూస్తారు. వసుంధర ఫ్యామిలీ ట్రీలో నేను అర్జున్ ఉండొచ్చా లేదా అని లక్ష్మీని అడగమని వసుంధర అంటుంది. దానికి జున్ను మనమంతా ఫ్యామిలీ అని అంటాడు. ఇక వసుంధర ఫ్యామిలీ ట్రీలో రక్త సంబంధీకులే ఉంటారని అంటుంది. ఇక అర్జున్‌కి అర్థమయ్యేలా చెప్పమని అంటే అర్జున్ అల్రెడీ చెప్పానని అయినా వినడం లేదని అంటాడు. ఇక లక్ష్మీ, జానులు వస్తారు. జాను ఫ్యామిలీ ట్రీలో నీ ఫ్యామిలీ మాత్రమే ఉండాలని అర్జున్, వసుంధర ఉండకూడదని అంటుంది. జున్ను ఒప్పుకోడు. ఇక లక్ష్మీ జానుతో అలా మాట్లాడుకోవద్దని అందరి మనసులో నొచ్చుకుంటాయని అంటుంది. జున్ను మనసులో మనం అంతా ఒకే కుటుంబం అని రాసుకున్నాడని దాన్ని అలాగే కంటిన్యూ చేయమని అంటుంది.
మరోవైపు మిత్ర మాటలు తలచుకొని మనీషా రగిలిపోతుంది. దేవయాని మనీషా దగ్గరకు వెళ్తుంది. మిత్ర నిన్ను పెళ్లి చేసుకోడని ఒకప్పుడు నీ కొంగు పట్టుకొని నీ పేరు జపిస్తూ ఉండే వాడు ఇప్పుడు నీతో మాట్లాడటమే లేదని మీ మధ్య ప్రేమ అభిమానం ఎప్పుడో పోయావని అంటుంది. మిత్ర కోసం ఇంకా పాకులాడటంలో అర్థం లేదని దేవయాని అంటుంది. మనీషా ఒప్పుకోదు మిత్రను వదలనని తన దారికి అడ్డు వచ్చే వారిని వదలనని అంటుంది. మరోవైపు లక్కీ అలిగి కూర్చొంటుంది. మిత్ర పక్కనే కూర్చొంటాడు. ఇక జున్ను కూడా ఆలోచిస్తాడు ఏమైందని లక్ష్మీ అడుగుతుంది. లక్కీ మిత్రతో నేను నీ కూతురిని కాదా అని అడుగుతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.