Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today April 26th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: 'లక్ష్మీ'కి శుభం కార్డు.. అదిరిపోయిన చివరి ఎపిసోడ్..!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషా, సరయుల బండారం దేవయాని బయట పెట్టడంతో వాళ్లని అరెస్ట్ చేయించి అందరూ సంతోషంగా ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషానే తన పిల్లల్ని కిడ్నాప్ చేయించిందని లక్ష్మీ మనీషా దగ్గరకు వెళ్లి మనీషాని కొట్టి పిల్లల గురించి అడుగుతుంది. ఇంతలో అరవింద వచ్చి మనీషాని వ్రతం కోసం రెడీ అవ్వమని అంటుంది. ఇక లక్ష్మీతో వ్రతం అయ్యే వరకు పిల్లల్ని గదిలోపే ఉంచమని అంటుంది. మనీషా దేవయాని దగ్గరకు వెళ్లి లక్ష్మీని అడ్డు పెట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని చంపేస్తానని అంటుంది.
మనీషా క్రూరత్వం విన్న దేవయాని పిల్లలు ఏం పాపం చేశారు వాళ్లని ఎందుకు చంపాలి అని చూస్తావ్ అని తిడుతుంది. ఈ విషయం ఇప్పుడే అరవింద అక్కతో చెప్తాను అంటే మనీషా మీ గుట్టు కూడా రట్టు చేస్తానని అంటుంది. దాంతో దేవయాని ఆగిపోతుంది. నీతో కలిసి చాలా పెద్ద తప్పు చేశానని అంటుంది. మనీషా వ్రతానికి రెడీ అవుతుంది.
మిత్ర సరయు మెడ మీద కత్తి పెట్టి హోళీ రోజు ఏం జరిగిందని అడుగుతారు. దాంతో పీఏ మిత్రతో మొత్తం నిజం చెప్పేస్తారు. మనీషానే తన మెడలో తాళి కట్టుకుందని అంటారు. ఆ సాక్ష్యాలు అన్నీ ఇస్తానని రాజు గారు ఒప్పుకుంటారు. ఇక మిత్ర మనీషా దగ్గరకు వెళ్లి దేవయానిని బయటకు వెళ్లమని చెప్తాడు. దేవయాని చాటుగా వింటుంది. మిత్ర మనీషాతో ఎందుకు ఇలా చేశావ్ అని అడుగుతాడు. హోలీ రోజు నేను నీకు తాళి కట్టానా అని అడుగుతాడు. కట్టావని మనీషా అంటుంది. అదంతా అబద్ధం అని మిత్ర మనీషాని కొడతాడు. దేవయాని చూసి ఇంకో నాలుగు తగిలించు అని అనుకుంటుంది. సరయు పీఏ అన్నీ తనకు చెప్పాడని మిత్ర మనీషా బండారం మొత్తం చెప్పేస్తాడు. నా ఫ్రెండ్ షిప్‌ని మిస్ యూజ్ చేశావని అంటాడు. నువ్వు ఇలా అంటే నేను చనిపోతానని మనీషా అంటే చనిపో నేను లక్ష్మీకి మాత్రమే సొంతం నాకు నా భార్యపిల్లలు చాలు నువ్వు అక్కర్లేదు అని అంటారు. పూజ కోసం నువ్వు వస్తే నా పిల్లల్ని భార్యని తీసుకొని వెళ్లిపోతానని వార్నింగ్ ఇస్తాడు.
సరయు లక్ష్మీకి వీడియో కాల్ చేసి మిత్ర, మనీషాలకు పెళ్లి చేసి బయటకు రావాలి గంటలో రాకపోతే నీ పిల్లల్ని చంపేస్తానని అంటుంది. దాంతో సరే అని లక్ష్మీ అంటుంది. ఇక పంతులు మనీషాని తీసుకురమ్మని చెప్తారు. లక్ష్మీ తాను తీసుకొస్తానని వెళ్తుంది. దగ్గరుండి మనీషాని లక్ష్మీ తీసుకొని వస్తుంది. పీటల మీద నేను ముందు కూర్చొవాలా మిత్ర కూర్చొవాలా అని మనీషా పంతుల్ని అడిగితే మీ ఇద్దర్ని నేను కూర్చొనివ్వను. అసలు ముందు నువ్వు బతుకుతావో లేదో చూసుకో అని చెప్పి మనీషానికి గన్ గురి పెడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఆయన పక్కన నువ్వు కూర్చొంటే నిన్ను బతకనిస్తాను అనుకున్నావా. నీ మెడలో తాళి కడితే నేను బతుకుతాను అనుకుంటున్నావా అని అంటుంది. మిత్ర గారిని పెళ్లి చేసుకోవడానికి సరయుతో కలిసి మిత్ర పిల్లల్ని కిడ్నాప్ చేయించిందని లక్ష్మీ చెప్తుంది. పిల్లలు సరయు దగ్గర ఉన్నారని దేవయాని చెప్పిందని లక్ష్మీ చెప్తుంది. మనీషా పిల్లలు కిడ్నాప్ అయి సరయు దగ్గర ఉన్నారని మనీషా చెప్పిందని దేవయాని చెప్తుంది. మిత్ర తన మెడలో తాళి కట్టగానే సరయు పిల్లలకు విషం ఇచ్చి చంపుతుందని దేవయాని చెప్పేస్తుంది. మనీషా షాక్ అయిపోతుంది.
దేవయానితో నేను చేసిన ప్రతీ పాపంలో మీకు భాగం ఉంది కదా అంటుంది. దానికి దేవాయాని అవునే కానీ నా ఇంటి వారసుల్ని మా అక్క మనవల్ని నువ్వు చంపుతా అంటే నేను ఎందుకు ఊరుకుంటాను వాళ్లు మా రక్తం, మా వంశం అని అంటుంది. నన్నేం చేయలేవ్ లక్ష్మీ అని మనీషా అంటే లక్ష్మీ గన్ పేల్చుతుంది. దాంతో మనీషా భయపడి పిల్లలు గురించి చెప్పేస్తుంది. ఇక మిత్ర మనీషాకి తాళి కట్టలేదని మనీషానే కట్టుకుందని వివేక్ చెప్తాడు. సరయు పీఏ వచ్చి మొత్తం చెప్తాడు. దాంతో అందరూ మనీషాని అసహ్యించుకుంటారు. అరవింద మనీషాని కొడుతుంది. ఇక లక్ష్మీ పీఏతో కారులో బాంబ్ ఉందని చెప్పిస్తాడు. సరయు కాల్ చేస్తే మనీషా మిమల్ని చంపాలని ప్లాన్ చేసిందని మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతాడు.
సరయు అడ్రస్ చెప్పేస్తుంది. మిత్ర, లక్ష్మీలు పరుగున వెళ్లి సరయుని పట్టుకొని పిల్లల్ని కాపాడుతారు. సరయు, మనీషా అందర్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇన్నాళ్లకి ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయిందని దేవయాని అంటుంది. అందరూ కలిసి మిత్ర కోసం హోమం చేస్తారు. మరోవైపు జాను వాంతులు చేసుకుంటుంది. జాను ప్రెగ్నెంట్ అయిందని తనకు వారసుడు రాబోతున్నాడని దేవయాని సంబర పడిపోతుంది. జానుని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకొని ఇక నుంచి నిన్ను బంగారంలా చూసుకుంటానని అంటుంది. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. సీరియల్‌కి శుభం కార్డు పడుతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!






















