Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today April 15th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: పెద్ద ఆపద వస్తుందని లక్ష్మీని హెచ్చరించిన చిలుక.. మిత్రపై పాము ప్రయోగం!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode సరయు మిత్రని కాటేయడానికి పాముని ప్రయోగించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode దేవయాని జానుని పంపించే ఏర్పాట్లు చేయమని సరయుతో చెప్తుంది. పిల్లల కిడ్నాప్ సక్రమంగా జరిగితే మందు తీసుకొచ్చి ఇస్తానని సరయు చెప్తుంది. ఇక అరవింద జయదేవ్ లక్ష్మీలు మాట్లాడుకుంటారు. రేపు త్రయోదశి కదా మిత్రని ఎలా బయటకు పంపిస్తామని అంటుంది. మినిస్టర్‌తో మాట్లాడమని చెప్తుంది. అది జరగదు అని లక్ష్మీ అంటుంది. మినిస్టర్ ఎలా అయినా రేపే ప్రొగ్రాం చేయమని చెప్పారని అంటుంది.
మిత్రను ఆపమని అరవింద అంటుంది. మిత్రను ఆపకపోతే ప్రాజెక్ట్ ఆపేయమని అంటుంది. ప్రాజెక్ట్ ఆపడం కుదరదు అని అది మిత్ర గారు ఎంతో ఇష్టపడిన ప్రాజెక్ట్ అని చెప్తుంది. మిత్ర రేపు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు అని అంటుంది. లక్ష్మీ తన దగ్గర ప్లాన్ ఉందని మిత్ర గారు ముందు అంతా ప్రోగ్రానికి వస్తా అని చెప్పి చివరి నిమిషంలో మిత్ర గారు ఉండిపోయి మీరు వచ్చారని చెప్దామని అంటుంది. మంచి ప్లాన్ వేశావని జయదేవ్ అంటాడు.
పిల్లలు బయట తిరుగుతూ చిలక జోస్యం అతన్ని ఆపుతారు. ఇంతలో లక్ష్మీ వస్తుంది. అతను లక్ష్మీతో చిలక జోస్యం చెప్పించోమని అంటారు. పిల్లలు చిలకను చూడాలి అనడంతో లక్ష్మీ జోతిష్యం చెప్పించుకుంటుంది. లక్ష్మీ తన వివరాలు చెప్పడంతో చిలక వచ్చి సీతారాములు, లవకుశులు ఉన్న ఫొటో తీస్తుంది. అది చూసిన అతను నీ భర్త శ్రీరామ చంద్రుడు నువ్వు సీతమ్మ నీ పిల్లలు లవకుశులు అని చెప్తుంది. సీతారాములా మీరు దూరంగా ఉన్నారు అని పిల్లలు తండ్రికి దూరం అయి మళ్లీ కలిశారు అని ఒక మంచి ఒక చెడు జరుగుతుందని దూరం అయినది దగ్గరవ్వబోతుందని దగ్గరైంది దూరం కాబోతుందని అంటారు. ఆపద గట్టిగా ఉందని అది దూరం అయితే నీ సంసారం చక్కగా ఉంటుందని ఈ దిక్కు వెళ్తే నీకు జయం అని చూపిస్తారు. నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది వెతుకు అని చెప్తారు.
లక్ష్మీ లోపలికి వస్తుంటే మనీషా ఎదురు పడి రామ చిలుక ఏం చెప్పింది లక్ష్మీ నీ జీవితానికి ఇక రామ్ రామ్ అని చెప్పిందా అని వెటకారం చేస్తుంది. ఈ చిలుక చెప్పిన జోతిష్యంలో సీత సూర్పణక ముక్కు చెవులు కోసిందని నాతో జాగ్రత్తగా ఉండని లక్ష్మీ చెప్తుంది. దానికి మనీషా ఆ మాట సాయంత్రం చెప్పు నీకు గండం మొదలైంది లక్ష్మీ అని అంటుంది. మిత్రను కాపాడుకునే శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాడని అంటుంది. మిత్ర గారికి నువ్వే పెద్ద గండం అని లక్ష్మీ అంటుంది.
సరయు ఓ పాములమ్మతో మాట్లాడుతుంది. మిత్ర ఫొటో ఇచ్చి మిత్రను కాటేయాలి అని చెప్తుంది. దాంతో ఆ పాములమ్మ మిత్ర ఫొటో పాము దగ్గర పెట్టి ఆ పాము మిత్రను కాటేయాలని ట్రైనింగ్ ఇస్తుంది. అయితే అక్కడే ఉన్న సరయుకి దేవయాని కాల్ చేయడంతో పాము మిత్రను వదిలేసి దేవయాని ఫొటోని చూస్తుంది. దేవయానితో సరయుతో మాట్లాడుతుంది. ఈ దెబ్బతో నాకు కొడుకు నా కోడల్ని తరిమి కొట్టేస్తాడు కదా అంటుంది. జాను, వివేక్‌లు ఆ మాటలు వింటారు. మీ అమ్మకి నా గురించి తప్ప వేరే ధ్యాస లేదని అంటుంది. మూలికలు అమ్మే ఆవిడలా మిత్ర ఇంటికి వెళ్లమని చెప్తుంది. పిల్లల్ని పంపించడానికి అందరూ రెడీ అవుతారు. పిల్లల్ని ఒంటరిగా పంపాలి అంటే ఇబ్బందిగా ఉందని లక్ష్మీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కొన ఊపిరితో కొట్టుకుంటున్న దశరథ్.. దీప వల్ల సుమిత్ర జీవితం అన్యాయం అయిపోతుందా!





















