Chinni Serial Today November 27th:చిన్ని సీరియల్: భార్యకి దేవా భయపడటానికి కారణమేంటి? మధు మ్యాడీని ఒప్పిస్తుందా!
Chinni Serial Today Episode November 27th మధుని చంపేయాలని నాగవల్లి అనుకోవడం చిన్నిని మ్యాడీ అసహ్యించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి మ్యాడీతో మీ అమ్మని చంపింది నీ చిన్ని తల్లి అని చెప్తుంది. దాంతో మ్యాడీ చిన్ని మీద కోపం పెంచుకొని మధుని దగ్గర చిన్ని గురించి తిడతాడు. ప్రపోజ్ చేయాలి అనుకున్న మధుకి పెద్ద షాక్ తగులుతుంది.
మధు ఏడుస్తూ ఆ విషయం తల్లిదండ్రులకు చెప్తుంది. నా తల్లే మ్యాడీ తల్లి చావుకి కారణం అనుకుంటున్నాడు.. బతుకున్నప్పుడు కష్టాలు పడ్డ మా అమ్మ చనిపోయిన తర్వాత నిందలు మోస్తుందని ఏడుస్తుంది. మ్యాడీ అంటే పట్టించుకోవద్దని అంటే మ్యాడీనే చిన్ననాటి మహి అని మధు చెప్తుంది. చనిపోయిన మా అమ్మ నిర్దోషి అని నిరూపిస్తా.. నేరం చేసిన వాళ్లు కూడా దొరికేలా చేస్తా.. మ్యాడీ నోటే మా అమ్మ నిర్దోషి అని చెప్పిస్తా అని అంటుంది.
నాగవల్లి చిన్ని మధు ఒక్కరే అని గుర్తు చేసుకొని రగిలిపోతుంది. దేవా వచ్చి నాగవల్లితో మాట్లాడతాడు. చిన్ని కనిపించినా మ్యాడీ అసహ్యించుకుంటాడు కదా అని దేవా అంటే దాంతో నా పగ చల్లారదు బావ దాని కట్టే కాలితేనే నా పగ చల్లారుతుందని నాగవల్లి అంటుంది. నా
అక్క చావుకి కారణం అయిన ప్రతీ ఒక్కరికి చంపితే కానీ మా అక్క ఆత్మ శాంతించదు అని వల్లీ అనడంతో దేవా గతంలోకి వెళ్లి తనే తన భార్యని చంపడం గుర్తు చేసుకొని భయపడతాడు. మనసులో వీళ్ల అక్కని నేనే చంపాను అని తెలిస్తే క్షణం కూడాఆలోచించకుండా నన్ను చంపేస్తుందని అనుకుంటాడు.
మ్యాడీ కోపంగా ఇంటికి వస్తాడు. చిన్నిని నువ్వు మర్చిపోయి ఉంటావ్ అనుకున్నా.. చిన్ని వాళ్ల అమ్మే మీ అమ్మని చంపేసిందని తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పలేదని అంటారు. నీకు ఇచ్చిన గడువు దగ్గరపడుతుందని ఇలా చెప్పామని.. నీకు చెప్తే ఏం అయిపోతావో అని ఇన్నిరోజులు చెప్పలేకపోయాం అని అంటాడు. ఇక నువ్వు పూర్తిగా చిన్నిని మర్చిపోయి మా అందరి సంతోషం కోసం శ్రేయని పెళ్లి చేసుకో అంటాడు. మ్యాడీ నాగవల్లిని హగ్ చేసుకొని మీ లాంటి తల్లిదండ్రులు ఉండటం నా అదృష్టం అని అంటాడు. దేవా మనసులో నాగవల్లికి చిన్ని దొరికితే నేను నా భార్యని చంపినట్లు తెలిసిపోతుంది అని అనుకుంటాడు.
మ్యాడీ చాలా కోపంగా ఉంటాడు. చిన్ని పొరపాటున కూడా నాకు కనిపించినా చంపేస్తా అని మ్యాడీ అనుకుంటాడు. మ్యాడీ దగ్గరకు ఇంటిళ్లపాది ఫుడ్ చేసుకొని తీసుకొస్తారు. మ్యాడీ తినను అనేస్తాడు. జరిగింది తలచుకోవద్దని అంటారు. అందరూ కలిసి మ్యాడీని ఓదార్చుతారు. అమ్మని బాధ పెట్టకు మ్యాడీ అని లోహిత చెప్తుంది. నాగవల్లి ఏడుస్తుంటే మ్యాడీ వద్దని అంటాడు. నువ్వు బాధగా ఉంటే నేను బతికి కూడా వేస్ట్ నాన్న అని నాగవల్లి అంటే మ్యాడీ తల్లిని పట్టుకొని ఏడుస్తాడు. ఇద్దరూ ఏడుస్తారు. ఇక ఇద్దరూ ప్రేమగా టిఫిన్ తినిపించుకుంటారు. ఇంతలో వరుణ్ వచ్చి మధు వచ్చింది అనగానే మ్యాడీ పరుగులు పెడతాడు. మధునే చిన్ని అని గుర్తొచ్చి నాగవల్లి రగిలిపోతుంది.
దేవా, మధు మాట్లాడుతుంటే లోహిత నాగవల్లితో తనే చిన్ని అని చెప్పేస్తుంది ఏమో అంటే అలా చెప్తే బావ ఇప్పుడే దాన్ని చంపేస్తాడు బావ పొలిటికల్ కెరీర్ నాశనం అయిపోతుందని అంటుంది. ఇక దేవా మధుతో మ్యాడీకి ఇప్పుడు నీ లాంటి ఫ్రెండ్ అవసరం అని అంటాడు. మధు మ్యాడీని బయటకు వెళ్దామని అంటుంది. నాగవల్లి మధు దగ్గరకు వెళ్లి చిన్ని తప్పు ఏం లేదు అని చెప్తావా,, చిన్ని మీద కోపం తగ్గిస్తావా.. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు అని వార్నింగ్ ఇస్తుంది. మధు, మ్యాడీ బయటకు వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















