Ammayi garu Serial Today November 26th: అనాథ ఆశ్రంలో కోమలి ఫొటోచూసి షాక్‌కు గురైన రాజు,రూప, ఆ తర్వాత వారు ఏం చేశారు..?
Ammayi garu Serial Today Episode November 26th: అనాథ ఆశ్రమంలో కోమలి గురించి తెలుసుకున్న రాజు, రూప తల్లిని వెంటబెట్టుకుని సీఎం నివాసానికి బయలుదేరతారు. మరి ఇప్పుడు కోమలి సంగతేంటి..?

Ammayi garu Serial Today Episode: రూప,రాజు అనాథ ఆశ్రమానికి వచ్చారని అక్కడ ఉన్న అమ్మాయి ద్వారా తెలుసుకున్న కోమలి ఉలిక్కిపడుతుంది. తన జాడ తెలిసిపోతుందేమోనని భయపడిపోతుంది. అక్కడ ఎవరూ తన గురించి చెప్పకుండా చూసుకోవాలని చెబుతుంది. ఆమె సరేనని అంటుంది.ఈలోగా బ్యాంకు మేనేజర్ విజయాంబికకు ఫోన్ చేసి మీరు చెప్పినట్లే బస్తీ వాళ్లతో గొడవ పెట్టుకున్నానని....విరూపాక్షగారు వచ్చి బెదిరించి వెళ్లారని చెబుతాడు. వాళ్ల డబ్బులు ఇవ్వాలంటూ గన్‌గురిపెట్టి బెదిరించినట్లు చెబుతాడు. రెండు గంటల్లో విరూపాక్ష అకౌంట్‌లో డబ్బులు పడకుంటే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుందని వివరిస్తాడు. వెంటనే ఆ డబ్బు ఆమె అకౌంట్‌కు పంపిస్తానని చెప్పగా...అలా చేయవద్దని విజయాంబికా వారిస్తుంది. అయినప్పటికీ తీవ్రంగా బయపడిపోయిన బ్యాంకు మేనేజర్...ఆ డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తున్నానంటూ ఫోన్ పెట్టేస్తాడు.
అనాథ ఆశ్రమం నుంచి బయటకు వస్తూ రాజు ఒక్క క్షణం ఆగి మళ్లీ వెనక్కి వెళ్తాడు. అక్కడు ఉన్న కోమలి ఫొటోను చూస్తాడు. ఈమె ఎవరని అడగ్గా...పేరు కోమలి అని ఇక్కడే ఉండేదని చెబుతారు.దీంతో రాజు,రూప ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. మరోపక్క ఇంట్లో కోమలి టెన్షన్‌తో అల్లాడిపోతుంది. తన బండారం బయటపడుతుందేమోనని భయపడుతూ ఉంటుంది. ఈలోగా రూప తన తల్లికి విరూపాక్షకు ఫోన్‌చేసి అనాథ ఆశ్రమానికి రావాల్సిందిగా చెబుతుంది. అక్కడే ఉన్న కోమలి ప్రెండ్ ఈ విషయాలన్నీ ఫోన్‌లో కోమలికి చెప్పేస్తుంది. నీ గురించి అన్ని విషయాలు వారికి తెలిసిపోయాయని వివరిస్తుంది. భయంతో పరుగులు తీసుకుంటూ విజయాంబిక వద్దకు వెళ్లి ఆమెకు చెప్పేస్తుంది కోమలి. ఇక తన చాప్టర్ ముగిసిపోయినట్లేనని...వారు అనాథ ఆశ్రమానికి చెందిన వారిని తీసుకుని ఇక్కడికి వస్తారని అప్పుడు ఖచ్చింతంగా సీఎం గారు చంపేస్తారని భయపడుతుంది. వారు వచ్చేలోగా తాను ఇక్కడి నుంచి పారిపోతానంటుంది. విజయాంబిక ఎంత చెప్పినా వినకుండా అక్కడి నుంచి పరుగు తీస్తుంది. కోమలి దొరికిపోతే మనం కూడా దొరికిపోతామని విజయాంబిక కుమారుడు దీపక్‌తో అంటుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి మరోకుట్ర పన్నుతుంది. కారులో వస్తున్న విరూపక్ష దృష్టి మరల్చి....ఆమె గన్‌లో ఉన్న బుల్లెట్ దొంగలిస్తారు.
అనాథ శరణాలయం వద్దకు వచ్చిన విరూపాక్షికి కోమలి ఇక్కడే పెరిగిందన్న విషయం చెబుతారు రాజు,రూప.తనకు తెలియకుండా ఇన్నాళ్లు ఎలా ఉందని ఆమె అడగ్గా....మీరు వచ్చినప్పుడు కోమలి కాలేజీకి వెళ్లదని,ఆ తర్వాత ఉద్యోగం కోసం వెళ్లిందని బదులిస్తారు. మీ మధ్యనే తనకు పెళ్లిసంబంధం కూడా కుదిరిందని వారు చెప్పడంతో విరూపక్ష నమ్ముతుంది. దీంతో విరూపాక్ష అక్కడ ఉన్నవారందరినీ తనతోపాటు వచ్చి కోమలి ఇక్కడే పెరిగిందన్న విషయం సీఎంకు తెలపాలని చెబుతుంది. దీనికి వారు సరేనంటూ ఆమె వెనుక అడుగులు వేస్తారు. ఈ విషయం కూడా కోమలి తన ప్రెండ్ ద్వారా తెలుసుకుంటుంది. వాళ్లంతా సీఎం దగ్గరకు బయలుదేరారని తెలిసి హడలిపోతుంది. ఈ విషయాన్ని ఆమె విజయాంబికకు కోమలి చెబుతుంది. ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే మార్గమంటూ ఫోన్ పెట్టేసి బట్టలు సర్దుకోవడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.





















