Chinni Serial Today November 15th: చిన్ని సీరియల్: చిన్ని కోసం దేవా మ్యాడీతో కలిసి వెతికించడానికి కారణమేంటి! లోహిత కుట్రలు!
Chinni Serial Today Episode November 15th దేవేంద్ర వర్మ మహికి చిన్న అడ్రస్‌లు ఇచ్చి వెతకమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode శ్రేయ మ్యాడీతో మధు నువ్వు ఎక్కువగా మాట్లాడుకోవద్దు.. కలుసుకోవద్దు అని అంటుంది. నేను ఎవరితో ఉండాలి.. ఏం మాట్లాడాలి.. అనేది నువ్వు చెప్తావా.. నేను నీకు అలా ఎప్పుడైనా చెప్పానా.. నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని మ్యాడీ అంటాడు.
లోహిత శ్రేయతో చూశావా చూశావా సొంత మరదలు అని కూడా లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు.. నువ్వు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రేయ లేదంటే తను గద్ధలా నీ బావని తన్నుకుపోతుంది అని లోహిత చెప్తుంది. లోహిత డేట్ చూసి ఇప్పటికే పది రోజులు గడిచిపోయావి మిగతా 20 రోజులు గడిచిపోతే బాగున్ను అని లోహిత అనుకుంటుంది.
దేవా మహిని పిలిచి కొన్ని అడ్రస్‌లు చూపించి చిన్ని అన్న ముద్దు పేరు ఉన్న అడ్రస్‌లు ఇవి.. వీటన్నింటికీ మన వాళ్లు వెళ్లి వెతికారు.. ఎక్కడా చిన్ని ఆచూకీ తెలీలేదు. మిగతా అడ్రస్‌ల్లో కూడా ఈ రోజు వెతికిస్తున్నాం.. చిన్ని దొరికితే నీ అంత అదృష్టవంతుడు ఉండడు అని అంటాడు. మహి దేవాని హగ్ చేసుకొని థ్యాంక్యూ డాడీ కొడుకు ప్రేమకి ఇంతలా సపోర్ట్ చేసే తండ్రి ఉండరు అని అంటాడు. ఇక దేవా దగ్గర ఆ అడ్రస్ పేపర్లు తీసుకొని చిన్ని కోసం వెతుకుతా అని అంటాడు. లోహిత, శ్రేయ మొత్తం చూస్తారు.
మహి మధుకి కాల్ చేసి మనం అర్జెంటుగా చిన్నిని వెతకడానికి వెళ్లాలి అని అంటాడు. మధుని కాలేజ్ దగ్గరకు రమ్మని పిలుస్తాడు. లోహిత శ్రేయతో ఇలా మీ మామయ్య సపోర్ట్ చేస్తే నీకు మ్యాడీకి పెళ్లి అయినట్లే అని అంటుంది. ఇక మధుతో మ్యాడీ చిన్నిని వెతుకుదాం అంటే మధు ఎందుకు ఏం చెప్పడం లేదు.. అంటే ఏదో జరుగుతుంది అని అనుకుంటుంది.
శ్రేయ వెళ్లి దేవాని మీరు బావకి చిన్ని విషయంలో సపోర్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తుంది. ఎప్పుడు ఏం చేయాలో మామయ్యకి తెలుసు నువ్వు అనవసరంగా మామయ్యని ఇరిటేట్ చేయకు అని నాగవల్లి అంటుంది. మ్యాడీ మధు చిన్ని ఫొటో పట్టుకొని చిన్ని కోసం వెతుకుతూ ఉంటారు. లోహిత కూడా వాళ్లని ఫాలో అయి తనే చిన్ని అయితే ఎందుకు మ్యాడీకి చెప్పడం లేదు ఏదో జరుగుతుంది అని అనుకుంటుంది.
మ్యాడీ, మధులు చిన్నిని వెతుకుతూ ఓ టీచర్‌ని చూసి వెళ్తారు. ఇద్దరూ చిన్ని కోసం అడుగుతారు. చిన్ని కలవలేదు కానీ శేఖర్ కనిపించాడు అని అంటుంది. శేఖర్ అంటే చంద్ర శేఖరేనా అని మధు అడిగితే ఏమో తెలీదు అని అడ్రస్ ఇస్తుంది. దేవా కాల్ చేయడంతో మ్యాడీ విషయం చెప్తాడు. మ్యాడీని అక్కడికి వెళ్లనివ్వకూడదు అని దేవా వెంటనే వేరే ఒక అడ్రస్ చెప్పి తను మీ చిన్ని ఒక్కరే అనిపిస్తుంది. ఒకసారి వెళ్లి ఎంక్వైరీ చేయు అని అంటారు. దాంతో మ్యాడీ ఆ అడ్రస్‌కి తను వెళ్తాను అని మధుని చంద్ర శేఖర్ అడ్రస్‌కి వెళ్లమని అంటాడు.
మధు వాళ్లు తన అన్నని కలవకూడదు అని లోహిత తన ఇంటికి వెళ్తుంది. అప్పుడే చందు సరుకుల కోసం బయటకు వెళ్తాడు. సరళ బయట బట్టలు ఆరేస్తుంటే లోహి వెళ్లి గ్లామర్ అదీ ఇదీ అని తల్లిని బుట్టలో వేస్తుంది. మెడలో నెక్లెస్ పెట్టుకున్నప్పుడు గ్లామర్ ఉండాలి అని పార్లర్‌కి వెళ్దాం అని నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చి ఇంటికి తాళం వేయించి సరళని పార్లర్‌కి తీసుకెళ్లిపోతుంది.
మధు ఆ అడ్రస్‌కి రాగానే లోహిత చెప్పిన ఒకావిడ వచ్చి వాళ్లు ఎప్పుడూ ఇంట్లో ఉండరు అని చెప్పిస్తుంది. మధు వెళ్లిపోతుంది. ఇక ఆమె లోహితకు కాల్ చేసి విషయం చెప్పగానే లోహిత తల్లిని రోడ్డు మీద దింపేసి నీ ముఖానికి పార్లర్ అవసరమా.. అని చెప్పి ఇంటికి వెళ్లిపో అని అంటుంది. సరళ ఇంటికి వెళ్తూ అసలు దీనికి ఇంత గోల్డ్ ఎక్కడిది.. అసలు ఇది గోల్డేనా అని అనుకుంటుంది.
మధు ఇంటికి వచ్చి కావేరి ఫోటో చూస్తూ ఆ ఊరు వెళ్లొద్దు ఆ మనుషుల గురించి ఆలోచించొద్దు అన్నావ్ కానీ అదే జరుగుతుంది అమ్మా.. అని జరిగింది అంతా చెప్తుంది. రేపు మళ్లీ శేఖర్ వాళ్ల ఇంటికి వెళ్తా అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















