Chinni Serial Today January 31st: చిన్ని సీరియల్: మ్యాడీలో మార్పునకు కారణం అదేనా? లోహిత ప్లాన్ బెడిసికొట్టిందా?
Chinni Serial Today Episode January 31st లోహిత చంటిని మచ్చిక చేసుకొని మధు చిన్ననాటి ఫొటోలు మ్యాడీ చూసేలా ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ మధు గురించి ఆలోచించి నవ్వుతూ ఉంటే మధు వెళ్లి అబ్బాయి గారిలో ఈ మార్పునకు కారణం ఆ వ్రతమేనా.. అని మధు మ్యాడీకి కాఫీ ఇస్తుంది. మ్యాడీ మధు చేయి పట్టుకొని మదుని చూస్తాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. దూరం నుంచి లోహిత చూస్తుంది. అయ్యబాబోయ్ నన్ను వదిలేయ్ మ్యాడీ నీ చేతులు షాక్ కొడుతున్నాయి అని మధు అంటుంది. మధుని తరమాలని చూసి మధు పడిపోబోతే మ్యాడీ పట్టుకుంటాడు. అలా ఒకరి కళ్లలోకి ఒకరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. అది చూసి లోహిత నోరెళ్లబెడుతుంది.
మధు మ్యాడీతో ఏంటి మ్యాడీ కొత్తగా చూస్తున్నావ్ చలనం మొదలైందా అని అడుగుతుంది. నిన్నూ అని మ్యాడీ సరదాగా కొట్టడానికి చేయి ఎత్తితే ఇద్దరూ నవ్వుకుంటారు. మ్యాడీలో ఈ పైత్యానికి కారణం ఏంటి.. ఇప్పటికి ఇప్పుడు ఈ మార్పు ఏంటి.. ఈ శోభనం ఎలా ఆపాలి అని లోహిత అనుకుంటూ ఉంటుంది. ఇంతలో చంటి టీ తీసుకొని లోహిత దగ్గరకు వస్తాడు. పొరపాటున టీ పడిపోతే లోహిత చంటిని కొడుతుంది. మధు, మ్యాడీ, సుబ్బారావు, స్వరూప చంటిని లోహిత కొట్టడం చూసి షాక్ అయిపోతారు. లోహిత చంటీని నెట్టేస్తుంది మధు వెళ్లి తమ్ముడిని పట్టుకుంటుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. చిన్నపిల్లాడిని కొట్ట కూడదు అన్న సెన్స్ లేదా అని మధు అంటే నేను టీ వద్దు అన్నా వినకుండా ఇచ్చాడు.. ఖరీదైన నా చీర మీద పడేశాడు.. ఈ చీర విలువ తెలుసా మీ నాన్న నెల జీతం కంటే ఎక్కువ అని అంటుంది. వాడు మర్యాద చేయాలి అని టీ ఇచ్చాడమ్మా అని స్వరూప అంటుంది. ఏంటి మర్యాద,, మ్యాడీ షూ ఖరీదు ఉండదు మీరు పెట్టే బట్టలు.. పట్టు పరుపు మీద పడుకునే వాడికి మామూలు మంచం మీద పడుకోపెడుతున్నారు అది మీ మర్యాద,, నీ భర్త కూరగాయలు ఏ రోజుకి ఆ రోజు అమ్మితే కానీ తిండి తినలేని మీరు మర్యాద అంటున్నారు. అన్నింటికంటే పెద్ద మర్యాద ఏంటి అంటే నీ కూతురిని మ్యాడీకి ఎరగా వేసి మినిస్టర్ ఇంటికి కోడల్ని చేశారు అది మీ మర్యాద అంటుంది.
లోహితను చిన్ని లాగి పెట్టి కొట్టి ఇదే మాట మీ అమ్మని అని నిన్ను వరుణ్‌కి ఎరగా వేసింది అంటే ఎలా ఉంటుంది లోహిత అని అడుగుతుంది. మా అమ్మ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు.. ఎవరి అమ్మా అయినా మన అమ్మతో సమానం.. ఇంకెప్పుడూ ఇలా ఎవరి అమ్మ కోసం తప్పుగా మాట్లాడకు అని వార్నింగ్ ఇచ్చి చంటీని తీసుకొని వెళ్లిపోతుంది. నీ భార్యని కొడితే ఏం అనడం లేదు ఏంటి వరుణ్ అని లోహిత అడిగితే నిన్ను కొట్టాల్సింది నేను కానీ మధు కొట్టేసింది.. ఇప్పటి నుంచి అయినా నీ నోటిని కంట్రోల్‌లో పెట్టుకో అని అంటాడు. తర్వాత లోహిత నాగవల్లికి కాల్ చేస్తుంది. శోభనం ఆపడానికి ఏం చేస్తున్నావ్,, అక్కడి పరిస్థితులు ఏంటి అని అంటుంది. లోహిత మొత్తం చెప్తుంది. నాగవల్లి లోహితకు చిన్ని ఫొటోలు చూశా అన్నావ్ కదా నేను చెప్పింది చెయ్ అని ప్లాన్ చెప్తుంది.
చిన్ని చిన్నప్పటి ఫొటోలు ఎక్కడ పెట్టుంటారు వాటిని ఎలా సంపాదించాలి అని లోహిత ఆలోచించి చంటిని బుట్టలో వేసుకోవాలి అని చాక్లెట్ తీసుకొని వెళ్తుంది. చంటి మాట్లాడకపోవడంతో గుంజీలు తీస్తుంది. చంటి కరిగిపోతాడు. లోహిత చాక్లెట్ ఇస్తుంది. మీ అక్కబావల జీవితంలో ఈ రోజు చాలా మంచి రోజు కదా ఈ రోజు నువ్వు సర్‌ఫ్రైజ్ ఇవ్వాలి అలా ఇస్తే వాళ్లు చాలా సంతోషపడతారు అని చెప్తుంది. దాంతో చంటి మా అక్క చిన్నప్పటి ఫొటోలతో ఓ సర్‌ఫ్రైజ్ ఇస్తా అని చంటి పరుగులు తీస్తాడు. మధు మ్యాడీ దగ్గరకు వెళ్లి నేను తప్పు చేశానా అంటే నా ఫ్రెండ్ ఎప్పుడూ తప్పు చేయదు అని అంటాడు. నా పెళ్లాం ఎప్పడూ తప్పు చేయదు అని చెప్పు మ్యాడీ అని మధు అంటుంది. ఇక వరుణ్ అప్పుడే వస్తాడు. మధు సిగ్గుతో వెళ్లిపోతుంది. మధు నీ జీవితంలోకి రావడంతో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావ్.. మధుని ఎప్పటికీ సంతోషంగా చూసుకో బావ అని వరుణ్ అంటాడు.
దేవా మందు తాగుతూ తనని తాను అద్దంలో చూసుకొని ఏమైందిరా నీకు ఆఫ్ట్రాల్ చిన్నిని ఇన్నేళ్లు అయినా కనిపెట్టలేకపోతున్నావ్.. ఆఫ్ టికెట్ వచ్చినప్పుడైనా జాగ్రత్త పడాల్సింది .. పైగా నీ ఇంటికే వచ్చాడు.. నిన్నే చంపాలి అని చూసుకున్నాడు అయినా ఏం చేయలేకపోయావ్ ఏంట్రా అని తనని తాను అనుకుంటాడు. నువ్వే పార్వతిని చంపావని వాడు చెప్పాలని చూశాడు ఇంకేమైనా ఉందా నీ పని అని అనుకుంటాడు. చిన్ని ఆచూకీ ఎలా అయినా తెలుసుకోవాలి అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























