Chinni Serial Today January 1st: చిన్ని సీరియల్: మధు-మ్యాడీ గుడిలో పెళ్లి చేసుకోవాల్సిందేనా? దేవా, నాగవల్లి కూడా ఏం చేయలేరా!
Chinni Serial Today Episode January 1st మధు మ్యాడీలకు పెళ్లి చేయాలని తిలక్ గుడిలో గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు ఒడిలో మహి తల పెట్టుకొని పడుకొని.. చిన్న గురించి తెలుసుకొని చిన్ని ఒడిలో తల పెట్టుకొని పడుకోవాలి అనుకున్నా.. కానీ అది ఈ జన్మలో జరగదు.. అంతలా ప్రేమించిన చిన్ని ఒడిలో పడుకోకపోవడం నా దురదృష్టం.. ఇంతలా అభిమానించే నీలాంటి ఫ్రెండ్ ఒడిలో పడుకోవడం నా అదృష్టం అని చెప్పి మ్యాడీ పడుకుంటాడు.
మధు మనసులో చిన్ని గురించి అలా మాట్లాడుతున్నందుకు బాధ పడాలో మధు గురించి ఇలా మాట్లాడుతున్నందుకు సంతోషపడాలో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. మొత్తానికి ఇద్దరూ గుడిలో పడుకుంటారు. ఉదయం తిలక్ పంతులు, ఊరి జనం మొత్తం గుడికి వస్తారు. తాళం తీసి లోపలికి వచ్చి మధు, మ్యాడీ పడుకోవడం చూసి షాక్ అయిపోతారు. మ్యాడీని తిలక్ గుర్తు పట్టి మినిస్టర్ కొడకా భలే దొరికావురా అని అనుకుంటాడు. పూజారితో పూజారి గారు ముందు వాళ్లని శుద్ధి చేయండి అని అంటాడు. పంతులు ఇద్దరి ముఖం మీద నీరు వేసి లేపుతారు.
తిలక్ వాళ్లతో రాత్రంతా మీరు గుడిలో ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు. మేం గుడిలో ఉండగా తలుపులు మూసేశారు అని మధు చెప్తుంది. విషయం మ్యాడీ చెప్తాడు. ఇరుక్కుపోయాం అని అంటే మీరు ఇరుక్కుపోలేదు మాకు దొరికిపోయారు అని తిలక్ అంటాడు. ఈ గుడి ఆచారం ప్రకారం సంతానం లేని జంట లేదా ఇతర దంపతులు మాత్రమే గుడిలో నిద్ర చేయాలి.. ఈ గుడిలో నిద్ర చేసిన వాళ్లు మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రంలోపు పెళ్లి చేసుకోవాలి అని చెప్తారు.
మధు, మ్యాడీ షాక్ అయిపోతారు. మేం ఫ్రెండ్స్ మాత్రమే అని అంటారు. మీ క్లోజ్‌నెస్ చూస్తే మీరు ఎంత ఫ్రెండ్సో అర్థమవుతుంది. నిన్నే నీకు పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయితో పూజ చేసి తనని పంపేసి ఇప్పుడు ఈ అమ్మాయితో ఇలా ఏకాంతంగా నువ్వు మీ నాన్ననే మించిపోయావురా చేసిన పాపానికి ప్రాయశ్చితం కావాలి కదా మీరు సాయంత్రంలోగా పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. మధు తిలక్ వాళ్లతో తెలీక చేసిన మా తప్పునకు మీరు ఇలాంటి శిక్ష వేస్తే ముగ్గురి జీవితాలు నాశనం అవుతాయి సార్ అని అంటుంది. ఆరు నూరు అయినా మీ పెళ్లి జరగాలి అని తిలక్ అంటాడు. మీరు ఎవరు మా పెళ్లి చేయడానికి.. అని అడుగుతాడు. నేను ఈ ఆలయ ట్రస్ట్‌ని అంటాడు. మీరు ఈ ఆలయానికి మాత్రమే ట్రస్ట్ నేను ఈ రాష్ట్ర మినిస్టర్ కొడుకుని అని అంటాడు. మినిస్టర్ కొడుకు అయితే ఏంటి అని తిలక్ అంటాడు.
ఇప్పుడే మీ నాన్నని ఇక్కడికి పిలిపిస్తా అని దేవాకి కాల్ చేయిస్తాడు. దేవా ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఆలయం నుంచి దేవాకి ఫోన్ వస్తుంది. నో ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు త్వరగా వస్తా అని చెప్తాడు. ఏమైందని నాగవల్లి అడిగితే గుడిలో మ్యాడీ, మధులకు పెళ్లి జరగబోతుంది అంటే అని ఇంటిళ్లపాది పరుగులు తీస్తారు.
దేవా ఆవేశంగా గుడికి వెళ్లి ఎవడ్రా నా కొడుకుని నిర్బంధించింది అని అంటాడు. నీ కొడుకు తప్పు చేశాడు.. నీ కొడుకుకి వారసత్వంగా ఎన్ని కోట్లు ఇచ్చావో తెలీదు కానీ వారసత్వంగా తప్పులు చేసే అలవాటు ఇచ్చావ్ అని తిలక్ అంటాడు. తిలక్ మాటలు జాగ్రత్త అని దేవా అంటాడు. వీళ్లు బెస్ట్ ఫ్రెండ్స్ అంట అది తెలుసా మీకు.. రాత్రిళ్లు ఏకాంతంగా ఉండే అంత బెస్ట్ ఫ్రెండ్ మీకు తెలుసా.. ఒకరి ఒడిలో ఒకరు పడుకునే అంత బెస్ట్ ఫ్రెండ్స్ అది మీకు తెలుసా అని అంటాడు. నోటికొచ్చినట్లు మాట్లాడకు తిలక్ అని దేవా అంటే దేవాకి తిలక్ ఫోటో చూపిస్తాడు. దేవా, నాగవల్లి షాక్ అయిపోతారు. మధు దేవాతో అంకుల్ గుడిలో ఏదో పొగ వచ్చింది మత్తు వచ్చి పడిపోయా అని అంటే గుడిలో అగరబత్తీల పొగకి మత్తుకి పడిపోయింది అని తిలక్ అంటాడు. అందరూ నవ్వుతారు. దేవా అందర్ని ఆపండి అని అరిచి మీరు చెప్పండి అని మధు వాళ్లని అంటాడు.
మ్యాడీ తండ్రితో మధు పడిపోతే ఇద్దరం డోర్ కూడా కొట్టాం ఎవరూ తీయలేదు ఉదయం వీళ్లు చూసి ఏదేదో ఊహించుకుంటున్నారు అని అంటాడు. ఇక నేను చూసుకుంటా అని దేవా అంటాడు. దంపతులు కాని ఆడమగ ఈ గుడిలో నిద్ర చేస్తే వాళ్లు దంపతులుగా మారాలి అని నీకు తెలీదా అని తిలక్ అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















