Chinni Serial Today January 12th: చిన్ని సీరియల్: చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్రహింసలూ పడుతున్నా..! రిసెప్షన్ ఎప్పుడంటే!
Chinni Serial Today Episode January 12th నాగవల్లి తిలక్ నోరు మూయించడానికి మధు, మ్యాడీలకు రిసెప్షన్ పెట్టించాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode యలోహిత వరుణ్‌తో మన ఇద్దరి పెళ్లి కూడా ఆంటీకి ఇష్టం లేకుండా జరిగింది.. మ్యాడీ, మధుల పెళ్లి కూడా ఆంటీ ఇష్టం లేకుండా జరిగింది కదా.. వాళ్లకి అన్ని తంతులు జరిపించారు. అదే మనకి జరిపిస్తే సంతోషంగా ఉంటాం కదా అని అంటుంది. అవును అని వరుణ్ అంటే మరి అడుగు అని లోహిత అంటుంది. దానికి వరుణ్ మీ పేరెంట్స్ వస్తే చేయిస్తారు.. త్వరగా వాళ్లని రమ్మని చెప్పు అని వరుణ్ అంటే లోహిత కవర్ చేస్తుంది. మనసులో ఇక మనం పీటల మీద కూర్చొన్నట్లే అని అనుకుంటుంది.
మధు తనకు జరిగిన విషయం గురించి ఆలోచిస్తుంది. నిజంగా ఇదంతా గతం తాలూక ప్రభావమేనా ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తుంది. మ్యాడీ వచ్చి ఆ దొంగల గురించి ఆలోచిస్తున్నావా.. చైన్ పోతే పోయింది వదిలేయ్ అంటాడు. చైన్ కోసం కాదు ప్రాణం పోయింటే అని మధు అంటే నేను ఉండగా ఆ పరిస్థితి రానివ్వను అని చెప్పి మధుని పడుకోమని అంటాడు. ఇద్దరూ బెడ్ మీద పడుకుంటారు.
నాగవల్లి, దేవా దగ్గరకు వెళ్లి ఏం ఆలోచిస్తున్నావ్ బావ అని అడుగుతుంది. నువ్వేం చేస్తున్నావ్ నాగవల్లి ఇదంతా అవసరమా అని అడుగుతాడు. మనం ఇలా చేస్తేనే అందరూ మనల్ని నమ్ముతారు. ముఖ్యంగా మ్యాడీ మనల్ని నమ్ముతాడు. మధు తల్లిదండ్రులు నమ్ముతారు. తర్వాత మధు అడ్డు తొలగిస్తే అందరూ మనల్ని నమ్ముతారు అని అంటుంది.
మధు పడుకొని ఉంటే మ్యాడీ అటు చూస్తాడు. ఇంతలో మధు చీరపైకి వెళ్లడంతో మ్యాడీ మధు నడుం చూస్తాడు. మధు చూసి ఏం చేస్తున్నావ్,,. ఇంకోసారి అలా దొంగ చూపులు చూస్తే బాగోదు అని అంటుంది. నేను నీ పెళ్లాం అయితే చూడొచ్చు అని అంటుంది. అలాంటిది ఏం లేదు అని మ్యాడీ అనేస్తాడు.
మధు తల్లిదండ్రులు, తిలక్ ఇంటికి వస్తారు. మధు మీద అటాక్ జరిగింది కదా ఏమైంది అని అంటారు. ఇంతలో మధు, మ్యాడీ వస్తారు. మధు దొంగలు అని చెప్తారు. దేవా తిలక్‌తో నువ్వేం టెన్షన్ పడొద్దు.. వాళ్లకి ఏం కాలేదు అంటాడు. ఇంతలో నాగవల్లి దేవాతో బావ రిసెప్షన్ ఎప్పుడు పెడదాం.. అని అంటుంది. దేవా ఏంటి అంటే తిలక్‌ని చూపించి సైగ చేస్తుంది. దాంతో దేవాకి అర్థమై అవును అంటాడు. మ్యాడీ మాత్రం వద్దని అంటాడు. అలా అంటావేంటి నాన్న మా కోడల్ని ప్రపంచానికి పరిచయం చేయొద్దా.. మధు ఇంట గొప్పింటికి కోడలు అయిందని వాళ్ల తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.. వాళ్ల బంధువులకు ఆ సంతోషం చెప్పుకోవద్దా.. పైగా గుడిలో పెళ్లి అయింది కదా.. మేం కోడల్ని ఎలా చూసుకుంటున్నామో అని కొంత మందికి అనుమానం వాళ్ల అనుమానాలు అన్నీ గోదారిలో కొట్టుకుపోతాయి అని అంటుంది. దేవా నాగవల్లితో పంతులుకి చెప్పి రిసెప్షన్‌కి కూడా మంచి ముహూర్తం పెట్టించు అని అంటాడు.
తిలక్, మధు తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత నాగవల్లి మధు దగ్గరకు వెళ్లి ఏమో అనుకున్నా మీ వాళ్లు చాలా తెలివైనవాళ్లే.. లేదంటే ఆ తిలక్‌ని తీసుకొస్తారా అని అంటుంది. మా వాళ్లు తీసుకురారు.. మామయ్య గారికి ఆ తిలక్ ఫ్రెండ్ కదా ఆయనే చెప్పుంటారు అని అంటుంది. ఇద్దరూ వెటకారంగా ఒకర్ని ఒకరు నీ లాంటి అత్త దొరికినందుకు నేను అదృష్టవంతురాలిని అని మధు అంటే నీ లాంటి కోడలు దొరికినందుకు నేను అదృష్టవంతురాలిని అని నాగవల్లి అంటుంది. దూరం నుంచి లోహిత చూసి వీళ్లిద్దరూ ఇంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారేంటి అని అనుకుంటుంది. ఇక మ్యాడీ గదిలో ఎఫ్ 2 లోని వెంకీ ఆసనం వేస్తుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















