అన్వేషించండి

Chinni Serial Today February 14th: చిన్ని సీరియల్: ఒక్కటైపోయిన తిలక్, దేవా! మధుని చంపేస్తారా! సత్య ఇన్వెస్టిగేషన్‌లో ట్విస్ట్!

Chinni Serial Today Episode February 14th దేవా కేసు నుంచి సత్యభామని తప్పించడం.. తిలక్‌ని డబ్బుతో కొనేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవా తన మనుషులతో మాట్లాడుతూ మధు ఎలా అయినా దొరకాలి.. దాన్ని తీసుకొని రండి.. తీసుకురాగానే వేసేయాలి అని అంటాడు. సత్యభామ ఆ మాటలు విని ఎవర్ని వేసేయాలి అనుకుంటున్నారు అంకుల్ అని అడుగుతుంది. దేవా కవర్ చేయడానికి నవ్వుతూ అలా అర్థమైందా.. నేను అన్నది అదే కానీ నీకు అర్థం అయింది అది కాదు.. అని ఫారిన్ విస్కీ కోసం నా మనుషులకు చెప్పాను అని కవర్ చేస్తాడు. అదా నేను ఇంకా మధు కోసం ఏమో అని అనుకున్నా అంటుంది. 

మధు కేసు ఎంతవరకు వచ్చింది అని దేవా అడిగితే మీ మీదే నాకు అనుమానం ఉందని సత్యభామ అంటుంది. నా కోడల్ని నేను ఎందుకు కిడ్నాప్ చేస్తాను అని దేవా అరిస్తే రాజకీయనాయకులు ఏమైనా చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మధు కిడ్నాప్ అవ్వడానికి రెండు గంట ముందు మీరు సడెన్‌గా వెళ్లి గిఫ్ట్ ఇచ్చి సడెన్‌గా రావడం వల్ల మీ మీద అనుమానం వచ్చింది అని అంటుంది. ఫస్ట్నైట్ కాబట్టి వెళ్లాను.. పార్టీ ఆఫీస్ నుంచి కాల్ రావడంతో వెళ్లాను అంటాడు. వృత్తి ధర్మంలో భాగంగా మీ మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి.. దీని వెనక మీరే ఉన్నారు అని తెలిస్తే మాత్రం మిమల్ని అరెస్ట్ చేయడానికి వెనకాడను అంటుంది. సత్యభామకి నా మీద అనుమానం వచ్చేసింది వెంటనే తనని మార్పించేయాలి అని అనుకొని తన ఫ్రెండ్‌కి కాల్ చేసి డైనమిక్ అన్నావ్.. తనకి ఎలా ఇంటరాగేషన్ చేయాలో తెలీదు.. ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలీదు.. అప్రంటీస్‌ని తెచ్చి స్పెషల్ ఆఫీసర్‌లా పంపినట్లుంది. ఈ కేసుని చాలా చెండాలంగా చూస్తుంది. వెంటనే ఈ అమ్మాయిని తప్పించే.. లేదంటే నువ్వు నా ఫ్రెండ్ లిస్ట్ నుంచి తప్పించేయాల్సి వస్తుంది అని అంటుంది. వెంటనే తనని తప్పించాలని అనుకుంటాడు.

సత్యభామ ఇంట్లో అందరికీ తనని కేసు నుంచి తప్పించారని అంటుంది. కేసు అప్పగించిన రెండు రోజులకే తప్పించారు అంటే ఏదో బలమైన కారణం ఉంటుందని నాగవల్లి అంటుంది. ఎస్పీతో మాట్లాడుతా అని మ్యాడీ అంటే.. దానికి సత్య వద్దు మ్యాడీ ఈ కేసు నుంచి నన్ను తప్పించడం వెనక చాలా పెద్దవాళ్లు ఉన్నారు.. ఈ కిడ్నాప్ వెనక మనం ఊహించని పెద్దవాళ్లు ఉన్నారు.. రేపు మరో ఆఫీసర్ వచ్చినా వాళ్ల వల్ల తమకి ఇబ్బంది అవుతుంది అంటే ఇలాగే తప్పిస్తారు.. అంకుల్ మీకు అర్థమైంది కదా అంటుంది. నీ లాంటి అమ్మాయి ఉద్యోగం వదిలేసి పెళ్లి చేసుకొని భర్త, పిల్లలతో హ్యపీగా ఉంటే బాగుంటుంది అని దేవా అంటే.. నాలాంటి వాళ్లు ఇంట్లో ఉంటే బయట క్రిమినల్స్ హ్యపీగా ఉంటారు.. క్రిమినల్స్‌ని హ్యాపీగా ఉండనివ్వకూడదు అని అంటుంది. మధు కిడ్నాప్ కేసు ఫైల్ మాత్రమే నా దగ్గర నుంచి వెళ్తుంది. అఫీసియల్‌గా ఇన్వెస్ట్ గేట్ చేయకపోయినా అన్‌ ఆఫీషియల్‌గా కేసు చూస్తూ మ్యాడీ ముందు మధుని తీసుకొచ్చి నిలబెడతా.. నా ప్రయత్నాలు నేను చేస్తా మీ ప్రయత్నాలు మీరు చేయండి అంకుల్ అని సత్యభామ  అంటుంది. 

దేవా మనసులో మధుని తిలక్ గాడే తప్పించి ఉంటాడా.. వాడి దగ్గరే మధు ఉంటుందా అని అనుకుంటాడు. తిలక్ ఫోన్‌లో మాట్లాడుతూ దేవాని తొక్కేస్తా.. వాడి రాజకీయ జీవితం నాశనం అయిపోతుంది అని మాట్లాడుతాడు. ఇంతలో అక్కడికి దేవా వస్తాడు. ఏంటి నన్ను వెతుక్కుంటూ వచ్చావ్ అని తిలక్  అడిగితే నేను నిన్ను వెతుక్కుంటూ రాలేదు మధుని వెతుక్కుంటూ వచ్చా అంటాడు. మధు ఇక్కడ ఎందుకు ఉంటుంది అని తిలక్ అంటే నువ్వు కిడ్నాప్ చేస్తే ఇక్కడే ఉంటుంది కదా అంటాడు దేవా. నేను ఎందుకు కిడ్నాప్ చేస్తా.. నేనే కదా దగ్గరుండి వాళ్ల పెళ్లి చేశా అంటాడు. మరీ నటించకురా.. అందుకే నువ్వు పంచాయితీ స్థాయిలో ఆగిపోయావ్.. నేను నిన్ను తొక్కేశా అనుకుంటావ్ కానీ నువ్వే ఎదగలేవు అంటాడు. మధుని చూపిస్తా అని మ్యాడీని నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అర్థమైంది. నీకు తప్ప ఆ అవసరం ఇంకెవరికీ ఉండదు.. అని చెప్పి నాయక్‌ని పిలుస్తాడు.

నాయక్ డబ్బుల బ్యాగ్‌లు తీసుకొస్తాడు. మధుని నాకు చూపిస్తే ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఇంతే కాదు పొలిటికల్‌గా ఎదగడానికి టిప్స్ కూడా ఇస్తా అంటాడు. సరే పద తీసుకెళ్తా అని తిలక్ అని మధుకి దాని చెప్పిన గదికి తీసుకెళ్తాడు. నీ మనుషులు మధుని కిడ్నాప్ చేసినప్పుడు నేను చూశా.. వాళ్లు టీ తాగడానికి ఆగినప్పుడు మధుని మార్చేశా కాసేపట్లో మత్తు వదులుతుంది మీరు తీసుకెళ్లొచ్చు అంటాడు. మేం మధు కోసం రాలేదు.. మధు శవం కోసం వచ్చా.. ఇంకో బ్యాగ్ ఇచ్చి దీని నిండా డబ్బు ఉంది.. మధుని చంపేసి ఈ డబ్బు తీసుకో అని అంటాడు. తిలక్ సరే అని డబ్బు తీసుకుంటాడు. 

మ్యాడీ సత్యభామని కలుస్తాడు. సత్య మ్యాడీతో నా ఇన్వెస్టిగేష్‌లో భాగంగా మీ డాడీ మీద అనుమానం వచ్చింది. మీ ఇంటి ముందు మఫ్టీలో ఒక ఇన్‌స్పెక్టర్‌ని పెట్టా.. అతను మీ డాడీని ఫాలో అయ్యాడు. తిలక్ మీ డాడీకి రాజకీయ శత్రువు అన్నావ్.. మరి అక్కడికి మీ నాన్న వెళ్లారు అంటే మనకి అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందని సత్య చెప్పి ఇద్దరూ అక్కడికి బయల్దేరుతారు. మధు తిలక్‌ని చూసి అంకుల్ మీరా.. నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అని అంటుంది. నేనే అని తిలక్ షాకిస్తాడు. మీ మామయ్యతో శత్రుత్వం ఉంది.. కానీ ఇప్పుడు సంధి కుదిరింది.. అందుకే నిన్ను పైకి పంపేస్తా అంటాడు. మధు వద్దని బతిమాలుతుంది. తిలక్ మనుషులు మధుని చంపడానికి వెళ్లడం ఇంతలో మ్యాడీ అక్కడికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Varshini Gowda: 'జయం' సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్.. వర్షిణి గౌడ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు
'జయం' సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్.. వర్షిణి గౌడ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు
Lahari: చక్రవాకం, మొగలిరేకులు హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ టూ లగ్జరీ లైఫ్.. లహరి అన్ టోల్డ్ స్టోరీ!
చక్రవాకం, మొగలిరేకులు హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ టూ లగ్జరీ లైఫ్.. లహరి అన్ టోల్డ్ స్టోరీ!
Jagadhatri Serial Today JULY 22th: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ
జగద్ధాత్రి సీరియల్: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Jana Nayagan Twitter Review - 'జన నాయగన్' ట్విట్టర్ రివ్యూ: Tamil Nadu CM విజయ్ సినిమా హిట్టా? ఫట్టా? సోషల్ మీడియా టాకేంటి?
'జన నాయగన్' ట్విట్టర్ రివ్యూ: Tamil Nadu CM విజయ్ సినిమా హిట్టా? ఫట్టా? సోషల్ మీడియా టాకేంటి?
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Embed widget