Nindu Noorella Saavasam Serial Today February 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీని పట్టుకునేందుకు మనోహరి ప్లాన్ - అయోమయంలో రాథోడ్
Nindu Noorella Saavasam serial Today Episode February 14th: భాగీని ఎలాగైనా పట్టుకోవాలని మనోహరి ప్రయత్నిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ ఇంట్లో ఉన్న బుజ్జమ్మ పిల్లలతో కలసి దొంగాపోలీస్ ఆట ఆడుకుంటుంది. మరోవైపు ఆశ్రమంలో ఉన్న భాగీ, బుజ్జమ్మ లేకపోవడంతో బోర్‌గా ఫీలవుతుంది. ఇంతలో కరుణ వస్తుంది. అయితే భాగీ మాత్రం రాథోడ్‌కు ఫోన్ చేస్తుంది.
రాథోడ్: మిస్సమ్మ ఫోన్ చేస్తుందేంటి..? హలో మిస్సమ్మ చెప్పు..
భాగీ: రాథోడ్ బుజ్జమ్మను తీసుకొస్తావా…?
రాథోడ్: బుజ్జమ్మ ఇక్కడ పిల్లలతో ఆడుకుంటూ హ్యాపీగా ఉంది మిస్సమ్మ.. తనేం నిన్ను మిస్ అవ్వడం లేదులే
భాగీ: కానీ నేను మిస్ అవుతున్నాను రాథోడ్. ఐదేళ్ల పాటు ఆయనకు పిల్లలకు దూరంగా ఉన్న నాకు బుజ్జమ్మే తోడుగా ఉంది. తను నా పక్కన లేకపోతే ఏదోలా ఉంది రాథోడ్. బుజ్జమ్మకు అక్కడ అందరూ ఉన్నారు. కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను.. ఏదో తెలియని బాధ మనసును మెలిపెడుతుంది
రాథోడ్: బాధపడకు మిస్సమ్మ తొందరలోనే మీరు సారు అందరూ కలిసిపోతారు. మళ్లీ ఒక్కటిగా ఈ ఇంట్లో సంతోషంగా ఉంటారు
భాగీ: నేను ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను రాథోడ్ మాకు పట్టిన గ్రహణం వీడిపోయి ఎప్పుడెప్పుడు అక్కడకు వస్తానా అని ఎదురుచూస్తున్నాను..
రాథోడ్: సరే మిస్సమ్మ నేను సారుకు చెప్పి బుజ్జమ్మను తీసుకుని వస్తాను (మనసులో దీని అంతటికీ కారణం ఈ ఇంటికి పట్టిన ఆ మనోహరే.. ఆ శని గ్రహం దుష్టగ్రహం ఎప్పుడు వీడతాయో..)
భాగీని ఓదారుస్తుంది కరుణ.
కరుణ: బుజ్జమ్మను ఆడికి పంపించింది నువ్వే.. మళ్లీ తిరిగి ఈడికి తీసుకురమ్మేది నువ్వే ఏందో ఇది..
భాగీ: కన్నపేగే తట్టుకోలేకపోతున్నాను.. ఇప్పటి వరకు బుజ్జమ్మను విడిచి ఒక్కరోజు కూడా ఉన్నది లేదు.. పేరుకు తను నాకు కూతురే కానీ నాకు మా అక్కతో సమానం. అప్పుడు అక్కను చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు బుజ్జమ్మను మిస్ అవ్వాలంటే ఏడుపు వస్తుంది.
కరుణ: ఏందే ఇది బుజ్జమ్మ అమెరికాలో లేదే ఐదారు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. వాళ్ల నాన్న దగ్గరే ఉందే.. వాళ్ల అన్నయ్యలు, అక్కల దగ్గరే ఉంది. ఈ మాత్రం దానికే ఏడుస్తావా..?
భాగీ: బుజ్జమ్మ లేకుండా నేను ఉండలేనే..తనే నా బలం.. తనే నా బలహీనత
కరుణ: ఒక్క రెందు దినాలు బుజ్జమ్మ నీతోన లేకుంటేనే ఇంత బాధపడుతున్నావు.. అసువంటిది.. ఐదేళ్ల సంది మీ ఆయనకు నువ్వు బుజ్జమ్మ దూరం అయిండ్రే.. ఆయన ఎంత బాధపడింటాడు..
భాగీ: ఆ విషయం నేను ఆలోచించని రోజు లేదు కరుణ.. నేను ఆడదాన్ని కాబట్టి బయటకు ఏడుస్తున్నాను.. పాపం ఆయన మనసులో ఎంత ఏడిసి ఉంటారో.. నేను చాలా పెద్ద తప్పు చేశాను..
కరుణ: సరేలే ఊరుకోవే.. ఏడిస్తే పోయింది తిరిగి వస్తుందా..? చెప్పు.. ఈ కష్టాలు కన్నీలు ఎన్నాళ్లు ఉంటాయో చెప్పు.. జల్దిగానే బంద్ అయితవిలే.. గుళ్ల అమ్మవారి వేషం వేసినవులే..? ఆ అమ్మవారే నిన్ను కాపాడుతది.. ఇక నేను పోయి రానా..?
అంటూ కరుణ వెళ్లిపోతుంది. తర్వాత అమర్ మార్కెట్ దగ్గరకు వెళ్లి వెయిట్ చేస్తుంటాడు. ఎందుకు అని రాథోడ్ అడగ్గానే.. ఇంతకముందు కరుణకు భాగీ ఇక్కడే కదా కనిపించింది. మళ్లీ వస్తుందేమో అంటాడు. రాథోడ్ కంగారు పడుతుంటాడు. అమర్ వెనకే కొద్ది దూరంలో మనోహరి కారులో వెయిట్ చేస్తుంటుంది. ఇంతలో భాగీ ముసుగు వేసుకుని రోడ్డు వెళ్తుండటం అమర్, మనోహరి చూస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!























