అన్వేషించండి

Jagadhatri Serial Today JULY 22th: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ

Jagadhatri Serial Today Episode July 22th: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. జగధాత్రి,కేదార్‌ను వైజయంతి మరోసారి అవమానించడంతో కేదార్ బాధపడతాడు. నిషికకు సారీ చెప్పడానికి వెళ్లిన యువరాజుకు భార్య కోపం తెప్పిస్తుంది.అటు అడవి నుంచి బయటపడిన మీనన్‌ మళ్లీ సిటీలోకి వస్తాడు. జేడీ టీంలోకి కొత్తగా సింధూ రావడంతో ఈరోజు ఎపిసోడ్‌ ఆసక్తిగా సాగుతుంది.
తండ్రి కాళ్లకు కేదార్ మర్దన
                          కుర్చీలో కూర్చుని కూర్చుని సుధాకర్‌ కాళ్లు నొప్పులు వస్తుండటంతో బాధపడుతుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జగధాత్రి ఏమైందని అడుగుతుంది.కాళ్లు నొప్పిగా ఉన్నాయని చెబుతాడు. మాకు చెబితే మేం మర్దన చేసే వాళ్లం కదా మామయ్య అని అంటుంది.అప్పుడే అక్కడికి వచ్చిన వైజయంతి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదని....ఇలా చిన్నచిన్న పనులు చేసి ఆయనకు దగ్గరవ్వాలని చూస్తున్నారా అని మండిపడుతుంది.ఆయనకు సేవలు చేయడానికి నా కొడుకు, కోడలు ఉన్నారని అంటుంది. నిషికను పిలిచి మామయ్య కాళ్లకు మర్దన చేయాలి రా అని పిలుస్తుంది. నాకు మూడ్ లేదని చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో యువరాజు అక్కడికి రాగా....వాళ్ల అమ్మ నాన్న కాళ్లకు ఆయిల్‌ రాసి మర్దన చేయమని అడుగుతుంది. నేను అర్జెంట్ ఫోన్‌కాల్‌ మాట్లాడాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో సుధాకర్‌ ఎందుకే  లేనిప్రేమను ఒలకబోస్తున్నావని అరుస్తాడు. ఇంతలో కేదార్‌, జగధాత్రి ఆయిల్ తీసుకుని వచ్చి సుధాకర్‌కు మర్దన చేస్తారు.అది చూసిన వైజయంతి వాళ్లను తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది.
నిషికపై మరోసారి యువరాజు కోపం
                 ఏం తినకుండా పడుకున్న నిషిక దగ్గరకు వెళ్లి వైజయంతి ఆమెను పలకరించగా....కస్సుమంటుంది. దీంతో కిందకు వచ్చి యువరాజుపై అరుస్తుంది. నువ్వు వెళ్లి నీ పెళ్లాన్ని బుజ్జగించమని చెబుతుంది.దీంతో యువరాజు అన్నం ప్లేట్ పట్టుకుని నిషిక దగ్గరకు వెళ్తాడు.కోపంలో ఏదో చేయిచేసుకున్నాని సారీ అని చెబుతాడు.నువ్వు ఇలా అలిగి పడుకుంటే నాకు చాలా బాధగా ఉంటుందని అంటాడు.దీంతో నిషిక లేచి నువ్వు నన్ను కొట్టినందుకు కూడా బాధగా లేదని....దానికి సారీ చెప్పించినందుకే బాధగా ఉందని అంటుంది.ఇది చాలా చిన్న విషయమని...నువ్వు పట్టించుకోవద్దని అంటాడు.అయితే నేను కూడా నీలాగే ఓ అబ్బాయితో క్లోజ్‌గా మూవ్‌ అవుతానని...నువ్వు చేసిన పనులేవీ చేయనుగానీ అతనితో మాత్రం చాలా దగ్గరగా ఉంటానని అప్పుడు నువ్వు కూడా ఇలాగా చాలా చిన్న విషయమని తీసుకుంటావా అని అడుగుతుంది. ఆ మాటలకు యువరాజుకు కోపం వచ్చి అన్నం ప్లేట్‌ విసిరిపడేస్తాడు. నీకు అలాంటి ఆలోచన వచ్చినా చంపేస్తానని హెచ్చరిస్తాడు.నువ్వు తింటే తిను లేకపోతే చావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అడవి నుంచి బయటపడిన మీనన్‌
                             జేడీ గుంతలో పాతిపెట్టినా అతికష్టం మీద మీనన్ బయటకు వస్తాడు. కానీ ఎటు చూసిన అడవి ఉండటంతో ఎటు వెళ్లాలో తెలియక చాలా ఇబ్బందులుపడతాడు. చివరకు నడుచుకుంటూ చాలా దూరం వచ్చినా...అన్నం,నీరు లేక చాలా నీరసించిపోతాడు.ఎలాగో రోడ్డుమీదకు చేరుకుని అందరినీ లిప్ట్‌ అడుగుతుంటాడు. ఎవరూ మీనన్‌ను గుర్తుపట్టకపోవడంతో ఆపకుండా వెళ్లిపోతారు. చివరికి దండాలు పెట్టి ఓ స్కూటీని అపి దానిపై సిటీలోకి వెళ్లిపోతాడు.
జగధాత్రి టీంలోకి కొత్త అమ్మాయి
                              సాధూ జేడీకి ఫోన్ చేసి రమ్మని చెబుతాడు. మీనన్ కథ ముగిసిపోయింది కాబట్టి ఇక సిటీలో ఉన్న గ్యాంగ్‌లన్నింటినీ ఏరిపారేయమని చెబుతాడు. అయితే ఆ హెల్త్‌ మినిస్టర్‌ మనమీద చాలా కోపంగా ఉన్నాడని...నాకు తెలిసినంత వరకు నన్ను ఇక్కడ నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేయించాలని చూస్తున్నట్లు సమాచారం ఉందని అంటాడు. నేను వెళ్లిపోయిన తర్వాత వాళ్ల మనిషి ఇక్కడికి వస్తాడని అప్పుడు మీరు ఎవరో తెలుసుకుని మీపై పగ తీర్చుకోవాలనుకుంటున్నాడని అంటాడు. ఒకవేళ నేను ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సి వస్తే మీ ఫైల్స్‌ అన్నీ నాశనం చేసే వెళ్లిపోతానని అంటాడు. అప్పటిలోగా ఆ మినిస్టర్ బండారం బయటపెడతామని చెబుతాడు.అలాగే మీ టీంలోకి కొత్తగా ఓ అమ్మాయి వస్తోందని....స్పోర్ట్స్‌ కోటాలో చేరిందని చెబుతాడు. సింధూను వాళ్లకు పరిచయం చేయడంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.   

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 4th:విక్కీకి తొలిముద్దు పెట్టిన రాధ...విక్కీ మనసులో చోటు కోసం భార్యగా ప్రయత్నాలు
నువ్వులేక నేను లేను: విక్కీకి తొలిముద్దు పెట్టిన రాధ...విక్కీ మనసులో చోటు కోసం భార్యగా ప్రయత్నాలు
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
Embed widget