Illu Illalu Pillalu Serial Today February 14th:ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద సపోర్ట్! సాగర్ తండ్రిని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడా! చివరకి ఏమైందంటే?
Illu Illalu Pillalu Serial Today Episode February 14th సాగర్ జాబ్ కోసం లంచం ఇచ్చుంటాడని ఆ కూపీ లాగాలని వల్లీ, భాగ్యం ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode సాగర్ గవర్నమెంట్ జాబ్‌లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతాడు. నర్మద చూసి సార్ ఇక మమల్ని పట్టించుకుంటారో లేదో.. అంటూ సెటైర్లు వేస్తుంది. అసలే నేను టెన్షన్‌లో ఉన్నా.. ఇంక నువ్వు నన్ను ఆటపట్టించకు అని అంటాడు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న నర్మద ఎవరితో ఎలా ఉండాలో సాగర్‌కి చెప్తుంది. అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకొని సాగర్ బయల్దేరుతాడు. జేబులో డబ్బులు ఉన్నాయా అని నర్మద అడుగుతుంది. తన్నీ ఈడ్చినా ఒక్క రూపాయి లేదు అంటే నర్మద గిఫ్ట్ అంటూ 5 వేలు ఇస్తుంది.
సాగర్ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. మా నాన్న లాగే నా భార్య కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు అని చాలా బాధ పడ్డాను కానీ నాకు జాబ్ రావడం నా భార్యకి కూడా ఇష్టమే అని ఇప్పుడు అర్థమైందని అంటాడు. నాలాగే నా భర్త కూడా గవర్నమెంట్ ఉద్యోగి అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది.. కానీ నా కారణంగా మీ ఫ్యామిలీకి నువ్వు దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. దాంతో సాగర్ నర్మదని హగ్ చేసుకుంటాడు.
ప్రేమ ధీరజ్‌ని గుర్తు చేసుకొని హ్యాపీగా పరీక్ష రాయడానికి రెడీ అవుతుంది. ఇంతలో ధీరజ్ వచ్చి త్వరగా రెడీ అవ్వమని అంటాడు. నువ్వు రెడీ అయ్యేలోపు పరీక్ష అయి రిజల్స్ కూడా వచ్చేస్తాయని అంటాడు. అయినా పర్లేదు పదరా నన్ను ఎవరూ చూడరు కదా ఇలా వచ్చేస్తా అంటుంది. దానికి ధీరజ్ నేను చూస్తానే అందంగా రెడీ అవ్వు అని డ్రెస్ ఇచ్చి అది వేసుకోమని అంటాడు. ప్రేమ వేసుకుంటుంది. చాలా బాగున్నావే.. ఎప్పుడూ సరిగా చూడలేదు కానీ చందమామ డ్రస్ వేసినట్లు ఉన్నావ్ అంటాడు. ఇక ప్రేమకి జడ కూడా వేస్తాడు. ప్రేమ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. నేను పరీక్ష రాయడం మామయ్యకి ఇష్టం లేదు కదా వల్లీ అక్కకి తెలీకుండా వెళ్లాలి అని అంటుంది.
వల్లీ, భాగ్యం, ఇడ్లీబాబాయ్ తెగ ఆలోచిస్తూ ఉంటారు. సాగర్‌కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే దాని వెనక ఏదో మతలబు ఉందని భాగ్యం అంటుంది. ఇద్దరూ లోపలికి వెళ్తూ నర్మదని చూసి పొగరుబోతు పందికొక్కులు ఇళ్లంతా తిరుగుతూ తెగ ప్రతాపం చూపించేస్తున్నాయ్,, టైం చూసి వాటికి మందు ఎట్టేయడమో మంట పెట్టేయడమే చేయాలి అని వల్లీ అంటుంది. దానికి నర్మద అవును అవును వాటికి మాటలతో చెప్తే వినే పందికొక్కులు కావు కచ్చితంగా వాత పెట్టి చెప్పాల్సిందే అని నర్మద అంటుంది. అమ్మా అది మనల్ని పందికొక్కుల అందే అని వల్లీ తల్లితో చెప్తుంది. భాగ్యం వల్లీతో మేం సాగర్‌తో మాట్లాడి ఆ జాబ్ గురించి కూపీ లాగేస్తాం.. నువ్వు నర్మద రాకుండా చూసుకో అని అంటుంది. భాగ్యం, ఇడ్లీబాబాయ్ ఇద్దరూ సాగర్ దగ్గరకు వెళ్లి కింగ్ లాంటి ఉద్యోగం సంపాదించావ్,, అలాంటి జాబ్ రావాలి అంటే చాలా మంది చేతులు తడపాలి కదా అని మాటల్లో పెట్టి మీరు కూడా ఎంతో కొంత చదివించేసి ఉంటారు అని అంటారు. అవును అని సాగర్ 25 లక్షలు అని చెప్పబోయి ఏం మాట్లాడుతున్నారు. నేను కష్టపడి జాబ్ తెచ్చుకున్నా అంటాడు.
భాగ్యం వదలకుండా ఎప్పుడు పరీక్ష రాశావని అడిగితే పోయిన నెల 15 అని సాగర్ అంటే అప్పుడు సంక్రాంతి పండగ కదా.. అప్పుడు కూడా పరీక్షలు పెడతారా అని ఇడ్లీబాబాయ్ అంటారు. నర్మద బాక్స్ తీసుకొస్తూ ఉంటూ వల్లీ తొంగితొంగి చూస్తే ఉంటే పిలుస్తుంది. ఏం లేదు ఏం లేదు అనుకుంటూ వల్లీ వెళ్లిపోతుంది. నర్మద లోపలికి వెళ్లి మీరు ఇక్కడున్నారా అందుకేనా తను అక్కడ దొంగ చూపులు చూస్తుంది అని అంటుంది. భాగ్యం వాళ్లు వెళ్లిపోతారు. వాళ్లని చూసి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని నర్మద అడుగుతుంది. భాగ్యం కూతురితో పాతిక అని ఆగిపోయాడు అంటే ఎక్కడో గట్టిగానే లంచం ఇచ్చాడు ఆ సంగతి తేల్చాలి అంటుంది. నర్మదకు కోలుకోలేని దెబ్బ కొట్టాలి అని వల్లీ అంటుంది.
వేదవతి భర్తకి కాఫీ ఇచ్చి సాగర్‌ని ఆఫీసర్‌లా చూసి మురిసి పోతుంది. రామరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకోమని నర్మద సాగర్ని తీసుకొస్తుంది. నర్మద మామయ్యతో చెప్పి సాగర్ మొదటి సారి జాబ్‌కి వెళ్తున్నాడు ఆశీర్వదించండి అంటాడు. సాగర్ రామరాజు కాళ్లు పట్టుకుంటే రామరాజు కాళ్లు పక్కకి తీసుకుంటాడు. సాగర్ కన్నీరు పెట్టుకుంటూ నన్ను అర్థం చేసుకునేవాళ్లే లేరు.. ఆశీర్వదిస్తారా.. అలా సంతోషంగా పంపిస్తారు అని ఆశపడటం నాదే తప్పు అని నర్మద దగ్గర బ్యాగ్ తీసుకొని వెళ్లొస్తా నర్మద అని చెప్పి బయల్దేరుతాడు. ఇంతలో వేదవతి ఆపి పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలి అని ఆరాటపడటమే కన్నవాళ్ల ఆలోచన అయిపోతుంది. ఆ విషయంలో అందరి తల్లిదండ్రుల కంటే మీ నాన్న ముందు ఉంటారు. ఏదైనా ఒక పని చేసే ముందు కన్నవాళ్లకి చెప్పకూడదు అని నువ్వు అనుకోవచ్చు.. కానీ దాని వల్ల పిల్లలు సంతోషంగా ఉండకూడదు అని కోరుకునే దుర్మార్గమైన మనసు మాకు లేదురా అని చెప్పి కొడుకుకి బొట్టు పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























