Chinni Serial Today May 1st: చిన్ని సీరియల్: ఉషకి యాక్సిడెంట్.. ఆవేశంలో రాజు, సత్యంబాబు.. దేవా ఇంట్లో ఇద్దరూ ఎదురు పడతారా!
Chinni Today Episode ఉషకి దేవేంద్ర వర్మ కాల్ చేయడం రాజు స్పీకర్ పెట్టి దేవా మాటలు విని ఆవేశంగా దేవా ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవేంద్రవర్మ తనని పెళ్లి చేసుకోమని అడిగిన విషయం కావేరి గుర్తు చేసుకొని నాకు చేసిన దుర్మార్గం సరిపోదు అన్నట్లు పెళ్లి చేసుకోమని అంటావా అక్కడే నిన్ను చంపేయాలి అన్నంత కోపం వచ్చిందిరా నా కూతురు గుర్తొచ్చి ఆగిపోయా లేదంటే నిన్ను చంపేశాదాన్నిరా అని అనుకుంటుంది.
సత్యంబాబు కూడా దేవేంద్రవర్మని ఏం చేయలేకపోయాను అని లాయర్ ఆపకపోయుంటే వాడిని ఈ పాటికి చంపేసేవాడిని అనుకుంటారు. లోపలికి వెళ్తూ అటూ ఇటూ తిరుగుతున్న కావేరిని చూసి తనకి ద్రోహం చేసిన వాడి ఇంటికే పార్టీకి వెళ్లాల్సిన గతి పట్టింది పాపం కావేరి ఆ దుర్మార్గుడి ఇంటికి వెళ్లినందుకు గతం గుర్తొచ్చి నిద్ర పట్టడం లేదనుకుంటా అని అనుకుంటాడు. మజ్జిగ తీసుకొని కావేరి దగ్గరకు వెళ్తాడు. మనసు బాలేదా అని అడుగుతాడు. కావేరి ఏం కాదని చిన్ని రాలేదని వెయిట్ చేస్తున్నా అంటాడు. మజ్జిగ తీసుకొచ్చావ్ ఏంటి బ్రో అని అడిగితే మా కావేరికి మనసు బాలేక నిద్ర పట్టనప్పుడు మజ్జిగ తాగి పడుకుంటుంది అని చెప్తాడు. కావేరితో తాను గడిపిన క్షణాలు గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతాడు. దానికి కావేరి నేనే మీ చెల్లి అనుకో బ్రో నేను నువ్వే మా అన్నయ్య అనుకుంటా అప్పుడు నువ్వు ఒంటరి వాడివి కాదు అంటుంది. అన్నాచెల్లెల ఎమోషన్‌ని చిన్న చాటుగా చూస్తుంది. చిన్ని రావడంతో గుడ్ నైట్ చెప్పి చక్కగా పడుకోమని సత్యంబాబు చెప్పి వెళ్లిపోతాడు.
ఉదయం బాలరాజు ఆటో తీసుకొని వస్తాడు. పిల్లలు ఆటో ఎక్కుతారు. టీచర్ స్కూటీ పోయింది. మనతో పాటు వస్తాను అని చెప్పిందని అంటుంది. లోహిత మాత్రం టీచర్మకి అంకుల్‌కి పడదు కదా ఎలా ఎక్కించుకుంటారు అంటుంది. రాజు మనసులో ఇప్పుడు ఉషతో గొడవ పడకపోతే లోహితకు అనుమానం వస్తుందని అని ఉష రాగానే ఆటో ఎక్కించుకోను అని గొడవ పడతాడు. లోహిత కోసమే గొడవ అని ఉషకి సైగ చేస్తాడు. దాంతో ఉష కూడా రాజుతో కావాలనే గొడవ పడుతుంది. ఆటో ఎక్కుతా రాకపోతే నేను డ్రైవింగ్ చేస్తా అనడంతో రాజు తీసుకెళ్తాను అంటాడు.
దేవేంద్ర వర్మ తన రౌడీలకు కాల్ చేసి కావేరి బయటకు వచ్చి రోడ్డు క్రాస్ అయినప్పుడు కారుతో ఢీ కొట్టి వెళ్లిపోఅని చెప్తాడు. రాజు పిల్లల్ని డ్రాప్ చేసి లోహిత కోసమే గొడవ పడ్డాను అని చెప్తాడు. ఉష అర్థమైంది అని చెప్తుంది. ఒకరికి ఒకరు థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఇంతలో దేవా చెప్పినట్లు ఓ జంట ఉషని మాట్లాడాలి అని పిలుస్తారు. ఉష వెళ్లగానే కారుతో ఢీ కొడతారు. ఉష కింద పడిపోతుంది. చేతికి గాయం అవుతుంది. రాజు కట్టు కడతాడు. తర్వాత దేవా కావేరి నెంబరు కాల్ చేస్తాడు. రాజు చూసి ఇది దేవా నెంబరు కదా అనుకొని స్పీకర్ ఆన్ చేస్తాడు. దేవా మాట్లాడి నిన్ను నువ్వు కొట్టిన చెంప దెబ్బకి నా రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంది అని అడుగుతాడు. అది విన్న రాజు కాల్ కట్ చేసి కావేరికి విషయం అడిగి తెలుసుకుంటాడు. ఇంతకి తెగించాడా ఆ నీచుడు వాడిని వదలకూడదు అని ఆవేశ పడతాడు.
ఉషకి యాక్సిడెంట్ అయిందని తెలిసి చిన్ని పరుగున వస్తుంది. టీచరమ్మ అని పట్టుకొని హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో స్కూల్‌కి వద్దని ఇంటికి వెళ్లమని చిన్నికి ఉషకి చెప్తాడు. చిన్ని ఆటో తీసుకొని రమ్మని చెప్పడంతో నాకు అర్జెంట్‌గా వేరే పని ఉంది మీకు వేరే ఆటోలో పంపిస్తా అంటాడు. మరోవైపు సత్యంబాబు లాయర్‌తో నా చెల్లి జీవితం నాశనం చేసిన వాడిని చూస్తుంటే ముక్కలు ముక్కలు నరికేయాలి అని నువ్వే ఆపావని అంటాడు. దానికి లాయర్ మనం ఆవేశంతో కాదు ఆలోచనతో కొట్టాలి. వాడు నేరం చేశాడని అనడానికి మనం సాక్ష్యాలు సంపాదించాలి అందుకు వాడిని నువ్వు రెగ్యులర్‌గా కలవాలి అంటాడు. వాడు ఎలాగూ నీతో బిజినెస్ పెట్టిస్తా అన్నాడు కదా వాడితో ఆ వంకతో కలిసి సాక్ష్యాలు సంపాదించు అని అంటాడు. సత్యం దేవాకి కాల్ చేస్తాడు. దేవా కలుద్దామని అంటాడు. ఓ వైపు సత్యంబాబు, మరోవైపు రాజు కూడా దేవా దగ్గరకు వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: దేవేంద్రవర్మ ఎవరో తెలుసుకున్న సత్యం.. చెల్లి నిర్దోషి అని నిరూపించుకోగలడా!





















