Chinni Serial Today June 26th: చిన్ని సీరియల్: దారుణం.. కావేరిని చంపేసిన రౌడీలు.. చిన్ని అప్పగింతలు.. బాల పరిస్థితేంటి!
Chinni Today Episode కావేరి, చిన్నిల మీద దేవా రౌడీలు అటాక్ చేయడం కావేరి కాల్చేయడం, చిన్ని తల పగలగొట్టేయడం.. కావేరి చిన్నిని వేరే వాళ్లకి అప్పగించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode కావేరికి లాయర్ హరి కాల్ చేసి చిన్నిని తీసుకొని ఊరు నుంచి వెళ్లిపోమని అంటాడు. కావేరి ఆటో డ్రైవర్‌తో చెప్పి బస్ స్టాండ్‌కి తీసుకెళ్లమని అంటుంది. ఇంతలో ఆటో ట్రబుల్ ఇస్తుంది. కావేరి, చిన్నిలు దిగి మరో ఆటో ఎక్కేలోపు రౌడీలు కావేరిని కాల్చేస్తారు. బులెట్ వీపునకు తగిలిపోవడంతో కావేరి కింద పడిపోతుంది.
చిన్ని అమ్మా అని అరుస్తూ వెళ్లి చూసే సరికి కావేరికి రక్తం కారిపోతుంటుంది. నొప్పితో కావేరి విలవిల్లాడిపోతుంది. రౌడీలు వెంట రావడంతో కావేరి బలవంతంగా లేచి చిన్నిని తీసుకొని పరుగులు పెడుతుంది. రౌడీలు వాళ్లని చూసి కర్ర విసిరి కొడతారు. చిన్ని తలకు తగిలి రక్తం కారిపోతుంది. చిన్ని తలకు జరిగిన గాయం చూసి కావేరి ఏడుస్తుంది.
జైలులో బాలరాజు అన్నీ క్లీన్ చేస్తుంటాడు. ఓ అధికారికి బతిమాలి ఒక్క కాల్ చేసుకోవాలని ఫోన్ అడుగుతాడు. చిన్ని, కావేరిలు తప్పించుకొని ఓ చోట దాక్కుంటారు. బాలరాజు కావేరికి కాల్ చేస్తాడు. మెమొరీ కార్డు గురించి అడుగుతాడు. కార్డు దొరికింది అని చెప్తుంది. ఇక చిన్ని రౌడీలు వెంట పడ్డారు అని మెమొరీ కార్డు తీసుకొస్తుంటే రివాల్వర్ కాల్చారని చెప్పబోయే టైంకి ఫోన్ లాక్కుంటారు. జైలర్ వెళ్లిపోయిన తర్వాత మళ్లీ బాల ఫోన్ చేస్తాడు. ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇంతలో జైలర్ వచ్చి ఫోన్ లాక్కుంటాడు. బాల జైలర్‌ని చాలా బతిమాలుతాడు. నా ఫ్యామిలీ ప్రాణాపాయంలో ఉన్నారు అని బాల అంటే ప్రాణాలే కదా పోతే పోనీ అని జైలర్ అంటాడు. దాంతో బాల మర్యాదగా మాట్లాడమని అంటే జైలర్ బాలరాజుని చాలా కొడతాడు.
కావేరికి ఏమైందని బాలరాజు చాలా కంగారు పడతాడు. కావేరి చిన్నిని తీసుకొని వెళ్లి రోడ్డు మీద ఓ గుడి దగ్గర ఆగుతారు. చిన్ని, కావేరికి గుడిలో కలిసిన దంపతులు చూసి హాస్పిటల్‌కి తీసుకెళ్తామని అంటారు. కావేరి వద్దని చిన్నిని పారిపోమని చెప్తుంది. నేను హస్పిటల్‌కి వెళ్లినా బతకను నువ్వు వెళ్లిపో అని చిన్నిని అంటుంది. తన తల మీద ఒట్టు పెట్టుకొని చిన్నిని వెళ్లిపోమని అంటుంది. కావేరి ఆ మహిళ చేయి పట్టుకొని నా కూతుర్ని కాపాడండి.. మీ కడుపున పుట్టబోయే బిడ్డతో పాటు నా బిడ్డని మీ బిడ్డలా భావించండి ప్లీజ్ అని బతిమాలుతుంది. ఆవిడ నీ బిడ్డను కూడా నా బిడ్డగా చూసుకుంటా అంటుంది. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్లనమ్మా అని చిన్ని ఏడుస్తుంది.
చిన్నిని ఆ దేవుడే గుడిలో తమకు పరిచయం చేశాడు ఆ దేవుడు ఇచ్చిన బిడ్డలా చిన్నిని భావించి తల్లిదండ్రుల్లా మారుతామని ఆయన కావేరితో చెప్తారు. చిన్ని చేతులు ఆ దంపతుల చేతుల్లో పెట్టి ఈ క్షణం నుంచి చిన్ని మీ కూతురు అని అంటుంది. చిన్ని కావేరితో ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా నేను నిన్ను తప్ప ఎవరినీ అమ్మా అని పిలవను అని ఏడుస్తుంది. చిన్నితో కావేరి ఈ రోజు నుంచి ఈవిడే మీ అమ్మ ఈయనే మీ నాన్న అని చెప్తుంది. ఈ ఊరిలో నువ్వు ఎవరినీ కలవకూడదు.. ఈ ఊరి గురించి ఊరి మనుషుల గురించి పూర్తిగా మర్చిపోవాలి ఇది నా ఆఖరి కోరిక.. నా ఆఖరి కోరిక తీర్చుతానని మాట ఇవ్వమని అడుగుతుంది.
చిన్ని ఏడుస్తూ మాటిస్తుంది. హస్పిటల్‌కి వెళ్దాం అని ఎంత చెప్పినా కావేరి లేవదు. నాకు చాలా తృప్తిగా ఉందని చెప్తుంది. చిన్ని చూసి నా కూతురు నాకు మాట ఇచ్చింది.. అది చాలు.. నేను ఇప్పుడు ప్రశాంతంగా వెళ్లిపోతాను అని అంటుంది. చిన్ని చాలా ఏడుస్తుంది. ఇంతలో రౌడీలు రావడం చూసి మృత్యువు నన్ను వెంటాడుతూ ఎలా వస్తుందో చూడు అని వాళ్లని చిన్నిని తీసుకెళ్లిపోమని బతిమాలుతుంది. ఇంతలో కావేరి చనిపోతుంది. చిన్నిని బలవంతంగా తీసుకెళ్లిపోతారు. చనిపోయిన కావేరి అక్కడే పడిపోవడం చూసి రౌడీలు తల్లి చచ్చింది కానీ పిల్ల చావలేదురా అని అనుకుంటారు. చిన్ని చనిపోలేదని దేవాకి తెలిస్తే ఊరుకోడని చిన్ని కూడా చనిపోయిందని చెప్పాలని రౌడీలు అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: కీర్తి, చైతన్యల్ని బతిమాలిన రాజు, రుక్మిణిలు.. రాజు, రూపల జీవితాల్లో ఏం జరగనుంది?





















