Chinni Serial Today july 21st: చిన్ని సీరియల్: వరుణ్‌కి లోహిత స్పెషల్ గిఫ్ట్.. గురుడు పడిపోయాడా? చందు పరిస్థితేంటి?
Chinni Today Episode మహి, మధులు నెలపొడుపు చూసి ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం, లోహిత వరుణ్‌కి గిఫ్ట్ ఇచ్చి బుట్టలో వేసుకోవాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత తన ఫేక్ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటుంది. మహి, మధు, వరుణ్, శ్రేయ అందరూ వస్తారు. లోహిత వరుణ్‌కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తుంది. అందరూ షాకింగ్‌గా చూస్తే మనం అందరూ కాలేజ్ స్టూడెంట్స్ సాయంత్రం మనకు ఏం పని ఉండదు కానీ వరుణ్ గారు పెద్ద బిజినెస్ మెన్ కానీ పనులన్నీ పక్కన పెట్టి వచ్చారు అని అంటుంది. ఇక వరుణ్ గెస్ట్ హౌస్ చాలా బాగుంది అని లోహితలో చెప్తాడు.
లోహిత ఆ గెస్ట్ హౌస్ తనకు తన అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడని.. వాళ్ల అన్నయ్య ఫుల్ బిజీ సింగపూర్‌లో మీటింగ్‌కి వెళ్లాడు అంటూ తనదో పెద్ద బిజినెస్ ఫ్యామిలీ బాగా డబ్బు ఉంది అన్నట్లు డబ్బా కొడుతుంది. మధు, పద్దూలు లోహిత చెప్పేవన్నీ అబద్ధం అనిపిస్తుందని అనుకుంటారు. మరోవైపు చందు డబ్బులు పోయినందుకు బాధ పడతాడు. తల్లితో వారంలో అంత డబ్బు ఎలా తీసుకురావాలమ్మా ఇవ్వకపోతే ఆ గిరిధర్ ఊరుకోడు అని బాధ పడుతుంటాడు. లోహితకు ఏదైనా అవసరం వచ్చి ఆ డబ్బు తీసుకుందేమో అడుగుదామని అడగటానికి వెళ్తారు. లోహిత దిండులు పేర్చి బెడ్ షీట్ కప్పడంతో లోహిత పడుకుండదని అనుకుంటారు. సరళ లేపుతా అని బెడ్ షీట్ తీస్తుంటే చందు వద్దని ఆపుతాడు. తల్లిని తీసుకొని వెళ్లిపోతాడు.
లోహిత, మహి, శ్రేయ, వరుణ్‌లు బయట కూర్చొని మాట్లాడుకుంటారు. లోహిత మళ్లీ వరుణ్‌కి థ్యాంక్స్ చెప్తుంది. శ్రేయకి థ్యాంక్స్ చెప్పాలని తనే మమల్ని తీసుకొచ్చిందని మహి అంటాడు. లోహిత శ్రేయకి థ్యాంక్స్ చెప్తుంది. ఇక మహికి కూడా థ్యాంక్స్ చెప్పడానికి దగ్గరకు వెళ్తే మహి మూడు అడుగులు వెనక్కి వెళ్తాడు. లోహిత ఓ నువ్వు త్రీ ఫీట్ మెన్ కదా అంటే ఇంతలో మధు, పద్దు వస్తారు. పద్దు వాళ్లతో మా మధు కూడా త్రీ ఫీట్ విమెన్ మగాలకు మూడు అడుగుల దూరంలో ఉంటుందని అంటుంది. శ్రేయ వాళ్లతో ఏంటి మా బావనీ కాపీ కొడుతున్నావా అని గొడవ పడుతుంటే మహి ఆపమని అరుస్తాడు. ఇంతలో మహికి, మధుకి ఒకే సారి ఫోన్‌లు వస్తాయి. ఇద్దరూ ఒకర్ని ఒకరు కోపంగా చూసుకొని వెళ్లిపోతారు.
మరోవైపు చందు, సరళ మాట్లాడుకుంటారు. లోహిత ఆ డబ్బు తీసుకోకపోతే వాటిని తీసుకురావడం కష్టమని అనుకుంటాడు. చందు తండ్రి ఫొటో చూస్తూ కుటుంబాన్ని పోషించడం ఇంత కష్టమా అమ్మా.. నాన్న మన కోసం ఎంత కష్టపడేవాడో నాన్న కష్టం విలువ ఇప్పుడు తెలుస్తుందని అంటాడు. ఇక మహి, మధులు ఫోన్‌లు మాట్లాడుతుంటారు. కానీ సిగ్నల్స్ ఉండవు. చంటి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది. అంటే గంటలో వచ్చేస్తా అని మధు చెప్తుంది. చంటి జాగ్రత్తలు చెప్తాడు. ఇక నెల పొడుపు కనిపిస్తుంది. మధు నెల పొడుపు చూసి కళ్లు మూసుకొని ఇంటి దగ్గర ఉంటే అమ్మ, నాన్న, చంటిని చూసేదాన్ని ఇప్పుడు ఎవరి ముఖం చూడాల్సి వస్తుందో అనుకుంటుంది. మహి కూడా నెల వంక చూసి చిన్ని ముఖం చూడటం అలవాటు. ఇప్పుడు ఫోన్‌లో ఎలా చూసేది అనుకుంటాడు. కారు హారన్‌తో ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు.
మహి తనకు తన స్పెషల్ పర్సన్‌ని చూడటం అలవాటు అని అంటాడు. మధు కూడా తనకు తన ఫ్యామిలీని చూడటం అలవాటు అని అంటుంది. ఇద్దరూ నాకు ఏమైనా జరిగితే నీ పని అయిపోతుంది అంటే నీపని అయిపోతుందని అనుకుంటారు. ఇక మహి మళ్లీ చిన్ని ఫొటో పెట్టుకొని నెల వంకని చూస్తాడు. మధు చాటుగా చూడటానికి వెళ్లడానికి వెళ్తే మ్యాడీ ఫోన్ దాచేస్తాడు. ఇక లోహిత వరుణ్‌తో మాట్లాడుతూ మళ్లీ మళ్లీ థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకు అన్ని సార్లు అని నవ్వుకుంటారు. లోహిత వరుణ్‌కి బిస్కెట్స్ వేస్తుంది. గిఫ్ట్ ఇస్తుంది. వరుణ్ షాక్ అయి మీ భర్త్‌డేకి నేను ఇవ్వాలి మీరు ఇస్తున్నారేంటి అంటే ఈ స్పెషల్ డే లైఫ్ లాంగ్ గుర్తిండిపోవాలని నేను మీకు ఇస్తున్నా అని వరుణ్‌ని బుట్టలో వేసేలా మాట్లాడుతుంది. ఆ గిఫ్ట్ తానే పెడతాను అని చెప్పి వరుణ్ చేతికి బ్రేస్లెట్ పెడుతుంది. వరుణ్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు.
లోహితకు చాలా థ్యాంక్స్ చెప్తాడు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇక ఇద్దరూ వెళ్దామని లోహిత పడిపోబోతే వరుణ్ పట్టుకుంటాడు. ఇంతలో వరుణ్‌కి కాల్ రావడంతో వరుణ్ వెళ్లిపోతాడు. లోహిత డిసప్పాయింట్ అయితే తన ఫ్రెండ్ వెళ్లి ఏమైందే డిసప్పాయింట్ అయ్యావు అంటే నేను వీడి కోసం ఇంత ఖర్చు చేస్తే నాకు కనీసం గిఫ్ట్ ఇవ్వలేదు ఏంటే పిసినారోడా అనుకుంటుంది. కేక్ కటింగ్ తర్వాత ఇస్తాడులే అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: అన్న డబ్బు కొట్టేసిని లోహిత.. చందుకి అవమానం తప్పదా! సోదమ్మా మహికి ఏం చెప్పిందంటే!





















