అన్వేషించండి

Brahmamudi November 13th Today Episode: వీలునామా చదివిన షాక్‌లో రుద్రాణి.. కావ్యను భార్యగా ఒప్పుకోనని తేల్చి చెప్పిన రాజ్

Brahmamudi Serial Today Episode : ముక్కలైన వీలునామాను అతికించి రుద్రాణి, రాహుల్ చదువుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది.

Brahmamudi Serial November 13th Episode : అనామిక, కవి ఓ చోట కలుసుకుంటారు. అనామిక సీరియస్‌గా ఉండడంతో కవి కూల్ చేస్తాడు. 

రుద్రాణి: సమయానికి రాజ్ వచ్చి మొత్తం చెడగొట్టాడు. లేకపోతే నా పేరు మీద ఆస్తి వచ్చేది. అసలు నాన్న రాసిన వీలునామాలో ఏముంది? నిజంగానే నాన్న నా పేరు మీద ఆస్తి రాశారా లేదా.. ఎలా తెలుసు కోవాలి. రాజ్ చింపేసిన ఆ వీలునామాను తిరిగి అతికిస్తే అందులో ఏముందో తెలుస్తుంది కదా.. (పని మనిషి అప్పుడే ఇళ్లు తుడిచి ఆ కాగితాలను చెత్తబుట్టలో వేసేస్తుంది. రుద్రాణి అక్కడికి వెళ్తుంది. మహారాణిలా బతికిన నాకు చివరికి ఇందులో ఏరుకోవాల్సి వచ్చింది. 

రాహుల్: సూపర్ మామ్.. తాతయ్య రాసిన వీలునామా రాజ్ చింపేయగానే డస్ట్‌ బిన్‌ దగ్గరకు వచ్చి ఏరుకునే పొజీషన్‌కు వచ్చావా.. ఇలాంటి పనులు చేస్తే కామెడీగానే ఉంటుంది. అయినా ఈ వేస్ట్ పేపర్స్ ఏం చేసుకుంటావ్. ఇవి ఎందుకు నీకు?

రుద్రాణి: వీటిని తిరిగి అతికిస్తే తాతయ్య ఏం రాశాడో తెలుస్తుంది కదా. ఒకవేళ మీ తాతయ్య మన పేరు మీద ఆస్తి రాసుంటే ఏదో ఒకటి చేసి బ్లాక్‌మెయిల్ చేసి ఆస్తిని తిరిగి మన పేరు మీద రాయించుకోవచ్చు కదా.. నేను చస్తా అని బెదిరిస్తే ఏం చేయగలడు ఆ ముసలివాడు. ముందు వీటిని అతికించు.

చిట్టీ: ఏంటి బావా నువ్వు ఈ ఇళ్లు ముక్కలైపోతుంటే మనం చూస్తూ ఎలా ఉండగలం అనుకున్నావ్.. వీలునామా వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో తెలీదా.. పచ్చని కుటుంబంలో ఎన్ని కలతలు వస్తాయో నేను నీకు చెప్పాలా.. అసలు వీలునామాలో ఏం రాశావ్ బావా

మరోవైపు రుద్రాణి, రాహుల్ వీలునామాను అతికిస్తారు. అయితే రాహుల్ దాన్ని చదువలేకపోతాడు. రాహుల్‌ని రుద్రాణి తిడుతుంది ఆ సీన్ కాస్త కామెడీగా ఉంటుంది. ఇక ఆ వీలునామాను రుద్రాణి చదువుతుంది. (రుద్రాణి చదువుతున్న వీలునామాకు చిట్టీ, తాతయ్యల మధ్య సంభాషణలు వీలునామా గురించే ఉంటాయి.)  

తాతయ్య: ప్రస్తుతం ఆస్తులన్నీ నా పేరు మీదే ఉన్నాయి కాబట్టి ఈ ఆస్తులన్నీ అమ్మడానికి గానీ ఇతరుల పేరు మీద మార్చుకోడానికి ఎవరికీ ఎలాంటి హక్కులు ఇవ్వటం లేదు. 

రుద్రాణి: ఆస్తి ఎప్పటిలాగానే అందరూ అనుభవించాల్సిందేనని ధ్రువీకరిస్తున్నాను. ఇది వారసత్వ సంపదగా నా మునిమనవలకు చెందుతుంది. అంతే కాకుండా ఎవరైనా ఈ కుటుంబం నుంచి వేరు పడితే వాళ్లకు చిల్లిగవ్వకూడా చెందదు. ఇప్పటిలానే ఎప్పటికి అందరూ ఒకే కుటుంబంలా కలిసి మెలసి ఉండాలనే సదుద్దేశంతో ఇలా చేయడం జరిగింది.

వీలునామా చదివిన తర్వాత రుద్రాణి కళ్లు తిరిగి పడిపోతుంది. ఇక చిట్టీ అయితే వీలునామా ఎంత చక్కగా రాశావ్ అని తన భర్తను పొగుడుతుంది. తర్వాత రుద్రాణి లేచి ఆ వీలునామాను జాగ్రత్తగా దాయమని రాహుల్‌కి చెప్తుంది. ఇక సైలెంట్‌గా ఏడుస్తుంది. 

తన తాతయ్య వైద్యం కోసం లండన్‌లో భరద్వాజ్ అనే ఓ ప్రముఖ డాక్టర్‌ను రాజ్‌  సంప్రదిస్తాడు. ఆ డాక్టర్‌ ఇండియా బయలుదేరుతాడు. రాజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ విషయం చెప్పగానే రాజ్ నేరుగా వెళ్లి డాక్టర్‌ను రిసీవ్ చేసుకుంటా అని చెప్తాడు. 

రాజ్: నిజంగా గుడ్ న్యూస్ మమ్మీ. ఆయన తాతయ్య రిపోర్ట్స్ చూసి క్యాన్సర్‌ను క్యూర్ చేయగలను అని చెప్తే మనం తాతయ్య ప్రాణాలు కాపాడుకోవచ్చు మమ్మీ. సరే మమ్మీ ఫ్లైట్ వచ్చే టైం అయింది నేను వెళ్తా మమ్మీ. 

అపర్ణ: సంతోషంగా కిందకి వచ్చి.. అత్తయ్య గారు మామయ్య గారు ఏం చేస్తున్నారు. 

చిట్టీ: పుస్తకం ఏదో చదువుతుంటే లాక్కొని రెస్ట్ తీసుకోమని చెప్పా.

అపర్ణ: సరే మీరు కూర్చొండి ఇంట్లో వాళ్లందరికీ ఓ గుడ్ న్యూస్ అని చెప్పి డాక్టర్ గురించి చెప్తుంది. ఇక రుద్రాణి అయితే డాక్టర్ రాకుండా చూడకుండానే ఏం చెప్పలేం అంటుంది. దీంతో అందరూ ఆమెను తిడతారు. చివరకు స్వప్న కూడా అరుస్తుంది. దీంతో రుద్రాణి స్వప్నను వారిస్తుంది. 

కావ్య: రుద్రాణి గారు మా అక్క మీద అరుస్తారెందుకు తాతయ్యగారి విషయంలో తప్పుగా మాట్లాడితే నేను కూడా ఊరుకోను. 

రాజ్ డాక్టర్‌ను తీసుకొస్తాడు. డాక్టర్ ఉమ్మడి కుటుంబాన్ని పొగుడుతాడు. కావ్య రిపోర్ట్స్ తీసుకొస్తుంది. కావ్యను రాజ్ డాక్టర్‌కు పరిచయం చేస్తాడు. డాక్టర్ రిపోర్ట్‌ చూస్తాడు. తర్వాత తాతయ్యను పిలుస్తాడు.  

డాక్టర్: ఈ వ్యాధి మీకు ఉందని తెలియకముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారా

తాతయ్య: గుండె ధైర్యంతో అలానే ఉన్నా 

డాక్టర్: మిమ్మల్ని ఏ జబ్బు ఏం చేయలేదండీ. ఈ సమస్యను జయించాలన్న ఆత్మ బలం ఉంటే మీరు త్వరగా కోలుకొని మామూలు మనిషి అయిపోతారు. ఇది క్రిటికల్ కండీషనే. కానీ మీ తాతయ్య జబ్బుకు లొంగే మనిషి కాదు. ఆ కాలంలో ఆయన తిన్న తిండిగానీ ఇప్పటికీ ఆయన పాటిస్తున్న క్రమశిక్షణ ఇప్పటికీ ఆయన్ని కాపాడుతుంది. ట్రీట్మెంట్ సంగతి నాకు వదిలేయండి ఆయనకు ఏం కాకుండా నేను చూస్తా. అయితే వీటన్నింటికంటే పెద్ద క్యాన్సర్ ఏదైనా ఉంది అంటే అది కుటుంబంలో కలహాలు.. చీలికలే. అదే ఇంటి పెద్దను కృంగదీస్తుంది. అందుకే మీరుందరూ ఇలానే కలిసి ఉంటే ఆయనను మనం నిండు నూరేళ్లు హాయిగా బతికించవచ్చు.    

ఇక చిట్టీ ఆయనకు కావాల్సిందే అదే అని డాక్టర్‌తో చెప్పడంతో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

తరువాయిభాగంలో: కావ్య రాజ్‌లు ఓ చోట మాట్లాడుకుంటారు. మన సమస్యకు మనమే పరిష్కారం వెతుక్కొని మనం సంతోషంగా ఉంటేనే తాతయ్య తృప్తిగా ఉంటారు అని కావ్య అంటే ఈ సందర్భాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఒక్కటైపోవాలని కలలు కంటున్నావా.. నీతో కలిసి కాపురం చేయాలని కలలో కూడా అనుకోనని.. నిన్ను భార్యగా ఒప్పుకోనని తేల్చి చెప్తాడు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget