Brahmamudi Serial Today February 17th: బ్రహ్మముడి సీరియల్: రాజ్‌కి సర్‌ఫ్రైజ్ ఇస్తానన్న కావ్య, కల్యాణ్‌పై అనామిక సీరియస్
Brahmamudi Serial Today Episode కల్యాణ్ క్రెడిట్ కార్డులన్నీ కావ్య దగ్గర ఉన్నాయని అనామికకు తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Brahmamudi Today Episode : రేపు మీకో సర్‌ఫ్రైజ్ ఇస్తానని కావ్య రాజ్‌తో అంటుంది. ఏంటని రాజ్ అడిగితే వినిపించడంలేదని.. చెప్తే అది సర్‌ఫ్రైజ్ ఎలా అవుతుందని అడుగుతుంది. గుడ్ నైట్ అని చెప్పేసి పడుకుండిపోతుంది.
రాజ్: మనసులో.. నువ్వేంటే శ్వేతతో క్లోజ్‌గా ఉంటే మూటా ముళ్లు సర్దుకొని పోతావంటే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పడుకున్నావ్. ఇంతకీ ఆ సర్‌ఫ్రైజ్ ఏంటబ్బా. అయినా దీని సర్‌ఫ్రైజ్ మనకెందుకు.
మరోవైపు అనామిక కల్యాణ్‌ని తీసుకొని రూంకి వస్తుంది. ఆఫీస్ సంగతులు అడుగుతుంది. ఆఫీస్‌లో అందర్ని కూర్చొపెట్టుకొని కల్యాణ్ కవితలు చెప్పడాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. తర్వాత సెక్యూరిటీ వెళ్తాను అన్నా వదలకుండా కవిత చెప్పడం గుర్తుచేసుకుంటాడు. వాటిని అనామికకు చెప్పకుండా చాలా పనులు చేశాను అని కవర్ చేస్తాడు. దీంతో అనామిక హ్యాపీగా ఫీలవుతుంది. అదంతా తన క్రెడిట్‌ఏ అని అనామిక తనని తాను పొగుడుకుంటుంది.
మరోవైపు కావ్య సర్‌ఫ్రైజ్ ఏంటని రాజ్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కావ్య నిద్రలేచి కల వచ్చిందని అంటుంది. ఇక రాజ్ ఆ సర్‌ఫ్రైజ్ ఏంటని తనకు నిద్ర పట్టడం లేదని అంటాడు. దీంతో కావ్య నేను చెప్పను అంటుంది. ఇంకో సారి తనని విసిగిస్తే హాల్‌లో వెళ్లి పడుకుంటానని అప్పుడు జరిగే పంచాయితీకి నువ్వేం కారణం అని అంటుంది. ఇక పనిమనిషి స్వప్నకు జూస్ తీసుకొని వస్తే తన అత్త ఏదని స్వప్న అడుగుతుంది.
పనిమనిషి: రూంలో ఉన్నారమ్మా.. ఈరోజు నుంచి మీ పనులు అన్నీ నాకే చూసుకోమన్నారు.
స్వప్న: చెప్పడానికి ఆవిడ ఎవరూ చేయడానికి నువ్వు ఎవరు. ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా అది నేనే తీసుకోవాలి తప్పుకో.. రుద్రాణి జాలీగా పాటలు వినుకొని జూస్ తాగుతూ ఉంటే.. చూసిన స్వప్న.. నా పనులు పక్కన పెట్టి పాటలు వినుకుంటున్నావా అత్త.. చెప్తా.. అని రుద్రాణి చేయి పట్టుకుంటుంది స్వప్న..
రుద్రాణి: నువ్వేప్పుడు వస్తావ్..
స్వప్న: ఈ వేళలో నువ్వు ఏం చేస్తున్నావ్ అని పాడుకుంటున్నప్పుడు వచ్చా. నా గురించి నువ్వు పట్టించుకోకపోతే నేను మీ గురించి ఇలాగే పట్టించుకుంటాను. కడుపుతో ఉన్న కోడలి బాగోగులు గాలికి వదిలేసి ఇలా జ్యూస్‌లు తాగుతూ డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారా..
రుద్రాణి: ఏయ్ నీకు కావాల్సిన వన్నీ చేయడానికి నేను నీ పనిమనిషికి కాదు. దాని కోసం పని మనిషిని పెట్టాను కదా..
స్వప్న: ఎంత పనిమనిషి చేసినా సొంత మనిషి కాదు కదా..
రుద్రాణి: నీకు నేను చేయడం కావాలా సొంత మనిషి చేయడం కావాలా..
స్వప్న: రెండు కావాలి. ఎందుకు కంటే పనిమనిషికి మీద అంత అక్కరేముంటుంది చెప్పండి. అదే మీరు అయితే ఏం జరిగినా మీ మెడకే చుట్టుకుంటుంది కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకొని చేస్తారు. మీరు నాకు కోపం తెప్పిస్తున్నారు.
రుద్రాణి: ఏంటి బెదిరిస్తున్నావా.. అసలు ఏం చేయగలవా నువ్వు. రోజూ నన్ను టార్చర్ చేయడం కంటే ఒక్కసారి చంపేయ్..
స్వప్న: మీరు చనిపోతే నాకు సేవలు ఎవరు చేస్తారు. తప్పులు చేసేవారికి సొంత నిర్ణయాలు తీసుకొని హక్కు లేదు. మీకు అవసరం అయితే మీ పనులు పని మనిషితో చేయించుకోండి కానీ నా పనులు మాత్రం మీరే చేయాలి. అర్థమైందా..
రుద్రాణి: అర్థమైంది. ఒక్క అవకాశం ఒకే అవకాశం దొరకని నిన్ను అడ్రస్ లేకుండా చేస్తా..
రాజ్: హాలో ఏంటి మళ్లీ అప్పలమ్మలా రెడీ అవుతున్నావ్.
కావ్య: ఎవరు అప్పలమ్మ నా కట్టూ బొట్టుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా.. మా బావ అమెరికా నుంచి వస్తున్నాడు అండీ. మా బావ ఆరు అడుగుల ఎత్తు ఉంటాడు. ఎర్రగా బుర్రగా ఉంటాడు. అమెరికాలో బిజినెస్‌లు చేస్తుంటాడు. ఇవాళే ఇండియాకి వస్తున్నాడు.
రాజ్: నేను ఎవరు వస్తున్నారు అని నేను అడిగాను. ఎంత ఎత్తు ఉన్నాడు. ఎలా ఉన్నాడు అని అడగలేదు.
కావ్య: మా బావను తలచుకున్నప్పుడు నాకు అవే గుర్తొస్తాయి.
రాజ్: ఏహేయ్.. అవన్నీ నాకు ఎందుకు నువ్వు ఎందుకు తలచుకొని పులకరించిపోతున్నావ్.
కావ్య: ఒకప్పుడు మా బావ నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. తనతో పాటు ఫారెన్ కూడా తీసుకెళ్లిపోవాలి అనుకున్నాడు. కానీ దురదృష్టంగా మీతో నాకు పెళ్లి అయిపోయింది.
రాజ్: ఏయ్ తొక్కలో లైఫ్ ఆపండి..
కావ్య: సరే అండి నాకు టైం లేదు మా బావ వస్తున్నాడు కదా బోలేడన్ని కబుర్లు చెప్పుకోవాలి మీరు ఆఫీస్‌కు వెళ్లిపోండి నేను ఎయిర్‌పోర్ట్ దగ్గరకు వెళ్లి మా బావను తీసుకొని ఆఫీస్‌కు వస్తా.
రాజ్: ఇంతకీ మీ బావ పేరు ఏంటి..
కావ్య: మా బావ పేరు బావే అండీ..
కావ్య మాటలకు రాజ్ రగిలిపోతాడు. మరో వైపు కల్యాణ్ ఆఫీస్‌కు బయల్దేరుతాడు. ఇంతలో అనామిక షాపింగ్‌కు వెళ్దామని చెప్తుంది. దీంతో కల్యాణ్ తన క్రెడిట్ కార్డులు కావ్య దగ్గర ఉన్నాయని తెచ్చుకుంటానని అంటాడు. దీంతో అనామిక అంటే మీ దగ్గర డబ్బులు కూడా ఉండవా అని అడుగుతుంది. దీంతో కావ్యకి అనామిక సీరియస్ అవుతుంది. షాపింగ్ వద్దు అని వెళ్లిపోతుంది. తన అత్తకి ఆవిషయం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.