అన్వేషించండి

Brahmamudi Serial Today September 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణ గురించి డేంజర్ న్యూస్ చెప్పిన డాక్టర్లు – జాబ్ వెతుక్కునే పనిలో కావ్య

Brahmamudi Today Episode: హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన అపర్ణ కావ్య గురించి అడగ్గానే అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఇందిరాదేవి రాజ్‌ దగ్గరకు వెళ్లి తిడుతుంది. మీ పంతాలకు పోయి మా మనసులు కష్టపెడుతున్నారు అంటూ నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా ఆ పిచ్చిది నిన్ను భరించింది కానీ తెలియకుండా అది ఒక్క పొరపాటు చేసిందని ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఆపకుండా ఉండిపోయావు అంటూ నిలదీస్తుంది. ఈ ఒక్కసారి కావ్యను క్షమించి ఇంటికి తీసుకురా రాజ్‌ అంటుంది ఇందిరాదేవి. దీంతో నేను తీసుకురాను అంటాడు రాజ్‌. నేను ఇంట్లోంచి తనను  వెళ్ళగొట్టానా? మళ్లీ వెళ్లి తీసుకురావడానిక అయినా తన నిర్లక్ష్యం వల్ల మా  అమ్మ బలైపోయింది. ఇక తనంతట తాను వచ్చిన నేను ఊరుకోను అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు. తర్వాత కావ్య దగ్గరకు అప్పు వెళ్తుంది.

అప్పు: ఊరుకో అక్క ఎందుకు ఏడుస్తున్నావు. నువ్వు ఏడవడం మొదటిసారి చూస్తున్నా. అయినా ఎప్పుడు ఎదుటివాళ్ల గురించేనా.. నీ గురించి ఆలోచించవా..?  

కావ్య: ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అవుతుంటే ప్రశ్నించడమే వృథా అనిపించింది.

అప్పు: ఇదంతా నావల్లే. మా పెళ్లి వల్లే జరిగింది.

కావ్య: అదేం లేదు. దీనికి ఎవరూ కారణం కాదు. మా ఆయనే కారణం. పెళ్లికి ముందు ఒకరిపై ఒకరికి ప్రేమ లేకపోవచ్చు. కానీ, పెళ్లైన తర్వాత కూడా ప్రేమ లేకపోతే ఎలా? ఆయనకు నాపై ప్రేమే లేదు. ఆయన మనసులో నాకు చోటు లేదు. అందుకే అక్కడి నుంచి వచ్చేశాను.

 అని కావ్య చెప్పి ఇక నుంచి నా బతుకు నేనే బతకాలి అంటుంది. మరోవైపు అపర్ణ  దగ్గర కూర్చున్న సుభాష్‌.. ఆమెను బాధగా చూస్తూ..  కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయింది. నువ్వేమో ఇలా అయిపోయావు. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో ఏమో అని మనసులో అనుకుంటుంటాడు. ఇంతలో అపర్ణ  కదిలినట్టు కనిపించగానే సుభాష్‌ డాక్టర్‌ ను పిలుస్తాడు. డాక్టర్‌ వచ్చి చూడగానే అపర్ణ కళ్లు తెరిచి చూస్తుంది. ఇంతలో అందరూ వస్తారు. ఇందిరాదేవి ఎమోషన్‌ అవుతూ ఆ దేవుడే నిన్ను మళ్లీ బతికించి మాకు ఇచ్చాడని అంటుంది. అపర్ణ మాత్రం కావ్య కోసం చూస్తుంటుంది.

రాజ్‌: ఏంటీ మమ్మీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా..?

అపర్ణ: రాజ్.. కావ్య ఎక్కడ.. నా కోడలు ఎక్కడ..?

సిస్టర్‌: ఇప్పుడేగా ఆమెకు స్పృహ వచ్చింది. ఇంతమంది ఉంటే ఎలా అందరూ బయటకు వెళ్లండి.

అపర్ణ: కావ్య ఏదిరా..?  

 అని అపర్ణ అడగ్గానే రాజ్‌ మమ్మీ నిన్ను ఎప్పుడు డిశ్చార్జ్‌ చేస్తారో కనుక్కుని వస్తాను అని బయటకు వెళ్లిపోతాడు. డాక్టర్‌ రాజ్‌ కు అని జాగ్రత్తలు చెప్పి ఆమెను ఒక గాజు బొమ్మలా చూసుకోవాలని హెచ్చరించడంతో అందరూ షాక్ అవుతారు. స్వప్నకు కావ్య కాల్ చేసి అపర్ణ గురించి అడుగుతుంది. బాగానే ఉందని కోమాలోంచి బయటకు వచ్చిందని చెప్పడంతో కావ్య హ్యపీగా ఫీలవుతుంది. తర్వాత కావ్య హ్యాపీగా వెళ్లి కనకం, కృష్ణమూర్తికి విషయం చెప్పగానే వాళ్లు సంతోషపడతారు.

    ఇక నేను ఏదైనా జాబ్‌ చూసుకోవాలి అని కావ్య అంటుంది. దీంతో కావ్య గురించి కనకం, కృష్ణమూర్తి బాధపడతారు. అన్నింటికి కాలమే సమాధానం చెప్తుందని అనుకుంటారు. తర్వాత ఇంటికి వచ్చిన అపర్ణకు స్వప్న హారతి ఇవ్వడానికి వెళ్లగానే కావ్య ఎక్కడుందని అపర్ణ అడుగుతుంది. దీంతో ఎవరు తీసినా దిష్టే కదా అపర్ణ అని ఇందిరాదేవి అడగ్గానే.. కానీ ఎప్పుడైనా ఇలాంటివి నా కోడలు కావ్య కదా అత్తయ్యా చేస్తుంది. ఇప్పుడేంటి కొత్తగా స్వప్న వచ్చింది. అని అపర్ణ అడగ్గానే అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Embed widget