అన్వేషించండి

Brahmamudi Serial Today March 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : బిడ్డను ఎత్తుకుని ఇంటికి వచ్చిన రాజ్‌ - అయోమయంలో దుగ్గిరాల ఫ్యామిలీ

Brahmamudi Today Episode: రాజ్ ఇంటికి బిడ్డను ఎత్తుకుని రావడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్‌ రింగ్‌ తొడిగినట్లు కలగన్న కావ్య తర్వాత హ్యాపీగా రెడీ అయ్యి కిందకు వస్తుంది. అందరూ ఫంక్షన్‌ కోసం ఎదురుచూస్తుంటారు. గుంపులుగుంపులుగా చేరి ముచ్చట్లు పెడుతుంటారు. ఇంతలో రాజ్‌ వస్తాడు. కారు దిగి మరోవైపు వెళ్లి డోర్‌ ఓపెన్‌ చేస్తాడు. అందరూ సర్‌ప్రైజింగ్‌గా చూస్తుంటారు. ఏదో పెద్ద గిఫ్టే తెచ్చినట్టున్నాడు అని రుద్రాణి అంటుంది. ఇంతలో రాజ్‌ ఒక చిన్న బాబును కారులోంచి ఎత్తుకుని వస్తుంటాడు. అందరూ షాక్‌ అవుతారు. రాజ్‌ బాబును ఎత్తుకుని కావ్య పక్కన వచ్చి నిలబడతాడు.

అపర్ణ: రాజ్‌ ఎవరీ బిడ్డ..

ఇందిర: ఏవరీ బిడ్డ..

రుద్రాణి: బాబులా ఉన్నాడే.. అనాథ

అపర్ణ: ఇంతమంది అడుగుతుంటే సమాధానం చెప్పవు ఎంటి నాన్నా..

 ఇందిర: నువ్వు వస్తావని ఎదురుచూస్తుంటే హఠాత్తుగా బిడ్డను ఎత్తుకుని వచ్చావేంటి? ఈ బిడ్డకు ఈ ఇంటికి సంబంధం ఏంటి?

అపర్ణ: చెప్పరా బిడ్డకు తల్లి లేదా? తండ్రి లేడా? చెప్పరా?

రాజ్‌: అందరూ అడిగారు నువ్వు అడగవా? నువ్వు అడిగినా అడగకపోయినా  నేను సమాధానం చెప్తాను. మరీ ముఖ్యంగా ఇది నీకే చెప్తాను. కాసేపట్లో ఈ వేదిక మీద వేడుక జరుగుతుందన్న ఆశతో నువ్వు ఎదురుచూస్తుంటావన్న విషయం నాకు తెలుసు. కానీ ఇదే వేదిక మీద నేనొక నిజాన్ని చెప్పబొతున్నాను. అది విని తట్టుకునే శక్తి నీలో ఉందని నమ్ముతున్నాను.

అంటూ రాజ్‌ ఆ బాబును చూపిస్తూ వీడు నా రక్తం.. దుగ్గిరాల వంశ వారసుడు అని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. అపర్ణ రాజ్‌ను తిడుతుంది. మిగతావాళ్లు పెళ్లిరోజు ఫ్రాంక్‌ చేస్తున్నావా? అని అడుగుతారు. మేం ఎవ్వరం నువ్వు చెప్పేది నమ్మం అంటారు. దీంతో అబద్దాన్ని నిజం అని చెప్పలేని నేను నిజాన్ని కూడా అబద్దం అని చెప్పలేను అంటూ ఇది నిజం  ఈ బిడ్డ నా బిడ్డ  అంటాడు రాజ్‌. ఇక నుంచి ఈ ఇంటి వారసుడు అనడంతో అందరూ షాక్‌ అవుతారు. ఇందిరాదేవి వెళ్లి రాజ్‌ను తిడుతుంది.

రుద్రాణి: అదేంటమ్మా.. వాడు కచ్చితంగా నమ్మకంగా నిజమే అని చెబుతుంటే వాడు ఏ తప్పు చేయలేదని ఇంకా నమ్ముతావేంటి? ఇది ఎవరో చెప్పిన నిజం కాదు వాడే బయటపెట్టిన నిజం. ఏంటి వదిన అలా కొయ్యబారిపోయావు.  ఇన్నాళ్లు నా కొడుకుని నేను సరిగ్గా పెంచలేదని దుమ్మెత్తిపోశారుగా మరి నువ్వు నీ కొడుకుని ఎలా పెంచావు.

అపర్ణ: అరేయ్‌ విన్నావా?  మీ అత్త ఏమంటుందో విన్నావా? నా పెంపకం గురించి మాట్లాడుతుంది. ఈ అవకాశం ఇచ్చింది ఎవరు..? నీ తల్లిని ఈ స్థాయికి తెచ్చింది ఎవరు? నువ్వు .. నన్ను మీ అమ్మను ఒక మరబొమ్మలా మార్చిపడేశావు. ఇలాంటి పాపిస్టి పని ఎలా చేయగలిగావు నీకు నీ భార్య గుర్తుకు రాలేదా?

సుభాష్‌: ఏం అడగమంటావు అపర్ణా.. అన్నీ తెలిసినవాడు ఇలాంటి పరిస్థితుల్లో దోషిగా నిలబడితే నిలదీసినంత మాత్రాన నిజం అబద్దం అవుతుందా? తల్లిగా నువ్వెలా ఓడిపోయావో.. తండ్రిగా నేను ఓడిపోయాను..

అందరూ రాజ్‌ను ప్రశ్నిస్తుంటారు. రాజ్‌ మాత్రం మౌనంగా ఉండిపోతాడు. మాకెవ్వరికీ సమాధానం చెప్పకపోయినా నీ భార్యకు సమాధానం చెప్పు అని ఇందిరాదేవి అడగ్గానే నేనొక ప్రశ్నలా మారిపోయాను.. నా దగ్గర సమాధానం లేదు. అంటూ బాబును తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు రాజ్‌. కావ్య కూడా లోపలికి వెళ్తుంది.

కావ్య: ఇప్పుడు నేను ఏం చేయాలి. ఏడవాలా? సర్దుకుపోవాలా? బట్టలు సర్దుకునిపోవాలా? విడాకులు ఇచ్చి శాశ్వతంగా వెళ్లిపోవాలా?

రాజ్‌: ఏం చెప్పాలి. అడిగే స్థానంలో నువ్వున్నావు. చెప్పలేనంత దూరంలో నేనున్నాను.

అంటూ రాజ్‌ అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

Also Read: బురద నీళ్లలో 'విశ్వంభర' భారీ ఫైట్ - మెగాస్టార్‌ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today November 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని ఫాలో అయిన అమర్‌ - రామ్మూర్తి ఇంటికి వెళ్లిన భాగీ  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని ఫాలో అయిన అమర్‌ - రామ్మూర్తి ఇంటికి వెళ్లిన భాగీ  
Meghasandesam Serial Today November 8th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శారదను ఓదార్చిన కేపీ – చాటు నుంచి అంతా గమనించిన మీరా
‘మేఘసందేశం’ సీరియల్‌: శారదను ఓదార్చిన కేపీ – చాటు నుంచి అంతా గమనించిన మీరా
Nindu Manasulu Serial Today November 7th: నిండు మనసులు: ఆ ఇద్దరికీ నా మీద అంత నమ్మకం ఏంటి.. సిద్ధూలో మొదలైన అనుమానం!
నిండు మనసులు: ఆ ఇద్దరికీ నా మీద అంత నమ్మకం ఏంటి.. సిద్ధూలో మొదలైన అనుమానం!
Godavari Serial Today November 7th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద జాను, సూర్యల హగ్.. చూసేసిన సంజయ్! క్యారెక్టర్ లేదూ అంటూ గొడవ!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద జాను, సూర్యల హగ్.. చూసేసిన సంజయ్! క్యారెక్టర్ లేదూ అంటూ గొడవ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget