అన్వేషించండి

Brahmamudi Serial Today January 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌కు నిజం చెప్పిన కావ్య – ధర్మేంద్రను నిజం అడిగిన తులసి

Brahmamudi serial today episode January 30th: రాజ్‌ను నిజం చెప్పి రాజ్‌ను తీసుకుని మినిస్టర్‌ ఇంటికి వెళ్తుంది కావ్య. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode: కావ్య తన ఇంటికి రావడం. తాను మార్చిన రిపోర్ట్స్‌ చూపించడంతో మినిస్టర్‌ ధర్మేంద్ర షాక్‌ అవుతాడు. కావ్యను కోపంగా చూస్తూ.. తాను హాస్పిటల్‌ లో మార్చిన రిపోర్ట్స్‌ కనిపెట్టావు అంటే చాలా దూరం వచ్చావు అంటూ తిడతాడు.

కావ్య: నీ దగ్గర ఉన్న బిడ్డ.. నా బిడ్డ అని చెప్పడానికి ఈ రిపోర్ట్స్ అక్కర్లేదు. నా చూపు చాలు.. నాకు తగిలే నా బిడ్డ ఊపిరి చాలు. నువ్వు దుర్మార్గానికి పూనుకున్నావని తెలుసుకోవడానికి

మినిస్టర్‌:  నీ బిడ్డను నేనే మార్చాను... నీ బిడ్డను నీ దగ్గరికి ఇక చేర్చను

కావ్య: నీ బిడ్డను మార్చి.. నా ఒడిలోకి చేర్చే హక్కు నీకు ఎవరిచ్చారు?

మినిస్టర్‌: కావ్య నీ మీద నాకు ఎలాంటి పగ, ద్వేషం ఏం లేవు.. ఆ రోజు మాకు పుట్టిన బిడ్డకు ఆరోగ్య సమస్య ఉందన్నారు.. బతకదన్నారు. కానీ పాప గురించి తెలిస్తే నా భార్య నాకు దక్కదు. అందుకే మరో మార్గం లేక అలా చేశాను

కావ్య: అందుకని మరో తల్లికి కడుపుకోత మిగులుస్తావా? ఇంకో ఆడదాని చేత కన్నీళ్లు పెట్టిస్తావా?

మినిస్టర్‌: నా భార్య సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను.. నువ్వు తెలుసుకున్న నిజం, ఈ రిపోర్ట్స్ చాలా చిన్నవి.. ఈ బిడ్డ నీది అని చెప్పడానికి ఒక్క సాక్ష్యమైనా ఉందా? మీరు చేయించిన డీఎన్ఏ రిపోర్ట్స్ కూడా నేనే మార్చేశాను.. నువ్వు ఎక్కడ పట్టుకోలేవు, ఇండియాలో ఎక్కడ డీఎన్ఏ టెస్ట్ చేయించినా నాకు అనుకూలంగానే రిపోర్ట్స్ వస్తాయి. మీకు ఈ పాప కాకపోతే మరో బిడ్డను కనేందుకు అవకాశం ఉంది.. కానీ మాకు ఆ అవకాశం లేదు. కాబట్టి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను... నీ బిడ్డను మాత్రం మరిచిపో

కావ్య: డబ్బు, పలుకుబడి, పదవి ఉందని విర్రవీగుతున్నావు... నీ పవర్‌ని అడ్డం పెట్టుకుని ఎందరి జీవితాలతోనైనా ఆడుకోవచ్చని అనుకుంటున్నావు, వాటిని నేను పెకిలిస్తున్నాను. పదవితో వచ్చిన పవర్ నీది, పేగు తెంచుకుని కన్న మమకారం నాది. నీది బిడ్డల్ని మార్చిన కిరాతకం, నాది రక్తం పంచిన అమ్మతనం. ఇక నీకు, నాకే పోటీ. ఆట నువ్వు మొదలుపెట్టావు.. ముగింపు నేను ఇస్తాను, నా బిడ్డను నేను తిరిగి తీసుకెళ్తాను.. నీకు 15 రోజులు గడువు ఇస్తున్నాను.. గడువులోపు నీకు నువ్వుగా చేసిన తప్పు ఒప్పుకునేలా నీ చేతుల్లో బిడ్డని, నా చేతుల్లో పెట్టేలా చేస్తాను. నా పాపని నేను తీసుకెళ్తాను

అంటూ చెప్పి కావ్య వెళ్లిపోతుంది. అంతసేపు చాటుగా ఉన్న రుద్రాణి మినిస్టర్‌ దగ్గరకు వస్తుంది.

మినిస్టర్‌: దాని కాన్ఫిడెన్స్ ఏంటీ? మినిస్టర్‌తో మాట్లాడుతున్నానన్న భయం కూడా లేదు

రుద్రాణి: అది ఒంటరి ఆడది, దాని భర్త, దాని కుటుంబమే దానిని నమ్మడం లేదు. దానికి అంత సీన్ లేదు.

అంటూ రుద్రాణి మాట్లాడుతుంది. ఇక ఇంటికి వెళ్లిన కావ్యను రాజ్‌ గుమ్మం దగ్గరే అపేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అపర్ణ వచ్చి కావ్యను తిట్టి బాధపడుతుంది. దీంతో కావ్య ఇప్పటిదాకా మిమ్మల్ని బాధపెట్టాను ఇక నిజం తెలిసింది బాధపెట్టను అంటూ లోపలికి వెళ్లిపోతుంది. రేఖ వచ్చి కావ్యకు పిచ్చిపట్టినట్టు ఉంది. అది బయటకు వెళ్తే మన కుటుంబం పరువు పోతుందని చెప్తుంది. అందరూ ఆలోచిస్తుంటారు. తర్వాత రాజ్‌కు జరిగిన విషయం చెప్పి మనిష్టర్‌ ఇంటికి రాజ్‌ను తీసుకుని వెళ్లి తమ పాపను చూపిస్తుంది కావ్య. అప్పుడే మినిస్టర్‌ అక్కడికి వస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today June 30th:కాత్యాయినీ కళ్లల్లో కంగారు ఎందుకు..? కాచీ తీసుకెళ్తున్న బ్యాగ్‌లో ఏముంది..?
జగద్ధాత్రి సీరియల్: కాత్యాయినీ కళ్లల్లో కంగారు ఎందుకు..? కాచీ తీసుకెళ్తున్న బ్యాగ్‌లో ఏముంది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 30th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల బుట్టలో విహారి పడతాడా! సహస్రకు లక్ష్మీ గురించి తెలుస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల బుట్టలో విహారి పడతాడా! సహస్రకు లక్ష్మీ గురించి తెలుస్తుందా!
Godavari Serial Today June 30th: 'గోదావరి' సీరియల్: వేలంపాట దగ్గరకు వెళ్లి గొడవ చేసిన జాను..! జానుని తోసేసిన అధికారులు!
'గోదావరి' సీరియల్: వేలంపాట దగ్గరకు వెళ్లి గొడవ చేసిన జాను..! జానుని తోసేసిన అధికారులు!
Nindu Manasulu Serial Today June 30th: నిండు మనసులు: బామ్మ గెటప్‌లో ఇరగదీసిన ప్రేరణ.. వరుణ్ ఆచూకీ తెలిసినట్లేనా!
నిండు మనసులు: బామ్మ గెటప్‌లో ఇరగదీసిన ప్రేరణ.. వరుణ్ ఆచూకీ తెలిసినట్లేనా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Embed widget