అన్వేషించండి

Brahmamudi Serial Today January 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: మినిస్టర్‌ దర్మేంద్రను హెచ్చరించిన రుద్రాణి – ఆందోళనలో రేఖ  

Brahmamudi serial today episode January 22nd: కావ్య అన్నంత పని చేస్తుందని డీఎన్ఏ టెస్టుకు రెడీ అయిందని రుద్రాణి, ధర్మేంద్రకు చెప్పడంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.     

Brahmamudi Serial Today Episode: పాపను ఆడిస్తున్న కావ్యను చూసిన అపర్ణ, ఇందిరాదేవి ఎమోషనల్ అవుతుంటారు. ఈ పాప కోసం కావ్య ఎన్ని కష్టాలు పడింది. తీరా ఇప్పుడేమో ఈ పాప తన పాప కాదని వాదిస్తుంది..ఏం చేయాలో అర్థం కావడం లేదు అని బాధపడుతుంటారు. ఇంతలో రాజ్‌ వచ్చి తాను బాధపడుతుంటాడు.

అపర్ణ: ఓరేయ్‌ రాజ్‌,  కావ్య ఎందుకు అలా చేస్తుందో ఒకసారి ఆలోచించరా..?

రాజ్‌: నా బిడ్డను ఈ లోకానికి చూపించడం కళావతి కల.  ఆ ఆనందాన్ని అనుభవించకుండా, అసలు ఆ బిడ్డే నాది కాదు అంటుంది. అంటే నేను ఆలోచించకుండా ఉంటానా? నాకు కూడా కళావతి మాటల్లో నిజం ఉందనే అనిపిస్తుంది అమ్మ.. కానీ బిడ్డను మార్చేశారు అని హాస్పిటల్‌లో గొడవ చేయడానికి మన దగ్గర సాక్ష్యం ఉండాలి కదా..? అదేమీ లేకుండా మనమేం చేయలేము ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది.

ఇందిరాదేవి: అప్పు నిద్ర పోకుండా నువ్వెందుకు కష్టపడుతున్నావే వెళ్లి పడుకో

అప్పు: అక్క పడుతున్న బాధను చూడలేకపోతున్నాను అమ్మమ్మ. అక్క మాటలు డాక్టర్లు నమ్మాలన్నా.. మనకు సాక్ష్యం ఉండాలన్నా పాపకు డీఎన్‌ఏ టెస్ట్‌ చేయిస్తే సరిపోతుంది కదా..? డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్ట్‌ లేకుండా హాస్పిటల్‌ మీద కేసు కూడా వేయలేం..

అంటూ అప్పు చెప్పగానే.. అందరూ సరే అంటారు..

స్వప్న: అయితే ఈ టెస్ట్‌ చేయించడానికి కావ్యను రాజ్‌ మాత్రమే ఒప్పించగలడు.

అని చెప్పగానే అవును మనం ఎవ్వరం చెప్పినా కావ్య ఒప్పుకోదని అందరూ అంటారు. తర్వాత రాజ్‌ కావ్య దగ్గరకు వెళ్లి పాప గురించి మాట్లాడుతూ డీఎన్‌ఏ టెస్ట్‌ గురించి చెప్తాడు.

కావ్య:  నువ్వు అంటున్న మాటలు నీ మనసులో నుంచి ఊరికే రాలేదు అనిపిస్తోంది.. మీ భార్య మాటల మీద నమ్మకం ఉండి మాట్లాడుతున్నారా? లేక ఇంట్లో వాళ్ల బాధ భరించలేక నన్ను ఒప్పించడానికి వచ్చారా?

రాజ్‌: ప్రతిమాటను ఎందుకు వేరే కోణంలో ఆలోచిస్తున్నావు

కావ్య: మనకి తెలియకుండా పెద్ద నష్టం జరిగింది.. నా బాధ మీకు అనుమానంగా కనిపిస్తుంది.. కానీ నాది అనుమానం కాదు.. అక్షర సత్యం.

రాజ్‌: దీని వెనుక ఉన్న నిజం నిగ్గు తేల్చడానికి, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను

కావ్య: అయితే ఈ బిడ్డ మన బిడ్డ కాదని నిరూపించడానికి ఏం కావాలన్నా చేస్తాను

అంటూ కావ్య డీఎన్‌ఏ టెస్టుకు ఒప్పుకుంటుంది. అక్కడే ఉండి అంతా గమనిస్తున్న రేఖ వెంటనే వెళ్లి రుద్రాణికి ఫోన్‌ చేసి విషయం మొత్తం చెప్పేస్తుంది. వెంటనే రుద్రాణి మినిస్టర్‌ దగ్గరకు వెళ్తుంది.

మినిస్టర్‌: ఏంటి రుద్రాణి మళ్లీ వచ్చావు.. ఏం బ్యాడ్‌ న్యూస్‌ పట్టుకొచ్చావు..?

రుద్రాణి: బ్యాడ్‌ న్యూసే మీకు నాకు ఇద్దరికీ..  ఆ కావ్య డీఎన్‌ఏ టెస్టుకు ఒప్పుకుందట సార్‌..

మినిస్టర్‌: బిడ్డల్ని మార్చాం కానీ, ఆ ఫ్యామిలీని మాత్రం నమ్మించలేకపోతున్నాం..

రుద్రాణి:  ఇంకా నయం ఆ కావ్య లాగా ఈ బిడ్డ నా పాప కాదని మీ ఆవిడ కనుక గుర్తుపట్టుంటే కథ వేరేలా ఉండేది.

మినిస్టర్‌: ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ చాలు... మళ్లీ కొత్త టెన్షన్ వద్దు

రుద్రాణి: డీఎన్ఏ టెస్ట్ కారణంగా కావ్యకు తన దగ్గర ఉన్న బిడ్డ.. తన కన్నకూతురు కాదని తెలిసిపోతుంది. మీ హాస్పిటల్‌లోనే ఏదో తప్పు జరిగిందని తెలుస్తుంది. నిజం తెలిస్తే మీ భార్య తట్టుకోగలదా? తనకు పుట్టిన పాప త్వరలోనే చనిపోతుందని తెలిస్తే తను తట్టుకోగలదా?

మినిష్టర్‌: నేను ఇదంతా చేసింది నా భార్య కోసమే.. తన కోసం ఏమైనా చేస్తాను

రుద్రాణి: మీ భార్య మీకు దక్కాలన్నా.. ఆ కుటుంబం మీద ఉన్న నా పగ తీరాలన్నా మీరు వాళ్లను ఆపాలి.. డీఎన్‌ఏ టెస్ట్‌ జరగకుండా చూడాలి.

అంటూ రుద్రాణి చెప్పి వెళ్లిపోతుంది. మినిస్టర్‌ ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు దుగ్గిరాల ఇంటికి వెళ్లిన డాక్టర్‌ కావ్య దగ్గర బ్లడ్‌ శాంపిల్‌ తీసుకుని వెళ్లిపోతాడు. ఈ టెస్టు తర్వాతైనా నన్ను మీరు నమ్ముతారు అంటూ కావ్య, రాజ్‌కు చెప్తుంది. అపర్ణ, సుభాష్‌ కూడా డీఎన్‌ఏ టెస్టులో ఈ పాప మన పాపేనని పాజిటివ్ రిపోర్ట్‌ రావాలని కోరుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget