Brahmamudi Serial Today February 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కళ్యాణ్ చీటర్ అని తిట్టిన అనామిక – అనామికపై రాజ్ ఫైర్
Brahmamudi Today Episode: ఆఫీసులో కళ్యాణ్ కవితలు రాస్తుండటం చూసిన అనామిక కోపంగా కళ్యాణ్ ను తిట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కావ్య వేసిన డిజైన్స్ బాగాలేవని వెటకారంగా తిడతాడు రాజ్. మా బావ వచ్చినప్పటి నుంచి మీకు ఎక్కడో మండిపోతుంది అందుకే నేను ఎక్కడ దొరుకుతానోనని ఎదురుచూస్తున్నారు. అంటూ కావ్య రాజ్ మీద అరుస్తుంది. ఇలాగైతే ఇప్పుడే నిన్ను జాబ్‌లోంచి తీసేస్తానని రాజ్ బెదిరిస్తాడు. అయితే ఒకసారి మీరు అగ్రిమెంట్ చదివి ఆ మాట అనండి అనగానే రాజ్ అయ్యో మా డాడీ అంటాడు. త్వరలోనే నేనే ఆఫీసులోంచి వెళ్లిపోతాను అని కావ్య అనగానే ఆ పని చేయ్ దరిద్రం పోతుంది అనగానే మీరు చెబితే ఎలా వెళ్తాను మా బావను అడుగుతాను. మా బావ ఓకే అంటే వెళ్లిపోతాను అనగానే ఇప్పుడు బావ గురించి ఎందుకు అంటూ రాజ్ ఇరిటేటింగ్ ఫీలవుతాడు. మరోవైపు సుభాష్, ప్రకాష్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రాజ్, కావ్యల ప్రపోజ్ వీడియో చూస్తారు. ఆ వీడియోలో వాళ్ల అమ్మా నాన్న ఉండటం చూసి షాక్ అవుతారు. ముసలొల్లు కూడా ప్రపోజ్ చేసుకున్నారు. ఈ వీడియో మీ వదిని చూసిందంటే బాగోదని ప్రకాష్‌కు చెప్పి సుభాష్ కూడా అపర్ణకు ప్రపోజ్ చేయడానికి లోపలికి వెళ్లి అపర్ణకు ప్రపోజ్ చేస్తాడు. ప్రకాష్ కూడా ధాన్యలక్ష్మీకి ప్రపోజ్ చేస్తాడు. ఇదంతా గమనిస్తున్న రుద్రాణి నాకు ప్రపోజ్ చేయడానికి ఎవ్వడూ లేడు అని మనసులో అనుకుంటుంది.
రుద్రాణి: మా మతిమరుపు అన్నయ్యా లోపలికి పిలిచి ప్రపోజ్ చేశాడా? లేదంటే ఎందుకు పిలిచాడో మర్చిపోయాడా?
ధాన్యలక్ష్మీ: నాకు కనీసం ఏం చెప్పాలో మర్చిపోయే మొగుడైనా ఉన్నాడు. నీకసలు మొగుడే లేడు కదా?
రుద్రాణి: చీచీ పేడతట్టని తెలిసి రాయి వేశాను. ఎంత మాట అనేసింది.
రాజ్ ఆఫీసులో డిజైన్స్ చూస్తుంటాడు.
రాజ్: ఎన్ని డిజైన్స్ చూసినా కళావతి వేసిన డిజైన్స్ బాగున్నాయి. ఇగోకు పోయి నా కంపెనీకి నేనే అన్యాయం చేస్తున్నానా?
ఇంతలో కావ్య వస్తుంది.
రాజ్: ఇదిగో డిజైన్స్ అంటే ఇలా ఉండాలి. నీ డిజైన్స్ చూస్తే నా కంపెనీ గురించి తప్పుగా అనుకుంటారు. నీలాంటి పనికిరాని వాల్లను పెట్టుకున్నందుకు పనికిరాని మాటలన్నీ పడాల్సిందే కదా?
శృతి: మేడం చెప్పారా? సార్‌కు
కావ్య: సార్ చెప్పనిస్తేనే కదా?
రాజ్: ఏంటి మీరు చెప్పేది.. నేను వినేది.
శృతి: క్లయింట్స్ వచ్చారు సార్ మీతో మాట్లాడతారట.
అనగానే వాళ్లను లోపలికి రమ్మని చెప్పు అని శృతికి చెప్తాడు రాజ్. లోపలికి వచ్చిన క్లయింట్ కావ్య వేసిన డిజైన్స్ చాలా బాగా నచ్చాయని అవే మేకింగ్‌కు పంపించమని చెప్తాడు. దీంతో రాజ్ షాక్ అవుతాడు. మరోవైపు రాహుల్ రూంలో కూర్చుని మ్యూజిక్ వింటుంటాడు. స్వప్న వచ్చి ఇవాళ వాలెంటెన్స్ డే సంవత్సరం క్రితం హోటల్ లో గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేశావు. అంటే రాహుల్ కోప్పడతాడు. నీవు లవ్ చేస్తున్నానని నటించావు. కానీ నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను. అంటూ గిఫ్ట్ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు కళ్యాణ్ స్టాఫ్ అందరినీ పిలిచి కవితలు రాస్తుంటాడు. ఇంతలో అనామిక లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీసుకు వస్తుంది. కళ్యాణ్ ఆఫీసు పని చూసుకోకుండా కవితలు రాస్తుండటాన్ని చూసి షాక్ అవుతుంది.
అనామిక: ఇంట్లో నాకు అబద్దం చెప్పి ఇక్కడ నువ్వు చేస్తున్న పని ఇదా? ఇంత మోసమా? కట్టుకున్న భార్యని ఇంత దారుణంగా మోసం చేస్తున్నావా?
కళ్యాణ్: ఇక్కడ అందరూ ఉన్నారు మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామా?
అనామిక: నన్ను ఇంత చీట్ చేస్తావా? ఇంక నిన్ను ఎలా అర్థం చేసుకోమంటావు. ఈ గాలిలో కలిసిపోయే రాతలతో నా తలరాత మారుతుందనుకున్నాను.
అంటూ అనామిక కళ్యాణ్‌ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే రాజ్ కోపంగా అనామికను తిడతాడు. దీంతో అనామిక కోపంగా ఇంటికి వెళ్లిపోతుంది. తర్వాత ఇంట్లో అనామిక కోపంగా అటూ ఇటూ తిరుగుతుంటే..
ధాన్యలక్ష్మీ: అనామిక ఎంటి అలా ఉన్నావు.
అనామిక: ఎలా ఉన్నాను అత్తయ్యా
ధాన్యలక్ష్మీ: ఎవరైనా ఏమైనా అన్నారా?
అనామిక: చెప్తాను. అన్నీ చెప్తాను. అందరికీ చెప్తాను. అందరినీ బయటకు రమ్మని చెప్పాను. అందరి ముందే చెప్తాను.
అనగానే అందరూ హాల్ లోకి వస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.