అన్వేషించండి

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అప్పును పెళ్లి చేసుకున్న కళ్యాణ్‌ - షాక్‌లో రుద్రాణి, ధాన్యలక్ష్మీ

Brahmamudi Today Episode: అప్పు సేవ్ చేసి తీసుకొచ్చిన కళ్యాణ్ చేత అప్పుకు రాజ్ తాళి కట్టించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కనకం, కృష్ణమూర్తిలను తిడుతున్న రుద్రాణిపై ఇందిరాదేవి ఫైర్‌ అవుతుంది. నువ్వు నీ కొడుకు క్యారెక్టర్‌ ఏంటో అందరికీ తెలుసని తిడుతుంది. భర్తను వదిలేసిన నిన్ను ఇలాంటి శుభకార్యాలకు పిలవకూడదు. పొద్దునే లేచి నీలాంటి నీచమైన ముఖం చూస్తేనే అరిష్టం అని ఇందిరాదేవి కోప్పడుతుంది. మీ ఇద్దరూ కలిసి ఈ పెళ్లి చెడగొట్టారు అంటుంది. అపర్ణ కూడా రుద్రాణి, ధాన్యలక్ష్మీని తిడుతుంది. మరోవైపు అప్పు పెళ్లి ఆగిపోయిందని అనామికకు ఎవరో ఫోన్‌ చేసి చెప్తారు.

అనామిక: నీ పెళ్లి ఆగిపోయిందట.. పెళ్లి పెట్టుకుని ఇలా లేచిపోవడం సూపర్‌ సీన్‌

అప్పు: నా పెళ్లి సంగతి సరే నా నుంచి నిన్నెవరు కాపాడుతారు.

అనామిక: అసలు ఇక్కడి నుంచి నిన్ను ఎవరు కాపాడుతారు?

 అని అనామిక అంటుంది. అప్పుడే డోర్ తెరుచుకుంటంది. కల్యాణ్ హీరోలా ఎంట్రీ ఇస్తాడు. కల్యాణ్‌ను చూసి అనామిక షాక్‌ అవుతుంది. కళ్యాణ్‌ రౌడీలను కొట్టి అప్పును తీసుకెళ్తుంటే అనామిక వార్నింగ్ ఇస్తుంది. అప్పుకు ప్రమాదం ఎటు నుంచి అయినా వస్తుంది. ఎలా కాపాడుకుంటావో చూస్తానని  హెచ్చరిస్తుంది. మరోవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మీతో నేను ఇంటికి వెళ్తాను అంటుంది.

ధాన్యలక్ష్మీ: నాకు తోడు ఉండకుండా వెళ్లిపోతావా రుద్రాణి..?  

రుద్రాణి: నీకు వీళ్లందరూ తోడు ఉన్నారు. అయినా నువ్వు ఇక్కడ ఉండి ఏం లాభంలేదు. ఈపాటికి నీ కొడుకుకి అప్పుకు పెళ్లి అయిపోయి ఉంటుంది. ఇంటికెళ్లి దిష్టి తీసి హారతి ఇవ్వాలికదా! అవన్ని రెడీ చేసుకో

  అని రుద్రాణి చెప్తుండగానే కళ్యాణ్‌, అప్పును తీసుకుని ఎంట్రీ ఇస్తాడు. అందరూ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్ అత్త. అప్పు గురించి ఏం తెలుసు నీకు. పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. లేదా నోరు మూసుకుని ఉండాలి అని కల్యాణ్ ఫైర్ అవుతాడు. ఏంటీ మా అమ్మని అంటున్నావ్. ఇక్కడ మాయమైన అప్పు నీతో ఎలా వచ్చింది అని రాహుల్ ప్రశ్నిస్తాడు. ధాన్యలక్ష్మీ కూడా అప్పు నీతో ఎలా వచ్చిందని అడుగుతుంది. అసలేం జరిగింది కళ్యాణ్‌ చెప్పరా అంటూ రాజ్‌ అడుగుతాడు.  

కళ్యాణ్‌: అప్పును కిడ్నాప్ చేశారు. మత్తుమందు ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు.

కావ్య: కిడ్నాపా? ఎవరు చేశారు.?

కళ్యాణ్‌: ఇంకెవరు ఈవిడ ముద్దుల కోడలు అనామిక.

రుద్రాణి: అనామిక లేదు ఆవకాయ లేదు. జైలుకు వెళ్లిన అనామిక వచ్చి కిడ్నాప్ చేసిందంటే నమ్మాలా?

 అని రుద్రాణి మాట్లాడుతుండగానే బంటి వచ్చి జరిగింది మొత్తం చెబుతాడు. ఈ పెళ్లి ఆగిపోవడానికి మా అమ్మా ఈ రుద్రాణి అత్తయ్యే కారణం అయ్యుంటారు అంటాడు కళ్యాణ్‌.

కళ్యాణ్‌: ఆంటీ ఇదిగోండి మీ కూతురు ఎలా వెళ్లిందో అలాగే వచ్చింది. లేచిపోలేదు.

కనకం: ఏవమ్మా ధాన్యలక్ష్మీ ఇప్పుడేం మాట్లడవు. రుద్రాణితో కలిసి నా కూతుళ్ల గురించి అన్నన్ని మాటలు అన్నావ్. పోయిన పెళ్లి కొడుకును తీసుకురాగలవా. మీరు దుగ్గిరాల కుటుంబం కాకుంటే ఏం చేసేదాన్నో నాకె తెలియదు. ఆడపుటుక పుట్టారు ఎందుకు?

కృష్ణమూర్తి: పెళ్లి ఆగిపోని. పెళ్లి కొడుకు వెళ్లిపోని. నా కూతురు క్షేమంగా వచ్చింది అది చాలు. దీనికి పెళ్లి జరగపోయినా పర్వాలేదు. నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను.

అనగానే అమ్మమ్మ గారు ఇప్పటిదాకా వాళ్లు ఇన్ని మాటలు అన్నారు. వాళ్లను ఏం చేయమంటారో చెప్పండి అని స్వప్న అంటుంది. ఏం లేదు. వాళ్లు చేసిన పనికి సిగ్గుపడుతున్నారు అని కావ్య అంటుంది. వీళ్లు చేసిన పనికి అప్పు పెళ్లి ఆగిపోయింది. ఇంత జరిగికా అప్పును ఎవరు పెళ్లి చేసుకుంటారు. వీళ్లు చేసిన దానివల్ల ఎవరు ముందుకొస్తారు. అప్పు జీవితాంతం ఇలా ఉండిపోవాల్సిందేనా అని కనకం బాధ పడుతుంది. ఇంతలో రాజ్‌ తాళిబొట్టు తీసుకొచ్చి అప్పును నా తమ్ముడు మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఎవరి మూలంగా అప్పుపై నిందలు పడ్డాయో వాడే తాళి కడతాడు. అనగానే అందరూ షాక్‌ అవుతారు. తాళి తీసుకుని అప్పు మెడలో కళ్యాణ్‌ కట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Australia vs India 1st Test : టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Australia vs India 1st Test : టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget