అన్వేషించండి

Brahmamudi Serial Today April 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : బిడ్డ గురించి ఆరా తీసిన మీడియా – ఆ బిడ్డ దుగ్గిరాల వారసుడేనని ఒప్పుకున్న అపర్ణ, కావ్య

Brahmamudi Today Episode: మీడియా ముందు రాజ్ తీసుకొచ్చిన బిడ్డ దుగ్గిరాల కుటుంబం వారసుడేనని అపర్ణ, కావ్య ఒప్పుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Brahmamudi Serial Today Episode:

నాకూతురికి సవతి వచ్చినా సరే అక్కడే ఉంటుంది. ఆస్థి లేదని భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చి నువ్వు పడుతున్న అగచాట్లు చూశాకా కూడా నా కూతురును పుట్టింటికి ఎలా తీసుకెళ్లగలను రుద్రాణి అంటూ కనకం చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో అనామిక, స్వప్న వచ్చి రుద్రాణిని తిట్టి వెళ్లిపోతారు. మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణ్‌ జరిపిస్తుంటారు. రామాయణం గురించి పంతులు చాలా గొప్పగా చెప్తుంటాడు. అందరూ శ్రద్దగా వింటుంటారు. అప్పు వచ్చి కళ్యాణ్‌ను పక్కకు తీసుకెళ్తుంది.

కళ్యాణ్‌: ఎంటి బ్రో ఏమైంది..?

అప్పు: ఏదో జరుగుతుంది. మీ ఫ్యామిలీలోనే ఎవరో మీడియా వాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ పరువు తీయాలని చూస్తున్నారు.

కళ్యాణ్‌: ఎంటి అప్పు నువ్వు మాట్లాడేది..?  

అప్పు: మీడియా వాళ్లు వాళ్లంతట వాళ్లు రాలేదు. ఇదంతా ఏదో ప్లాన్‌ లా ఉంది. బహుశా.. బావ తీసుకొచ్చిన బాబు గురించి బయట పెట్టడానికే ఇదంతా ప్లాన్‌ చేస్తున్నట్టున్నారు.

కళ్యాణ్‌: అవును. అసలే బాబు వచ్చిన్నప్పటి నుంచి ఇంట్లో అన్నయ్యతో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీడియా వాళ్లు కూడా ఇంటి పరువు తీసినట్టు మాట్లాడితే.. మా పెద్దమ్మ అన్నయ్యని అసలు క్షమించదు. ఇప్పుడు ఏం చేద్దాం. ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి.

అప్పు: ఆగరా బై అందరూ పూజలో ఉన్నారు. ఎవరికీ ఏదీ చెప్పేటట్టు లేదు మనమే ఏదో ఒకటి చేసి ఆపాలి.

అంటూ కళ్యాణ్‌ చేతి పట్టుకుని ఆపి చెప్పగానే దూరం నుంచి చూసిన అనామిక కోపంగా వచ్చి అప్పును తిడుతుంది. ఏం బతుకులే మీవి అంటూ ఘోరంగా తిడుతుంది. దీంతో కళ్యాణ్‌ అడ్డుపడితే కళ్యాణ్‌ను కూడా అనామిక తిడుతుంది. దీంతో కళ్యాణ్‌, అనామికను కొడతాడు. దీంతో నీసంగతి చూస్తానని చాలెంజ్‌ చేసి  అనామిక వెళ్లిపోతుంది. కళ్యాణ్‌, అప్పు కలిసి మీడియా రిపోర్టర్‌ దగ్గరకు వెళ్లి మాట్లాడతారు. ఒక పరువు గల ఫ్యామిలీ పరవు తీయడం కరెక్టు కాదని కళ్యాణ్‌ అడగ్గానే.. ఇంత వరకు మాకున్న ఇన్మఫర్మేషన్‌ నిజమా? కాదా అని డౌట్‌ ఉండేది. ఇప్పుడు అది నిజమనిపిస్తుంది. మా డ్యూటీ మేము చేస్తామని చెప్పి రిపోర్టర్‌ వెళ్లిపోతుంది. ఇంతలో కళ్యాణ్‌ లొపలికి వెళ్లి రాజ్‌ను మనం త్వరగా వెళ్లాలి అని చెప్తుండగానే రిపోర్టర్లు లోపలికి వస్తారు. రాజ్‌ను ప్రశ్నింస్తుంటారు. ఇంతలో కళ్యాణ్‌ కోపంగా అరుస్తాడు.

కళ్యాణ్‌: స్టాపిట్‌.. ఇవన్నీ మీకు ఎవరు చెప్తున్నారు. ఇలాంటి పుకార్లను ఎవ్వరూ నమ్మోద్దు. మా కుటుంబంలో తప్పులు జరిగే అవకాశమే లేదు. ఒకవేశ మా అన్నయ్య వేరే అమ్మాయితో బిడ్డను కంటే.. ఇప్పుడు మా కుటుంబంలో ఒకడిగా ఎందుకుంటాడు. ఆయన భార్యగా కళ్యాణ్‌ అన్నతో కలిసి ఎందుకు పూజలో కూర్చుంటుంది.  

రిపోర్టర్‌: ఆ బిడ్డన తీసుకురావడం వల్లనే రాజ్‌ గారిని ఎండీ స్థానం నుంచి తీసేశారని మా దగ్గర ఇన్ఫర్మేషన్‌ ఉంది. ఆ స్థానంలో మీరున్నారని.. ప్రస్తుతం ఆఫీసు వ్యవహారాలు మీరు చూస్తున్నారని తెలిసింది.

కళ్యాణ్‌: మీకు ఎవరో రాంగ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు. నేను అన్నయ్య స్థానంలో లేను ఆయన స్థానం ఎప్పుడూ ఆ స్థాయిలో ఉంటుంది. మేమంతా ఆయన కింద పనిచేసేవాళ్లమే..

అని కళ్యాణ్‌ చెప్పగానే రిపోర్టర్స్‌ మీ కుటుంబంలో ఏదో సంక్షోభం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్‌ ఉంది. అందుకే అడుగుతున్నాం అంటారు. దీంతో కావ్య ఆధారం లేని ఆరోపణలు చేయడం కరెక్టు కాదని చెప్తుంది. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక గొప్ప కుటుంబం మీద మచ్చ వేయకండి. మమ్మల్ని బతకనీయండి అనగానే రిపోర్టర్‌ మరి ఈ బిడ్డ ఎవరు అని అడుగుతుంది. దీంతో కావ్య నాకు మా ఆయనకు పుట్టిన బిడ్డ అని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. రిపోర్టర్స్‌ అపర్ణను కూడా నిజం చెప్పమని అడుగుతారు. దీంతో అపర్ణ కూడా ఆ బిడ్డ నా మనవడు అని మా ఇంటి వారసుడు అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ ఇయిపోతుంది.

ALSO READ: సీనియర్ నటి రాధ కోసం స్పెషల్ బిర్యానీ చేసిన ఆలీ భార్య - చూస్తే నోరూరుతుంది

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
Meghasandesam Serial Today October 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
Godavari Serial Today October 17th: 'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget