అన్వేషించండి

Brahmamudi September 23rd: కృష్ణమూర్తి ఆవేదన - టెన్షన్లో కావ్య - విగ్రహాల నిమజ్జనాన్ని రాజ్ ఆపగలుగుతాడా!

కావ్య కాంట్రాక్ట్ పూర్తి కాకుండా చేయాలని రుద్రాణి ప్లాన్ వేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే...

Brahmamudi September 23rd: రాహుల్ చెప్పినట్టుగానే రౌడీలు కావ్య తయారు చేసిన వినాయకుడి విగ్రహాలు దొంగిలించేస్తారు. కృష్ణమూర్తిని రక్తం వచ్చేలా కొట్టి పడేసి వాటిని లారీల్లో తరలిస్తారు. బంటి వచ్చి కావ్య వాళ్ళకు విగ్రహాలని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసరికి అందరూ కృష్ణమూర్తి దగ్గరకి వెళతారు. ఒంటి నిండా రక్తపు గాయాలతో పడి ఉన్న తండ్రిని చూసి కావ్య గుండె పగిలిపోతుంది. కాంట్రాక్ట్ ఇచ్చిన శ్రీనివాసరావు విగ్రహాల కోసం వచ్చి చూసి విషయం తెలుసుకుని షాక్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ఏముందంటే..

అటు రాజ్.. ఇటు అప్పు తన ఫ్రెండ్స్ తో కలిసి విగ్రహాలు తరలించిన డీసీఎం వ్యాన్ కోసం రోడ్డు మీద తిరిగుతూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. రౌడీలు రాహుల్ కి ఫోన్ చేసి చెప్పినట్టుగానే విగ్రహాలు ఎత్తుకొచ్చేశామని చెప్తారు. డబ్బులకి కక్కుర్తి పడకుండా వెంటనే వాటిని ఎవరూ లేనిచోట చూసి నిమజ్జనం చేసేయమని రాహుల్ పురమాయిస్తాడు. రాజ్ వ్యాన్ నెంబర్ పట్టుకుని వెతుకుతూ ఉంటాడు. కాంట్రాక్టర్ శ్రీనివాస్ సమయం మించిపోతుందని భయపడుతూ ఉంటాడు. విగ్రహాలు తీసుకెళ్లిన వాళ్ళు వాటిని అమ్మేసుకుని ఉంటారని ఇప్పుడు కష్టమర్లకి ఏం సమాధానం చెప్పాలని కావ్యని నిలదీస్తాడు. వెతికేందుకు మా ఆయన కూడా వెళ్లారు కదా వాటిని తీసుకొస్తారని కావ్య చెప్పినా కూడ శ్రీనివాసరావు వినిపించుకోడు. దొంగలు వాటిని ఎప్పుడో అమ్మేసి ఉంటారని వాళ్ళని మరింత భయపెడతాడు.

Also Read: ముకుంద ప్లాన్ సక్సెస్- మరి కృష్ణ ఇచ్చే రివర్స్ గిఫ్ట్ ఎలా ఉండబోతోంది!

నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

విగ్రహాలు అన్నీ చేయడం పూర్తయ్యిందని అవి అమ్మితే డబ్బులు వస్తాయని ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కృష్ణమూర్తి, బంటి విగ్రహాల దగ్గర ఉంటే కావ్య, రాజ్ ఇంటి దగ్గర ఉండిపోతారు. చాలా రోజుల తర్వాత కలిశాం కదా క్యాంప్ ఫైర్ వేసుకుందామని అప్పు అంటుంది. అందరూ పాటలు పెట్టుకుని సరదాగా డాన్స్ వేస్తూ సంతోషంగా గడుపుతూ ఉంటారు.

అన్నపూర్ణ: కావ్య నీ భర్త దేవుడు. తన వల్ల మనకి ఈ కాంట్రాక్ట్ వచ్చింది. తనే లేకపోతే మన పరిస్థితి ఏంటని రాజ్ ని మెచ్చుకుంటుంది. కనకం కూడా రాజ్ మంచితనం గురించి పొగుడుతుంది. ఆ మాటలన్నీ రాజ్ గదిలో ఉండి వింటూనే ఉంటాడు. ఇక అందరూ డాన్స్ చేస్తూ సరదాగా ఉంటే రాజ్ వచ్చేసరికి ఆపుతారు. అప్పు మాత్రం మీరు కూడా డాన్స్ చేయండి బావ అని తనని లాగేస్తుంది. కావ్యతో కలిసి రాజ్ డాన్స్ చేస్తూ ఉంటే కనకం చూసి మురిసిపోతుంది. సరిగా అదే టైమ్ లో విగ్రహాల దగ్గరకి రౌడీలు వచ్చి కృష్ణమూర్తిని కొట్టి వాటిని ఎత్తుకెళ్ళిపోతారు. తీసుకెళ్లవద్దని కాళ్ళ మీద పడినా కూడా కనికరించకుండా రక్తం వచ్చేలా కొట్టేసి విగ్రహాలు తీసుకెళ్లిపోతారు. బంటి పరుగులు పెడుతూ ఇంటికి వచ్చి విషయం చెప్పేసరికి రాజ్ వాళ్ళు అందరూ అక్కడికి వెళతారు.

Also Read: కొనసాగుతున్న టామ్ అండ్ జెర్రీ వార్, శైలేంద్రకి జగతి రివర్స్ పంచ్!

కృష్ణమూర్తి: విగ్రహాలు ఎత్తుకెళ్లవద్దని ఎంత బతిమలాడినా వినిపించుకోలేదు. కష్టపడి చేసినది మొత్తం పోయిందని ఏడుస్తాడు. అందరూ ఇంటి అప్పు తీర్చడం కోసం ఈ కాంట్రాక్ట్ ఒప్పుకున్నా అనుకుంటున్నారు. కానీ నిజం అది కాదు నా చిన్న కూతురు అప్పు పెళ్లి చేయడం కోసం కనీసం సొంత ఇల్లు అన్నా ఉండాలి కదా అనే ఉద్దేశంతో కష్టపడ్డాను. రాజభోగం అనుభవించాల్సిన నా పెద్ద కూతురు తండ్రి కష్టం చూసేందుకు మట్టి తొక్కి పనులు చేసింది. నా కూతుర్లకి నా భార్య కోరుకున్నట్టు మంచి జీవితం ఇవ్వలేకపోయాను. కనీసం నా చిన్న కూతురికి అయినా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆశ పడ్డాను. ఒక తండ్రిగా, భర్తగా ఒడిపోయాను కనకం అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు.

రాజ్ వాళ్ళకి ధైర్యం చెప్తాడు. దొంగతనం జరిగిందని తెలియగానే మనం వస్తున్నప్పుడు రెండు డీసీఎం వ్యాన్ లు ఎదురుపడ్డాయి. విగ్రహాలు వాటిలోనే తీసుకెళ్ళి ఉంటారని అనుమానపడతాడు. వ్యాన్ నెంబర్ గుర్తు చేసుకుని చెప్తాడు. ఎలాగైనా సహాయం చేయమని కావ్య భర్తని అడుగుతుంది. దీంతో రాజ్ రంగంలోకి దిగుతాడు. ఏం భయపడొద్దు ఎలాగైనా వాటిని వెతికి తీసుకొస్తానని ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు. వ్యాన్ నెంబర్ ఆధారంగా వాటిని వెతికేందుకు వెళతాడు...

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget