News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Brahmamudi July 25th: 'బ్రహ్మముడి' సీరియల్ : కావ్యని పాతాళానికి తొక్కేసిన రాజ్ - స్వప్నని ఇంట్లో నుంచి గెంటేస్తారా?

స్వప్న బోల్డ్ యాడ్ షూట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

కావ్య పుట్టింటికి వచ్చినందుకు అందరూ సంతోషిస్తారు. అందరు కలిసి భోజనం చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఇక స్వప్న యాడ్ షూట్ జరుగుతుంది. డైరెక్టర్ స్వప్నని తెగ పొగిడేస్తాడు. ఇక స్వప్న అన్న మాటలు గురించి తెలిసి ఇంట్లో అందరూ సీరియస్ గా ఉంటారు. అప్పుడే ఆటో నుంచి కావ్య, కారులో స్వప్న ఇంటికి వస్తారు. స్వప్న పొట్టి డ్రెస్ చూసి అందరూ నోరెళ్ళబెడతారు. ఈ డ్రెస్ ఏంటి? ఇది వేసుకుని ఇంట్లోకి వస్తే ఎంత గొడవ అవుతుందోనని కావ్య కంగారుపడుతుంది. ఇది వేసుకుని ఇంట్లో నుంచి వెళ్లానని స్వప్న పొగరుగా సమాధానం చెప్పేసి ఇంట్లోకి వెళ్తుంది.

అపర్ణ: ఆగు.. ఏంటి ఈ వేషం

స్వప్న: వేషం కాదు ఫ్యాషన్. రిచ్ పీపుల్ ఇలాగే తిరుగుతారు

రుద్రాణి: రిచ్ నెస్ అంటే ఒళ్ళంతా కనిపించేలా బట్టలు వేసుకోకుండా ఉంటే కనిపించదు. ఒళ్ళంతా బట్టలు వేసుకుంటే కనిపిస్తుంది

ఇంద్రాదేవి: ఏంటమ్మా ఇది ఇలా బయటకి వెళ్ళావా? దుగ్గిరాల ఇంటి కోడలు అంటే సంప్రదాయ దుస్తుల్లో కనిపించాలి కానీ ఇలా కనిపిస్తే ఎలా

Also Read: షాకింగ్ ట్విస్ట్, రొమాన్స్ లో మునిగిపోయిన యష్, వేద- వసంత్ జీవితంలోకి మరో అమ్మాయి?

స్వప్న: ఈ కాలంలో ఇది ఫ్యాషన్ అమ్మమ్మా? ఇంట్లోనే ఉండే మీకు ఎలా తెలుస్తుంది

కావ్య: ఎక్కువ మాట్లాడకుండా నీ రూమ్ కి వెళ్ళు

స్వప్న: మధ్యలో నీకేంటి బాధ. సపోర్ట్ దొరికే సరికి నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నావా?

రాజ్: రాహుల్.. నీ భార్యకి డీసెన్సీ నేర్పించు. ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో అర్థం అయ్యేలా చెప్పు

స్వప్న: బయట అందరూ నా డ్రెస్ చూసి ఎంత పొగిడారో తెలుసా?

అపర్ణ: చాలు ఆపు.. నా తోడి కోడల్ని అంటావా?

ప్రకాశం; నా భార్యని అనాలంటే నేను అనాలి. నువ్వు ఎవరు అనడానికి

స్వప్న: నేను అదే అన్నాను. నన్ను ఏమైనా అనాలంటే నా భర్త అనాలి మీరు కాదు 

కావ్య: చిన్నత్తయ్యని అనేదానివి అయ్యావా? ఎటువంటి పరిస్థితిలో ఈ ఇంటి కోడలివి అయ్యావో మర్చిపోయావా?

స్వప్న: నువ్వేమైన సవ్యంగా పెళ్లి చేసుకుని వచ్చావా? ముసుగు వేసుకునే కదా పెళ్లి చేసుకుని వచ్చింది

ధాన్యలక్ష్మి: నువ్వు నన్ను ఎన్ని అన్నా ఊరుకుంటాను కావ్యని అంటే ఊరుకొను. నువ్వు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోబట్టే కావ్యకి ఆ పరిస్థితి వచ్చింది

రుద్రాణి: షబాష్.. అటు తిప్పి ఇటు తిప్పి నా కొడుకు మీదకి తప్పు తోస్తుంది. వాడు రమ్మన్నాడు గడ్డి తినమంటే తింటావా? నీ హద్దుల్లో నువ్వు ఉంటే వాడు ఎందుకు నీ జోలికి వచ్చేవాడు. జరిగిపోయింది అనవసరం. మా ఇంటి పరువు తీయాలని చూస్తున్నావా? ఈ కుటుంబంలో మర్యాద గల వాళ్ళని అవమానిస్తావా? ఈ పగటి వేషం వేసుకుని అసలు ఎక్కడికి వెళ్లావ్

స్వప్న:  ఫ్రెండ్స్ మ్యారేజ్ పార్టీకి రమ్మంటే వెళ్ళాను

ఇంద్రాదేవి: నీ కోడలు ఒట్టి మనిషి కూడా కాదు. ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా

రుద్రాణి: నాకేం అవసరం ఇష్టం లేకపోయినా తెచ్చి ఈ దరిద్రాన్ని అంట గట్టారు. ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి పంపించేయండి అంతే కానీ నన్ను అనొద్దు. అడ్డమైన వాళ్ళని కోడలిగా తీసుకొస్తే ఇలాగే అవుతుంది

కావ్య: రుద్రాణి గారు తను ఏదో తెలిసో తెలియకో చేసింది. మీరు ఇలా అనడం కరెక్టా

రుద్రాణి: నేను ముసుగు మాత్రమే వేశాను. నువ్వు నాటకం నడిపించావ్.. డబ్బున్న ఇంటికి కోడలు కావాలని ఆశ లేకపోతే నేను పరువు కోసం చేసిన పని తప్పు అని అప్పుడే ఎందుకు చెప్పలేదు

Also Read: పైకి ఈగో, లోపల మాత్రం చెప్పలేనంత ప్రేమ- శైలేంద్ర నోరు మూయించేసిన జగతి

రాజ్: చెప్పింది కదత్త.. తాళి కట్టక ముందే నువ్వు వేసిన ముసుగు తీసి పారేసింది కదా. పెళ్లి కూతుర్ని నీ కొడుకు లేపుకుపోతే తప్పని పరిస్థితిలో పెళ్లి పీటల మీద కూర్చున్నా అని చెప్పింది కదా. ఇంటి పరువు నిలబెట్టడం కోసం నేను, తల్లి దండ్రుల పరువు నిలబెట్టడం కోసం తను తప్పనిసరి పరిస్థితుల్లో.. ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరు.. నువ్వు నీ కొడుకు చేసిన ఘనకార్యం వల్లే కదా. అసలు నువ్వు రియాక్ట్ కావలసింది నీ కోడలు చేసిన దానికి. నీ కోడలు చేసిన తప్పుకి వాళ్ళ కుటుంబాన్ని పట్టుకుని అలగాజనం అంటావ్ ఏంటి?అసలు నీ కోడలు ప్రవర్తనకి కళావతికి సంబంధం ఏమైనా ఉందా? అక్కా చెళ్లెళ్లని పక్కన పెట్టి చూడు దుగ్గిరాల కోడళ్ళు ఎలా ఉండాలో ఉండకూడదో వీళ్లిద్దరే సాక్ష్యం. చేతనైతే నీ కోడల్ని దారిలో పెట్టుకో. అంతే కానీ అవకాశం దొరికింది కదా అని చెల్లెలిని నిందించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్తున్నా ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడేలా కళావతి ఒక్క తప్పు కూడా చేయలేదు. చేసిందని ఇంట్లో ఒక్కరితో అయినా చెప్పించు. రేయ్ రాహుల్ పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టుకోలేని వాడివి నువ్వేం మగాడివి, ఏం మొగుడివి

భర్త అండగా నిలిచినందుకు కావ్య చాలా సంతోషపడుతుంది. దేవుడి దగ్గరకి వెళ్ళి తన సంతోషాన్ని పంచుకుంటుంది. మొన్నటి వరకు నన్ను భార్యగా చూడలేనని అన్న నా భర్త ఇప్పుడు నాకు సపోర్ట్ గా మాట్లాడారు. నా మీద మాట పడకుండా అడ్డుగా నిలుచున్నారు. ఆయన మారతారా? నన్ను భార్యగా అంగీకరిస్తారా? అనే అనుమానం వచ్చింది. కానీ ఆయనలో మార్పు చూశాక నేను ఆయన భార్య అని ఒప్పుకుంటారని నమ్మకం కలిగిందని ఆనందపడుతుంది. అపర్ణ రాజ్ ని పిలిచి మాట్లాడుతుంది. అటుగా వెళ్తున్న కావ్య వాళ్ళ మాటలు వింటుంది.

అపర్ణ: అసలు ఏం జరుగుతుంది మీ మధ్య. కావ్యకి నీకు మధ్య తొలిప్రేమ అంకురించిందా? నాకేం తెలియదని అనుకోకు ఈ మధ్య నీ ప్రవర్తన గమనిస్తూనే ఉన్నా కావ్య మీద ఈగ వాలనివ్వడం లేదు. రుద్రాణిని ఎన్నడూ లేనిది అంత మాట అన్నావ్. కావ్య చేసిన మోసం మర్చిపోయావా? అసలు ఆ కుటుంబం మనకి చేసిన ద్రోహం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. అసలు కావ్య వంట చేయడం, పూజ గదిలోకి రావడం ఇష్టం లేదు. అసలు తనని కోడలిగా ఒప్పుకోవడం ఇష్టం లేదు. కావ్యని కారులో ఎక్కించుకుని తిప్పుతున్నావ్. ఆఫీసుకి తీసుకుని వెళ్తున్నావ్ 

రాజ్: కావ్య మన ఇంట్లో ఉంటుంది కదా అని వెనకేసుకొచ్చాను. మీరు ఎవరూ ఇంట్లో లేనప్పుడు నాకు సీరియస్ అయ్యింది. సాటి మనిషిగా సహాయం చేసింది. నేను కూడా ఏదో ఒక విధంగా సాయపడుతున్నా

అపర్ణ: అదే నిజమైతే ఆ విషయం తనకి అర్థం అయ్యేలా చెప్పు. భార్యగా అంగీకరించావని ఆశపడితే.. ఒకవేళ నీకు కావ్యని భార్యగా ఒప్పుకోవాలని అనిపిస్తే అడ్డుపడను. నేను మాత్రం తనని ఎప్పటికీ కోడలిగా ఒప్పుకోను

రాజ్: తను ఏదైనా అనుకొనివ్వు. నేను ఇవన్నీ చేసేది భార్యగా ఒప్పుకోని కాదు. సాటి మనిషిగా చేస్తున్నా. నా దృష్టిలో ఇప్పటికీ ఎప్పటికీ తను సాటి మనిషే అనేసరికి కావ్య గుండె ముక్కలు అవుతుంది.

Published at : 25 Jul 2023 09:44 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial July 25th Episode

ఇవి కూడా చూడండి

Nindu Noorella Saavasam November 29th Episode: చిత్రగుప్తుడి మాటలకు కంటతడి పెట్టుకున్న అరుంధతి.. మనోహరికి చీవాట్లు పెట్టిన అమరేంద్ర!

Nindu Noorella Saavasam November 29th Episode: చిత్రగుప్తుడి మాటలకు కంటతడి పెట్టుకున్న అరుంధతి.. మనోహరికి చీవాట్లు పెట్టిన అమరేంద్ర!

Naga panchami November 28th Episode : నన్ను కాటేసి చంపేది నువ్వే.. పంచమికి షాక్ ఇచ్చిన మోక్ష!

Naga panchami November 28th Episode : నన్ను కాటేసి చంపేది నువ్వే.. పంచమికి షాక్ ఇచ్చిన మోక్ష!

Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!

Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!

Brahmamudi Promo: కావ్య రాజ్ ముందు అడ్డంగా బుక్కైనా రాహుల్.. రేపటి ఎపిసోడ్​లో రుద్రాణికి చుక్కలే!

Brahmamudi Promo: కావ్య రాజ్ ముందు అడ్డంగా బుక్కైనా రాహుల్.. రేపటి ఎపిసోడ్​లో రుద్రాణికి చుక్కలే!

Guppedantha Manasu Promo: రిషిధార అభిమానులకు పండుగలాంటి ఎపిసోడ్.. రిషి వసు మధ్య సూపర్ సీన్!

Guppedantha Manasu Promo: రిషిధార అభిమానులకు పండుగలాంటి ఎపిసోడ్.. రిషి వసు మధ్య సూపర్ సీన్!

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి