Brahmamudi Serial End: 'బ్రహ్మముడి' సీరియల్ కి శుభం కార్డ్? బిగ్ బాస్ ప్రారంభానికి ముందు రోజు ఆఖరి ఎపిసోడ్!
Brahmamudi Serial Ending Soon: త్వరలో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం అవుతోంది...ఈ వారంతో బ్రహ్మముడి సీరియల్ అయిపోతుందా?

Brahmamudi Serial Last Episode : బ్రహ్మముడి సీరియల్ చుట్టూ చిక్కుకున్న ఒక్కో ముడి వీడిపోతోంది. అనామిక అరాచకానికి చెక్ పడింది అనుకుంటే యామిని ఎంట్రీ ఇచ్చింది. యామిని రావడంతోనే రాజ్ పై పిచ్చితో యాక్సిడెంట్ చేయించడం, గతం మర్చిపోయేవరకూ తీసుకురావడం..నేరుగా తనింటికి తీసుకెళ్లి...నీ గతంలో ఉన్నది తానే అని ఆధారాలు క్రియేట్ చేయడం.. చాలా చాలా విన్యాసాలు చేసింది. కానీ చుట్టూ తిరిగి తనకు తెలియకుండా మళ్లీ తన భార్య కావ్యనే ప్రేమించిన రాజ్.. తన కుటుంబానికి దగ్గరయ్యాడు. అనుకోని పరిస్థితుల్లో కావ్యను అనుమానిస్తుండగా మొత్తం నిజం కక్కేసింది అపర్ణ. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన రామ్ మళ్లీ రాజ్ లా మారిపోయాడు..
అంటే ఇక..
బ్రహ్మముడి సీరియల్ కి శుభం కార్డ్ పడుతుందా?
సీరియల్ కథ కొలిక్కి వచ్చినట్టేనా?
గత కొన్నాళ్లుగా గతం మర్చిపోయిన రాజ్ కి సడెన్ గా అందుకే గతం గుర్తొచ్చేసిందా?
అప్పు కళ్యాణ్ ని ధాన్యలక్ష్మి యాక్సెప్ట్ చేసింది, కళావతికి దగ్గరయ్యాడు రాజ్..
యామినికి చెక్ పెట్టడం, రుద్రాణి నాటకం బయటపడితే ఇక సీరియల్ కి శుభం కార్డేనా?
సాధారణంగా బిగ్ బాస్ ప్రారంభానికి ముందు సీరియల్స్ టైమింగ్స్ లో మార్పులొస్తాయి? లేదంటే కొన్ని సీరియల్స్ కి శుభం కార్డ్ వేసేస్తారు. మధ్యాహ్నం సమయంలో వచ్చే సీరియల్ ని ముగించి..బిగ్ బాస్ టైమ్ లో ప్లే అయ్యే సీరియల్ ని మధ్యాహ్నానికి టైమ్ మార్చుతుంటారు. ే గతంలో బిగ్ బాస్ ప్రారంభానికి ముందు ఊర్వశివో రాక్షసివో సీరియల్ కి ఎండ్ కార్డ్ పడింది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభానికి ముందురోజుతో బ్రహ్మముడి సీరియల్ అయిపోతుందేమో అనే డిస్కషన్ జరుగుతోంది.
దుగ్గిరాల కుటుంబంలో ఆనందం
ఇప్పటికే అవసరం అయినదానికన్నా ఎక్కువ సాగిదీశారనే విమర్శలొచ్చాయి. ఓ దశలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిందనే విమర్శలు వెల్లువెత్తాయ్. ఇంట్లో వ్యాపారాన్ని నడిపే దిగ్గజాలు ఉన్నప్పటికీ అన్నీ కావ్య చక్కబెట్టేస్తూ..సింగిల్ హ్యాండ్ తో సీరియల్ నడిపించింది కావ్యగా నటించిన దీపిక రంగరాజు. ఇన్నాళ్లూ గతం మర్చిపోయిన రాజ్ కి సడెన్ గా గతం గుర్తొచ్చింది. దుగ్గిరాల కుటుంబం అంతా సంతోషంగా ఉంది.
యామికి చెక్
యామిని అరాచకాలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది కావ్య. తమకు యాక్సిడెంట్ చేయించింది యామిని అనే సందేహం రాజ్ కి వచ్చింది..వెళ్లి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అదే టైమ్ లో రుద్రాణి అరాచకాలు కూడా బయటపడే ఛాన్సుంది. ఇక యామినికి చెక్ పెట్టేస్తే సీరియల్ ఓ కొలిక్కి వచ్చినట్టే
రాజ్ సోదరి సంగతేంటి?
ఇప్పటికే రాజ్ సోదరి..అపర్ణ-సుబాష్ ల గారాలపట్టిని కుటుంబం దూరం పెట్టింది. తన కొడుకు ద్వారా మళ్లీ తన పుట్టింటికి దగ్గరవ్వాలనే ఆలోచనలో ఉంది. మరోవైపు కావ్య, రాజ్, ఇందిరాదేవి ముగ్గురూ కలసి దుగ్గిరాల ఇంటి వారసురాలు అయిన రేవతిని తీసుకొచ్చేస్తే శుభం కార్డ్ పడినట్టే
మరి ఈ వారంలో యామిని బండారం, రాజ్ ని చంపేయాలి అనుకున్న రుద్రాణి అరాచకం బయటపెట్టేసి..రేవతిని ఇంటికి తీసుకొచ్చేస్తే సీరియల్ కి శుభం కార్డ్ పడినట్టే. ఇంకా సాగదీయాలి అనుకుంటే మాత్రం మరిన్ని మలుపులు తిప్పి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.






















