Brahmamudi August 22nd: గుండెల్ని పిండేసే ఎమోషనల్ సీన్ - కనికరించని రాజ్, కన్నీళ్ళతో అత్తింటిని వదిలిన కావ్య
తన తల్లిని ఎదిరించి అవమానించేలా మాట్లాడినందుకు రాజ్ కావ్యని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రాజ్ గెంటేయడంతో అర్థరాత్రి వర్షంలో కావ్య దుగ్గిరాల ఇంటి గుమ్మం ముందే నిలబడి ఉంటుంది. ఇంట్లో అందరూ బాధగా కూర్చుని ఉంటే స్వప్న మాత్రం డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఫుడ్ వడ్డించుకుంటుంది. అది చూసిన ధాన్యలక్ష్మి స్వప్నకి చీవాట్లు పెడుతుంది. ఇంట్లో పెద్దవాళ్లే రాజ్ కి ఎదురు చెప్పకుండా మౌనంగా ఉంటే తనని ఎందుకు అరుస్తున్నారని స్వప్న చిన్నత్తకి ఎదురుతిరుగుతుంది. ఇక వదిన కష్టాన్ని చూడలేక కళ్యాణ్ కావ్య దగ్గరకి వెళ్ళి ఇంట్లోకి రమ్మని పిలుస్తాడు. కానీ ఆత్మాభిమానం కలిగిన కావ్య తన భర్త రమ్మంటేనే వస్తానని చెప్తుంది. దీంతో కళ్యాణ్ కనకంకి ఫోన్ చేసి ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్తాడు. కనకం దంపతులు వచ్చి ఇంట్లో అందరినీ నిలదీస్తారు. దానికి కొనసాగింపే ఈ ప్రోమో..
ఈరోజు ప్రోమోలో ఏముందంటే..
కనకం, కృష్ణమూర్తి కావ్యని తమతో పాటు ఇంటికి తీసుకెళ్తారు. కానీ రాజ్ మాత్రం అసలు పట్టించుకోకుండా పట్టువదలకుండా అలాగే ఉంటాడు. 'కలిసినట్టుగా ఉన్నా కలవలేవే నింగినేలా.. కలిసికలలు ఎన్ని కన్నా కనులు ఒకటవవే'.. అంటూ సీన్ చాలా ఎమోషనల్ గా చూపించారు.భర్తకి దూరంగా వెళ్లిపోతున్న కావ్య మొహం చూస్తే ఎవరికైనా బాధకలుగుతుంది. ఇంద్రాదేవి కావ్యని వెనక్కి పిలవమని రాజ్ చెప్పబోతుంటే అపర్ణ అడ్డం పడుతుంది. దీంతో తను సీరియస్ అవుతుంది. కావ్య తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్తుందా? లేదంటే మనసు మార్చుకుని రాజ్ ఇంట్లోకి పిలుస్తాడో తెలియాలంటే ఈరోజు పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: కృష్ణ దగ్గరకి చేరిన మురారీ- అన్నింటికీ తెగించేసిన ముకుంద
సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వర్షంలో నిలబడి ఉన్న కూతుర్ని చూసి కనకం దంపతులు అల్లాడిపోతారు. ఇంటి కోడలిని ఇలాగా బయట నిలబెట్టేదని బాధపడతారు. అటు ఇంద్రాదేవి, సీతారామయ్య అపర్ణ దగ్గరకి వెళ్ళి రాజ్ నచ్చజెప్పమని అడుగుతారు. కానీ అపర్ణ మాత్రం తన కొడుకు తన మాట ఇప్పుడు వినే పరిస్థితిలో లేడని తన చేతిలో ఏమి లేదని చేతులెత్తేస్తుంది. దీంతో ఇంద్రాదేవి వాళ్ళు బాధగా వెనుదిరుగుతారు. రుద్రాణి తన కొడుకుతో కలిసి రాజ్ పరువు తీసేందుకు మరొక ప్లాన్ వేస్తుంది. భార్యని అర్థరాత్రి వర్షంలో ఇంట్లో నుంచి గెంటేశాడని మీడియాకి న్యూస్ ఇచ్చి పరువు తీయాలని డిసైడ్ అవుతుంది. ఇక కనకం కోపంగా ఇంటి తలుపులు నెట్టుకుని కావ్యని తీసుకుని వస్తుంది. ఇంటి కోడలిని ఇంత దారుణంగా చూస్తారా? అంటూ అందరినీ ఏకి పారేస్తుంది.
స్వప్న; అమ్మా తెలియకుండా మాట్లాడొద్దు అది తన అత్తని దారుణంగా అవమానించేలా మాట్లాడింది. అసలు కావ్య ఈ ఇంటికి కోడలు కావడమే ఎక్కువ. అలాంటప్పుడు ఎలా ఉండాలి. ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడొద్దు
కనకం: నోర్ముయ్యవే.. అసలు నువ్వు ఎంత నీ బతుకు ఎంత. నీకు జీవితాన్ని నా కూతురు భిక్షగా పడేసింది. లేదంటే గుడిలో ప్రసాదం అడుక్కుని తింటూ బతకాల్సిన దానివి. నువ్వు కనీసం నా కూతురి కాలి గోటికి కూడా సరిపోవు. నువ్వు మాట్లాడుతున్నావా?
అపర్ణ: అంటే అత్తని ఎదిరించడం మీరు సమర్తిస్తున్నారా?
Also Read: జైలుకి వెళ్ళిన మాళవిక, అభిమన్యు- తల్లి కాబోతున్నట్టు యష్ కి చెప్పిన వేద
కనకం: అత్తని ఎదిరించడం తప్పే కానీ దానికి ఇంత పెద్ద శిక్ష వేస్తారా? పెద్దవాళ్ళు మందలించి తన తప్పుని కడుపులో దాచుకోవాలి
ఇక తమ పెద్దరికం కూడా పనికి రాకుండా పోయిందని సీతారామయ్య వాళ్ళు కూడా తలదించుకుంటారు. కృష్ణమూర్తి రాజ్ దగ్గరకి వెళ్ళి మొదటి తప్పుగా భావించి తన కూతుర్ని క్షమించమని వేడుకుంటాడు. కానీ రాజ్ మాత్రం కనికరం చూపించకుండా తనని ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్తాడు. సందు దొరికింది కదా అని రుద్రాణి కూతుర్ని కూడా పోషించుకోవలేవా అంటూ అవమానిస్తుంది. దీంతో కృష్ణమూర్తి తన కూతురు తనకేమి భారం కాదని చెప్పి అందరికీ దణ్ణం పెట్టేసి కావ్యని తీసుకుని ఇంటి గడప దాటుతారు. ఇంద్రాదేవి పిలిచినా కూడా ఆగకుండా వెళ్లిపోతారు. సీరియల్ మొత్తం ఎమోషనల్ గా సాగింది.
View this post on Instagram