Krishna Mukunda Murari August 22nd: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్: కృష్ణ దగ్గరకి చేరిన మురారీ- అన్నింటికీ తెగించేసిన ముకుంద
అటు కృష్ణ, ఇటు ముకుంద ఇద్దరూ మురారీ మీద ఆశలు పెట్టుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఆదర్శ్ ఆచూకీ తెలిసిందని మురారీ చెప్పేసరికి ముకుంద షాక్ అవుతుంది. తను వస్తున్నాడని చెప్తే మనసు మారుతుందని మనసులో అనుకుని అతి త్వరలో ఆదర్శ్ తిరిగి వస్తున్నాడు. కల్నల్ కాల్ చేసి చెప్పాడని చెప్తాడు.
ముకుంద: అసలు నీకు మనసు లేదా? ప్రాణ స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని భార్యగా ఎలా చూడాలని ఆదర్శ్ వెళ్ళిపోయాడు. ప్రాణ స్నేహితుడి భార్యని ప్రియురాలిగా ఎలా చూడాలని నువ్వు ఫీల్ అవుతున్నావ్. మరి నిన్ను నమ్మిన నా పరిస్థితి ఏంటి? ఇంత సెల్ఫీష్ నా నువ్వు. నీ స్నేహం చాలా గొప్పది అది నేను అర్థం చేసుకున్నా. మన ప్రేమ అంతకంటే గొప్పది అది నువ్వు అర్థం చేసుకో. నేను చావనైనా చస్తాను కానీ నిన్ను తప్ప ఎవరినీ భర్తగా అంగీకరించలేను అది నువ్వు గుర్తు పెట్టుకో
కృష్ణ మురారీ ఆలోచనలతో సతమతమవుతుంది. ఊపిరి ఆడటం లేదని తనకి కాస్త స్పేస్ కావాలని బాధపడుతుంది. సేవ చేసేందుకు వచ్చావు అది గుర్తు పెట్టుకో.. మరి ఎవరి మీద డిపెండ్ కాకూడదు. ఒకవేళ ఏసీపీ సర్ ఎదురుపడినా ఎమోషనల్ అవకు. ఆయనకేనా బెట్టు మనకి కూడ ఉంటుందని అనుకుంటుంది. మురారీ కారులో వెళ్తుంటే రోడ్డు మీద ఒక చోట టేక్ డైవర్షన్ అని ఉంటుంది. దీంతో తన రూటు మార్చి వేరే వైపు వెళతాడు. అదంతా ముకుంద చేసిన ప్లాన్ అని కాసేపటికి అర్థం అవుతుంది. ఒకచోట నిలబడి ఉండగా సరిగ్గా మురారీ కారు అటుగా వచ్చి తనని చూసి ఆగుతుంది. కారు ఆపి ముకుంద దగ్గరకి వస్తాడు.
Also Read: జైలుకి వెళ్ళిన మాళవిక, అభిమన్యు- తల్లి కాబోతున్నట్టు యష్ కి చెప్పిన వేద
ముకుంద: ఆదర్శ్ అంటే నాకు చాలా ఇష్టం గౌరవం. ఎందుకో తెలుసా? ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకోవడం తనకి తెలుసు. మన ప్రేమ విషయం తెలుసుకుని అర్థం చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఆదర్శ్ కూడా మనం ఇద్దరం కలవాలని కోరుకుంటున్నాడు. నేను ఆదర్శ్ ని పెళ్లి చేసుకున్నాక నువ్వు నేను ప్రేమించుకోవడం తప్పు. మన ప్రేమ విషయం ఆదర్శ్ కి తెలియదు. ఇందులో మన తప్పు ఏముంది. అసలు ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఏమవుతుంది. మన ప్రేమ ఎందుకు వదులుకోవాలి
మురారీ: ప్రేమ, బంధం మధ్య నలిగిపోతున్నా. నేను చాలా అలిసిపోయాను. నువ్వు పదే పదే నన్ను కలిసి నా కళ్ళు తెరిపించాలని అనుకోవడం వల్ల నన్ను డిప్రెషన్ లోకి నెట్టేస్తున్నావ్. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు కృష్ణతో నా పెళ్లి నాటకం. నేను ముకుంద ప్రేమించుకున్నామని చెప్తే పెద్దమ్మ తట్టుకోలేదు. ఇంట్లో అందరూ ఏమనుకుంటారు. మనం మారాలి
ముకుంద: ఎందుకోసం, ఎవరి కోసం మారాలి?
మురారీ: మన కోసం మారాలి
ముకుంద: నువ్వు కాదు నేను మన ఫ్యామిలీ గురించి ఆలోచించాను కాబట్టే మన ప్రేమ గురించి అత్తయ్య అడిగినా చెప్పలేదు. మురారీ నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ నాకే దక్కాలి
మురారీ: ప్లీజ్ అర్థం చేసుకో నాకు టైమ్ లేదు నేను వెళ్ళాలి
ముకుంద: ఎప్పటికైనా గుర్తు పెట్టుకో నువ్వు నా వాడివి.. నేను నీ దాన్నే
Also Read: దుగ్గిరాల కుటుంబాన్ని నిలదీసిన కనకం- కావ్యని ఇంట్లోకి రానిచ్చేదే లేదని ఖరాఖండీగా చెప్పిన రాజ్
కృష్ణ క్యాంప్ లో పేషెంట్స్ చెక్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పోలీసాఫీసర్ కి యాక్సిడెంట్ జరిగింది తొందరగా రమ్మని పిలుస్తాడు. అది మురారీ అనుకుని కృష్ణ భయంగా పరుగులు పెడుతుంది. అతన్ని చూడగానే మురారీ కాదని ఊపిరిపీల్చుకుంటుంది. కృష్ణ క్యాంప్ దగ్గర సెక్యూరిటీగా మురారీకి డ్యూటీ పడుతుంది. పక్కనే కృష్ణ టెంట్ ఉంటుంది. అక్కడే మురారీ కూడా ఉంటాడు. కృష్ణ తన భర్తకి ప్రపోజ్ చేసినది, తాళి కట్టించుకున్న సంఘటనలు తలుచుకుంటూనే ఉంటుంది. కృష్ణకి మరీ సరెండర్ అయిపోతున్నావేమో అని మురారీ అనుకుంటాడు. కానీ మళ్ళీ తనకోసం కమిషనర్ ని అడిగి మరీ ఇక్కడికి డ్యూటీ వేయించుకుంది తనకోసమే కదా అనుకుంటాడు.
రేపటి ఎపిసోడ్లో..
కృష్ణకి ఎవరిని చూసినా మురారీలాగా అనిపిస్తాడు. కనిపించిన్ ప్రతి వ్యక్తిని ఏసీపీ సర్ అని పిలుచుకుంటూ ఉంటుంది. అప్పుడు నిజంగానే మురారీ వచ్చి ఎదురుగా నిలబడతాడు. అది కూడా తన భ్రమ అనుకుని కృష్ణ పట్టించుకోకుండ వెళ్తుంటే చెయ్యి అడ్డం పెడతాడు. ఆ తర్వాత నిజంగానే మురారీ వచ్చాడని అర్థం చేసుకుని కృష్ణ సంతోషపడుతుంది.