News
News
వీడియోలు ఆటలు
X

Madhuranagarilo May 25th: ప్రాణాలతో బయటపడిన శ్యామ్.. బిజిలి చేసిన పనికి షాకైన రాధ?

విషపురుగు కరిసిన శ్యామ్ ప్రాణాలను కాపాడడం కోసం రాధ కాపాడడానికి చేసే ప్రయత్నంతో సీరియల్ ఇంట్రెస్ట్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

Madhuranagarilo May 25th: విషం పైకి పాకటంతో శ్యామ్ నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాడు. వెంటనే రాధ సర్ ఏం కాదు ధైర్యంగా ఉండండి అంటూ.. దీనికి ఆకు పసరు మార్గం ఒకటే అని చెప్పి అక్కడి నుంచి ఆకులు తేవడానికి వెళ్తుంది. ఇక శ్యామ్ నొప్పితో బాగా అలమటిస్తూ ఉంటాడు.

మరోవైపు మధుర అమ్మవారి ముందు నిలబడి ఎమోషనల్ అవుతుంది. ప్రతి కష్టానికి నువ్వు కాపాడావు అంటూ ఇప్పుడు ఎలాగైనా పండు తిరిగి రావాలి అని.. నా కొడుకు ఎలా ఉన్నాడు.. ఏమైపోయాడో అంటూ దేవుడి ముందు బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

మరోవైపు అడవిలో శ్యామ్ బాగా నొప్పితో బాధపడుతూ స్పృహ కోల్పోయి కిందపడిపోతాడు. ఇక శ్యామ్ ను చంపడం కోసం తన గ్యాంగ్ తో తిరుగుతున్న బైంసాకు పడిపోయిన శ్యామ్ ని చూసి ఏం జరిగిందా అని ఆశ్చర్య పోతుంది. అక్కడ రాధ లేకపోయేసరికి శ్యామ్ దగ్గరికి వెళ్లి చూడగా శ్యామ్ కాళ్ల నుండి ఎక్కుతున్న విషంని చూసి విషపురుగు కరిచిందని గమనిస్తుంది.

ఇక పక్కనున్న గ్యాంగ్ ఒంటరిగా ఉన్నాడు చంపేద్దాం అనటంతో.. అవసరం లేదు అని కాళ్లకు ఉన్న కట్టు తీసేస్తే విషయం తలకెక్కి చనిపోతాడు అని ఆ కట్టు తీసి సంతోషంగా అక్కడ నుంచి వెళ్తుంది. ఇక అడవిలో రాధ పసరు ఆకు కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక ఇంట్లో ఉన్న మధుర నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది.. ఎక్కడ ఉన్నాడు.. అంటూ అమ్మవారి ముందు ఏడుస్తూ మాట్లాడుతుంది.

నా కొడుకు క్షేమంగా ఇంటికి రావాలి లేదంటే నేను నీ దగ్గరికి వస్తాను అని అనటంతో ఆ మాట విన్న ధనుంజయ్ ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. రాధకు పసరు ఆకు కనిపించడంతో అవి తెంపుతుండగా ముల్లు గుచ్చుకోవటంతో రక్తం వస్తుంది.

ఇక ఆకు తీసుకువచ్చి శ్యామ్ ని చూసి షాక్ అవుతుంది. వెంటనే పసరు పోయటంతో శ్యామ్ స్పృహలోకి వస్తాడు. ఇక శ్యామ్ థాంక్స్ అని చెబుతుండగా మన మధ్య ఎందుకు సార్ అని అంటుంది. ఇక రాధ చేతికున్న గాయాన్ని చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. జరిగిన విషయం చెబుతుంది రాధ.

మరోవైపు ధనుంజయ్ మధురకు టాబ్లెట్ ఇచ్చి ముగ్గురు క్షేమంగా తిరిగి వస్తారు అని ధైర్యం ఇస్తాడు. ఇక ఈ విషయం నీకు చెప్పినందుకు అపర్ణను అనాలని కోపంగా అనటంతో.. తెలిసి కూడా నువ్వెందుకు చెప్పలేదు అని తిరిగి ధనుంజయని ప్రశ్నిస్తుంది మధుర. ఇక అడవిలో ఉన్న రాధ వాళ్ళకు దేవుడికి గుడి గంట శబ్దం రావటంతో అక్కడినుంచి శ్యామ్ ను తీసుకెళ్తుంది.

ఇక గుడి దగ్గరికి వెళ్ళాక ఇక్కడ పంతులు వీరిద్దరిని భార్య భర్తలు అనుకొని దీవిస్తాడు. వాళ్ళని స్నానం చేసి రమ్మని చెప్పి గుడి చుట్టూ తిప్పిస్తాడు. తరువాయి భాగంలో శ్యామ్ చేసిన తప్పుకు పరిహారం పోయింది అని కోయవాళ్లు అంటారు. ఇక అదే సమయంలో బిజిలి మీ పట్నం పోలకు తాళిబొట్టు వేసుకునే అలవాటు లేదు అంటూ తాళిబొట్టు తెచ్చి ఇవ్వటంతో రాధ షాక్ అవుతుంది.

Also Read: Sundeep Kishan: ధనుష్‌కు సోదరుడుగా సందీప్ కిషన్ - క్రేజ్ మామూలుగా లేదుగా?

Published at : 25 May 2023 10:40 AM (IST) Tags: Madhuranagarilo serial Madhuranagarilo telugu serial Madhuranagarilo star maa serial Madhuranagarilo May 25th

సంబంధిత కథనాలు

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

Rahul Ravindran Chinmayi : అసలు పెళ్లే వద్దనుకున్న రాహుల్‌, చిన్మయిలను కలిపిన టాలీవుడ్ హీరో ఎవరంటే?

Rahul Ravindran Chinmayi : అసలు పెళ్లే వద్దనుకున్న రాహుల్‌, చిన్మయిలను కలిపిన టాలీవుడ్ హీరో ఎవరంటే?

Guppedanta Manasu May 27th: జగతిని అమ్మా అని పిలిచి, ఎంగేజ్మెంట్ రింగ్ వసు చేతిలో పెట్టేసి వెళ్లిపోయిన రిషి

Guppedanta Manasu May 27th: జగతిని అమ్మా అని పిలిచి, ఎంగేజ్మెంట్ రింగ్ వసు చేతిలో పెట్టేసి వెళ్లిపోయిన రిషి

Gruhalakshmi May 27th: అత్త రోగం కుదిర్చిన దివ్య, సంతోషంలో విక్రమ్- నందుకి జైలు శిక్ష పడుతుందా?

Gruhalakshmi May 27th: అత్త రోగం కుదిర్చిన దివ్య, సంతోషంలో విక్రమ్- నందుకి జైలు శిక్ష పడుతుందా?

Krishna Mukunda Murari May 27th: మురారీ గత ప్రేమ గురించి తెలుసుకున్న కృష్ణ- తన జీవితం నుంచి వెళ్లిపోతుందా?

Krishna Mukunda Murari May 27th: మురారీ గత ప్రేమ గురించి తెలుసుకున్న కృష్ణ- తన జీవితం నుంచి వెళ్లిపోతుందా?

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!