Ashu Reddy Hospitalized: ఆసుపత్రిపాలైన అషూ రెడ్డి, అకస్మాత్తుగా ఏమైంది?
బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి ఆసుపత్రిలో బెడ్ పైన ఉన్న ఫోటోను షేర్ చేసి అందర్నీ షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాను వాడుకొని పేరు సంపాదించుకున్నవాళ్లలో బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి ఒకరు. టిక్ టాక్ లో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ భామ నెట్టింట ఫాలోయింగ్ ను పెంచుకుంది అషూ రెడ్డి. తన అందంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా అషూ రెడ్డి ఆసుపత్రిలో బెడ్ పైన ఉన్న ఫోటోను షేర్ చేసి అందర్నీ షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అషూ రెడ్డి ఫొటో చూసి ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. ఆసుపత్రి బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటూ అసలు నడవలేని స్థితిలో ఉన్న అషూను చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అషూ రెడ్డికి ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే తర్వాత తాను కోలుకుంటున్నానని, కంగారు పడాల్సింది ఏమీ లేదని అషూ చెప్పింది. అయితే ఏం జరిగింది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ వీడియోలతో ఫుల్ ఫేమస్ అయిన అషూ రెడ్డి తర్వాత బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా ఏంట్రీ ఇచ్చింది. దీంతో ఆమెకు ఇంకాస్త పేరు వచ్చింది. బిగ్ బాస్ తర్వాత కూడా పలు టీవీ షో లలో కనిపించింది. ఓ వైపు టీవీ షో లలో మెరుస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ తో ఇంటర్య్వూలు చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించింది. మొన్నీమధ్య ఆర్జీవితో ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అషూ రెడ్డి పాదాలకు ముద్దుపెట్టిన వీడియో తెగ వైరల్ అయింది. దీంతో ఆమెపై అనేక విమర్శలు వచ్చాయి. అయితే వాటిపై ఆమె పెద్దగా స్పందించలేదు.
Also Read : బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - నందమూరి తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్
అలాగే అషూ రెడ్డి ఈ మధ్య ఎక్కువగా వెకేషన్స్ కు వెళ్తోంది. కొన్ని రోజులు దుబాయ్ లో ఉన్నాను అంటూ పోస్ట్‌లు పెడుతుంది. తర్వాత మళ్లీ అమెరికాలో ఉన్నాను అని ఫోటోలు పెడుతుంది. ఇలా వరుసగా వెకేషన్స్ కు తిరుగుతోంది ఈ బ్యూటీ. ఇటీవలే ఓ వీడియో షూటింగ్ కోసం సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలసి దుబాయ్ వెళ్లింది. అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కూడా. అషూ రెడ్డి పై నిత్యం ఏదొక ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఆమె మాత్రం వాటిని పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ వెళ్లిపోతుంది. ఇలా సడెన్ గా ఆమె ఆసుపత్రి బెడ్ మీద కనబడటంతో త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు ఆమె అభిమానులు.
View this post on Instagram