Prema Entha Madhuram September 29th: తాంబూలాలు మార్చుకున్న జలంధర్,నీరజ్- స్కూల్ ని తిరిగి తెరిపించిన ఆర్య!
జలంధర్ రీ ఎంట్రీ ఇచ్చి ఆర్యతో తాంబూలాలు మార్చుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema entha madhuram september 29th: మీరు ఏం చేయొద్దు నేను అన్ని ఏర్పాట్లతోనే వచ్చాను. ఇలాంటి మ్యాజిక్ ఏదో జరుగుతుందని తాంబూలాలు, పువ్వులు,పళ్ళు, కన్యాదానం కోసం అన్నయ్యని కూడా తెచ్చాను.
ఆర్య: అయితే రమ్మను అని అనగా ఛాయాదేవి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి లోపలికి రమ్మంటుంది. అప్పుడు జలంధర్ ఇంట్లోకి అడుగుపెట్టగా తనని చూసి అంజలీ, నీరజ్ షాక్ అవుతారు.
నీరజ్: జలంధర్ ఆ??
అంజలి: జలంధర్ అంటే ఇతనేనా? ఛాయాదేవి వాళ్ళ అన్నయ్య జలంధర్ ఆ??
జలంధర్: నమస్కారం ఆర్య అని గట్టిగా నవ్వి సారీ సారీ బావగారు వరుసలు కుదిరాయి కదా. ఎలా ఉన్నారు చాలా రోజులైంది చూసి. రాహుకాలం వస్తున్నట్టుంది తాంబూలాలు మార్చుకుందామా
నీరజ్: నీతో ఎవరు రా తాంబూలాలు మార్చుకునేది? ఇదంతా మీ ప్లానే కదా అందరూ కలిసి ఈ కుట్రపన్నారు.
అంజలి: ఇంత జరుగుతున్న తర్వాత ఇంక ఈ తాంబూలాలు పుచ్చుకోవడం అనేది జరగదు చెప్పండి సార్. ఈ పెళ్లి అవ్వదు అని చెప్పండి అని ఆర్యతో అంటుంది అంజలి.
నీరజ్: ఇంకా మాట్లాడేది ఏంటి ముందు నువ్వు బయటకు వెళ్ళు అని జలంధర్ కాలర్ పట్టుకుంటాడు నీరజ్. ఇంతలో మాన్సి వచ్చి ఆపుతుండగా తన మీద గట్టిగా అరుస్తాడు నీరజ్.
ఆర్య: తాంబూలాలు తీసుకోండి. ఇంకేం మాట్లాడొద్దు ఈ పెళ్లి జరగల్సిందే. స్కూల్ కోసం, నేను వాళ్లకి ఇచ్చిన మాట కోసం, నేను ఏమైనా చేస్తాను నాకు పిల్లలు భవిష్యత్తు ముఖ్యము.
Also Read: ఉలూచిని దాచేసిన తిలోత్తమ - విశాలాక్షిని నిందిస్తున్న సుమన!
జలంధర్: నాకు తెలుసు బావగారు మీరు ఇచ్చిన మాట కోసం ఏమైనా చేస్తారు అని ఇంక తాంబూలాలు మార్చుకుందామా అని అంజలిలీ, నీరజ్ ల తో తాంబూలాలు మార్చుకుంటారు జలంధర్. చేసేదేమీ లేక నీరజ్ వాళ్ళు కూడా తాంబూలాలు పుచ్చుకుంటారు.
జలంధర్: సరే బావగారు ఇంక మేము వెళ్ళొస్తాము. పెళ్లప్పుడు కన్యాదానం చేసి మీ కాళ్లు కడుక్కుంటాను.
ఛాయాదేవి: థాంక్యూ ఆ ఆర్య నా ప్రపోజల్ ఆక్సెప్ట్ చేసినందుకు జీవితాంతం ఇలాగే చేయి పట్టుకుని బతుకుదాం అని చెప్పి అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతారు.
నీరజ్: ఏంటి దాదా మీరు చేస్తున్నది?
ఆర్య: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు మీరు కంగారు పడొద్దు. అంజలి నీరజ్ ని లోపలికి తీసుకొని వెళ్ళు అని అనగా ఇద్దరూ లోపలికి వెళ్ళిపోతారు.
ఆర్య: జెండే అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది
జెండే: అవును ఆర్య నెక్స్ట్ ఏం చేద్దాం?
ఆర్య: ఈ విషయం అను వరకు వెళ్లాలి అనుకు తెలియాలి. తన పిల్లల మీద తనకి ఇన్ సెక్యూరిటీస్ మొదలైతే అప్పుడు తనే బయటపడుతుంది.
జెండే: గుడ్ ఐడియా ఆర్య కానీ మాట ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకోలేదని ఈ సొసైటీ నిన్ను ఎలా చూస్తుందో?
ఆర్య: పెళ్లి జరుగుతుంది జెండే. అని తనకి ఒక ప్లాన్ చెప్తాడు ఆర్య.
ఆ తర్వాత సీన్లో పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్స్, అందరూ స్కూల్ ఎదురుగుండా కూర్చుని ఉంటారు. ఇంతలో ఆర్య, ఛాయాదేవిలందరి కార్లు అక్కడికి వస్తాయి. వాళ్లను చూసి అను ముసుగు వేసుకొని పక్కకు వెళ్లి దాక్కుకుంటుంది.
ఆర్య: మీరేమీ కంగారు పడకండి నేను అందరితోనీ మాట్లాడి ఈ స్కూల్ ని రీ ఓపెన్ చేయిస్తున్నాను. ఇంక మీ స్కూల్ ఎవరి చేతులలోకి వెళ్ళదు. ఇంక ఇది మీదే.
Also Read: 'గబ్బర్ సింగ్' స్టైల్ లో ముకుందకి కృష్ణ వార్నింగ్- కొడుక్కి రేవతి సలహా
అను: నాకు తెలుసు సార్ మీరు ఇచ్చిన మాట కోసం ఏమైనా చేస్తారు అని. వాళ్ళని భయపెట్టేసి ఉంటారు. బయటికి నవ్వుతూ ఉన్న లోపల మోకాలు మాడిపోయి ఉంటాయి. అని ఛాయాదేవి గురించి మనసులో అనుకుంటుంది అను.
తర్వాత ఛాయాదేవి ఒక సైగ చేయగా వాళ్ళ లాయర్ స్కూల్ గేట్లను సీల్ విప్పి తెరుస్తాడు. అప్పుడు పిల్లలందరూ లోపలికి పరిగెట్టుకొని వెళ్ళిపోతారు. అక్కి, అభయ్ లు అక్కడే ఉంటారు.
అక్కి: థాంక్యూ ఫ్రెండ్ మా స్కూల్ నీ మళ్ళీ తెరిపించావు నీ ప్రామిస్ ని నిలబెట్టుకున్నావు.
అభయ్: థాంక్యూ సార్ మా స్కూల్ ని మాకు ఇచ్చినందుకు
ఆర్య: ఏ అభయ్ ఫస్ట్ టైం నీకు నేను నచ్చినట్టు ఉన్నాను.
అభయ్: మీరు మంచి పని చేశారు సార్ అందుకే మిమ్మల్ని పొగిడాను.
ఆర్య: థాంక్యూ డియర్ అని అనగా ఈ సంభాషణని అను విని ఆనందిస్తుంది.
మాన్సి: సొంత పిల్లలు అని తెలియకపోతేనే ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు కన్నబిడ్డలేని తెలిస్తే ఇంకేం అయిపోతారు.
ఛాయాదేవి: ఏదో ఒకటి చేసి పిల్లల్ని ఆర్య దగ్గర నుంచి విడగొట్టాలి. ఆర్య జీవితం మొత్తం నేను మాత్రమే ఉండాలి.
మాన్సి: ముందు పెళ్లి జరుగనీ తర్వాత మిగిలినవన్నీ ఆలోచించొచ్చు అని అనుకుంటారు.
ఇంతలో అక్కి, అభయ్ లు ఆర్యకి బాయ్ చెప్పి స్కూల్ లోపలికి వెళ్ళిపోతారు.
టీచర్: థాంక్యూ సర్. మీరు లేకపోతే మా ఉద్యోగాలన్నీ పోయేవి. ఏం చేయాలో కూడా తెలియని స్థితిలో ఉండే వాళ్ళము మళ్లీ మా స్కూల్ మాకు ఇచ్చారు థాంక్యూ వెరీ మచ్.
Also Read: కన్నీళ్లతో జగతికి ప్రామిస్ చేసిన రిషి, శైలేంద్రకి మొదలైన కౌంట్ డౌన్!
ఆర్య: ఇట్స్ ఓకే టీచర్ పిల్లలకి బాగా చదువు చెప్పండి అంతే చాలు.
ఛాయాదేవి: ఇక్కడ ఒక్కలు కూడా మళ్ళీ పట్టించుకోవడం లేదు అని మాన్సి తో అంటుంది.
మాన్సి: మనకున్న ఫేస్ వాల్యూ అలాంటిది అని ఛాయాదేవితో అంటుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial