Prema Entha Madhuram July 24th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: ఆర్యను కోర్ట్ కు రాకుండా చేసిన మాన్సీ.. ఆఖరి నిమిషంలో ప్రూఫ్స్ బయట పెట్టిన ఆర్య?
కోర్టులో ఆర్య అడ్డంకి ఉండకూడదు అని మాన్సీ ప్లాన్ చేసి పంపియటంతో సీరియల్ ఇంట్రెస్టిగా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram July 24th: ఆర్య వాళ్ళంతా కోర్టుకు బయలుదేరగా.. అక్కడ లాయర్ ఈ కేసు మనమే గెలుస్తాము అని అంటాడు. ఈ కేసు గెలవడమే కాదు మాన్సీ లాంటి అమ్మాయిల ఆలోచనలు మరొకరికి రాకుండా చేయాలి అని అంటాడు. కానీ అంజలి, నీరజ్ తను కన్నింగ్ ప్లాన్ చేస్తుంది అని, చేస్తుంది అని అనటంతో ఆర్య నా ప్లాన్స్ నాకు ఉన్నాయి మీరు ఏమీ భయపడకండి అని ధైర్యం ఇస్తాడు.
అదే సమయంలో మాన్సీ కళ్యాణి అని పేరుతో గొంతు మారుస్తూ నేను మీ ఆఫీసులో పనిచేస్తున్నాను ఇందాకే ఇక్కడ అను ని చూశాను. వెంటనే ఎవరో వచ్చి ఎత్తుకెళ్లారు అనటంతో.. ఇక ఆర్య ఈ విషయం చెప్పి వారికి ధైర్యంగా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. మాన్సీ ఆ సిమ్ తీసేసి ఇక తను దొరికిపోను అని తెగ సంతోషపడుతుంది.
ఆ తర్వాత కోర్టు ప్రారంభమవుతుంది. నీరజ్ తరుపున లాయర్ మాట్లాడుతూ విడాకులు ఇప్పించమని అనడంతో వెంటనే బోన్ లో ఉన్న మాన్సీ తన భర్త కావాలి అంటూ తన లేకుంటే ఉండలేను అని ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తుంది. మాన్సీ తరపున లాయర్ అంజలిని పిలిపించి ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావు అంటూ అవమానిస్తాడు.
ఇక జాబ్ వచ్చింది కదా నీరజ్ ను వదిలేసేయ్ అని అంటాడు. దాంతో అంజలి వదిలేయను అని గట్టిగా చెప్పటంతో తను ఫారన్ లో పెరిగింది కాబట్టి తనకు పెళ్లి గురించి సాంప్రదాయం గురించి తెలియదని అనటంతో అంజలి తను ఫారన్ లో పెరిగిన కూడా తనకు ఈ కల్చర్ గురించి తెలుసని సమాధానం ఇస్తుంది.
మరోవైపు ఆర్య సార్ ఎక్కడ అని అను చూస్తూ ఉంటుంది. ఇక ఆర్య జెండే కి ఫోన్ చేసి జలంధర్ గురించి ఏమైనా తెలిసిందా అనటంతో ఏమి లేదు అని అంటాడు. ఇక మాన్సీ మరోసారి బోన్ లోకి సరే నీరజ్ ను వదిలేస్తాను.. నేను బతకడానికి నాకు భరణం కింద ఎంతో కొంత ఇప్పించాలి అని కోరడంతో కోర్టు కాసేపు వాయిదా పడుతుంది.
ఆర్య ఆ ప్లేస్ కి వెళ్లి చూసేసరికి అక్కడ ఏమి జరగలేదని తెలియడంతో.. వెంటనే ఆ ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేయించగా ఆ నెంబర్ కోర్టు నుండే వచ్చిందని తెలుసుకోవడంతో మాన్సీ అని కనిపెడతాడు ఆర్య. ఇక జెండే కి ఫోన్ చేసి కొన్ని డీటెయిల్స్ పంపించమని అంటాడు. ఆ తర్వాత కోర్టులో జడ్జి అని వాదోపదాలు విన్న తర్వాత ఎటువంటి సాక్షాలు అంటున్న సమయంలో ఆర్య సాక్షాలు ఉన్నాయి అని బోన్ లోకి వచ్చి జరిగిన విషయం మొత్తం సాక్షాలతో బయటపెడతాడు. మాన్సీ ఫేక్ ప్రెగ్నెంట్ గురించి ఆడిన నాటకాన్ని కూడా డాక్టర్ ద్వారా బయట పెడతాడు. దాంతో మాన్సీ భయపడిపోతుంది.
also read it : Krishnamma kalipindi iddarini July 22th: సౌదామినిని ఇంట్లో ఉండేలా చేసిన గౌరి.. అఖిలకు కొంపలు మునిగే ప్లాన్లు నేర్పిస్తున్న భవాని?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial