అన్వేషించండి

Archana Puran Singh: ఈమె జస్ట్ అలా కూర్చున్నందుకు రూ.8 కోట్లు ఇస్తున్నారట - ఈ సీనియర్ నటి సంపాదన తెలిస్తే నోరెళ్లబెడతారు

Archana Puran Singh: కేవలం ఛైర్‌లో కూర్చొని షోను ఎంజాయ్ చేస్తూ కోట్లు సంపాదించేవారు చాలామందే ఉన్నారు. ఒక బాలీవుడ్ నటి కూడా ఇప్పుడు అదే పనిచేస్తోంది. షోలో పర్మనెంట్ గెస్ట్‌గా ఉంటూ కోట్లు వెనకేస్తోంది.

Archana Puran Singh: యాక్టింగ్ అనేది చాలా కష్టమని, స్క్రీన్‌పై అందంగా కనిపించే సీన్ కోసం స్క్రీన్ వెనుక ఎంతో కష్టపడతామని నటీనటులు అంటుంటారు. కేవలం నటీనటులు మాత్రమే కాదు ఎంతోమంది టెక్నీషియన్లు కలిసి కష్టపడితేనే మంచి ఔట్‌పుట్ వస్తుందని చెప్తారు. బుల్లితెర విషయానికొస్తే చాలా భిన్నంగా ఉంటుంది. రియాలిటీ షోలలో కేవలం ఒకే దగ్గర కూర్చొని మాట్లాడితే చాలు.. నటీనటులకు కోట్లు వచ్చిపడతాయి. అలాగే ఒక బాలీవుడ్ సీనియర్ నటి కూడా కేవలం చైర్‌లో కూర్చొని రూ.8 కోట్లు సంపాదించింది అంటే నమ్ముతారా? నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం.

ఆ షోలో గెస్ట్..

అర్చనా పురాన్ సింగ్.. హిందీలో రియాలిటీ షోలు ఫాలో అయ్యేవారికి ఈ పేరు బాగా తెలిసే ఉంటుంది. కపిల్ శర్మ షోలో ఎన్నో ఏళ్లు జడ్జి సీటులో కూర్చొని తన నవ్వుతో అందరినీ నవ్వించేది అర్చనా. ముందుగా కపిల్ శర్మ షోలో జడ్జి స్థానంలో నవ్జోత్ సింగ్ సిద్ధు ఉండేవారు. ఆయన తప్పుకున్న తర్వాత ఆ స్థానంలోకి అర్చనా సింగ్ వచ్చారు. 2018 నుంచి 2023 వరకు కపిల్ శర్మ షోలో పర్మనెంట్ గెస్ట్‌గా ఉన్నారు అర్చనా. అదే సమయంలో కపిల్‌కు నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. తన షోను ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమ్ చేస్తామని నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ పేరుతో ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. అక్కడ కూడా అర్చనా పురాన్ సింగ్ పర్మనెంట్ గెస్ట్‌గా కనిపిస్తోంది.

ఒక్క ఎపిసోడ్‌కు ఎంతంటే.?

‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పర్మనెంట్ గెస్ట్‌గా ఉండే అర్చనా పురాన్ సింగ్.. పెద్దగా చేయాల్సింది ఏమీ ఉండదు. ఒకే చైర్‌లో కూర్చొని షోకు వచ్చే గెస్టులతో కపిల్ చేసే కామెడీకి నవ్వాలి. అంతే ఆమె పని. దానికోసం ఎపిసోడ్‌కు రూ.10 లక్షలు ఛార్జ్ చేస్తుందట ఈ నటి. ఓ బాలీవుడ్ మ్యాగజిన్ తెలిపిన వివరాల ప్రకారం.. కపిల్ శర్మ షో ద్వారా ఏకంగా రూ.8 కోట్లు సంపాదించారట అర్చనా. ఇది విని అందరూ షాకవుతున్నారు. 1987లో ‘అభిషేక్’ అనే సీరియల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు అర్చనా పురాన్ సింగ్. బుల్లితెరపై నుంచి వెండితెరపైకి వచ్చి సక్సెస్ సాధించిన వారి లిస్ట్‌లో అర్చనా కూడా చోటు దక్కించుకున్నారు.

వెండితెరతో పాటు బుల్లితెరపై..

‘జల్వా’ మూవీతో మొదటిసారి వెండితెరపై మెరిశారు అర్చనా పురాన్ సింగ్. అమితాబ్ బచ్చన్ ‘అగ్నీపత్’, దిలీప్ కుమార్ ‘సౌదాగర్’, గోవిందా ‘షోలా ఔర్ షబ్నమ్’, అమీర్ ఖాన్ ‘రాజా హిందుస్థానీ’లో అర్చనా నటించారు. అంతే కాకుండా చిన్న పాత్రలతోనే ఎంతో పాపులారిటీ అందుకొని ఐటెమ్ గర్ల్‌గా కూడా మారారు. ‘బాజ్’, ‘జడ్జ్ ముజ్రిమ్’ అనే చిత్రాల్లో ఐటెమ్ పాటలకు స్టెప్పులేశారు. 90ల్లో ఒకవైపు వెండితెరపై వెలిగిపోతూనే బుల్లితెరపై కూడా పాపులర్ అయ్యారు అర్చనా. ‘అర్చనా టాకీస్’ అనే ఒక షోను హోస్ట్ కూడా చేశారు. ఒక కామెడీ షోలో జడ్జిగా వ్యవహరించిన తర్వాత ఇప్పుడు కపిల్ శర్మ షోతో బిజీ అయిపోయారు.

Also Read: సోనాక్షి సిన్హా పెళ్లా? నాకేం చెప్పలేదు.. అదే నిజమైతే నా భార్య, నేను అలా చేస్తాం - కూతురి పెళ్లి వార్తలపై శత్రుఘ్న సిన్హా స్పందన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India In ICC Champions Trophy Final: ఫైన‌ల్లో భార‌త్.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 4 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
అదరగొట్టిన టీమిండియా.. ఫైన‌ల్ చేరిక.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 4 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
Singer Kalpana Husband: పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త... సూసైడ్ అటెంప్ట్ కేసులో విచారణ ముమ్మరం
పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త... సూసైడ్ అటెంప్ట్ కేసులో విచారణ ముమ్మరం
Shakti App:  దిశ వేస్ట్.. శక్తి యాప్ తెస్తున్నాం -ఏపీ హోంమంత్రి కీలక ప్రకటన
దిశ వేస్ట్ .. శక్తి యాప్ తెస్తున్నాం -ఏపీ హోంమంత్రి కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RS Praveen Kumar Tweet Controversy Sunil Kumar IPS | ఒక్క ట్వీట్ తో తేనె తుట్టను కదిపిన RS ప్రవీణ్Ind vs Aus Match Highlights | Champions Trophy 2025 ఫైనల్ కు చేరుకున్న టీమిండియా | ABP DesamPM Modi inaugurates Vantara | అంబానీల జంతు పరిరక్షణ కేంద్రం 'వంతారా' ను ప్రారంభించిన ప్రధాని మోదీInd vs Aus Semi final Preview | Champions Trophy 2025 లోనైనా ఆసీస్ ఆ రికార్డు బద్ధలు అవుతుందా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India In ICC Champions Trophy Final: ఫైన‌ల్లో భార‌త్.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 4 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
అదరగొట్టిన టీమిండియా.. ఫైన‌ల్ చేరిక.. కోహ్లీ మాస్ట‌ర్ ఇన్నింగ్స్.. 4 వికెట్ల‌తో ఆసీస్ చిత్తు.. 
PM Modi Visits Vantara: సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
సింహం పిల్లలకు పాలుపట్టి... పులి పిల్లలతో ఆటలాడుతూ.. వంతారాలో గడిపిన ప్రధాని మోదీ
Singer Kalpana Husband: పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త... సూసైడ్ అటెంప్ట్ కేసులో విచారణ ముమ్మరం
పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త... సూసైడ్ అటెంప్ట్ కేసులో విచారణ ముమ్మరం
Shakti App:  దిశ వేస్ట్.. శక్తి యాప్ తెస్తున్నాం -ఏపీ హోంమంత్రి కీలక ప్రకటన
దిశ వేస్ట్ .. శక్తి యాప్ తెస్తున్నాం -ఏపీ హోంమంత్రి కీలక ప్రకటన
Actress Ranya Rao Arrest: బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన కన్నడ నటి, ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్!
బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన కన్నడ నటి రన్యా రావు, ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్!
RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
Telugu TV Movies Today: ఈ రోజు (బుధవారం, మార్చి 5) టీవీలలో వచ్చే సినిమాలు ఇవే... ఆ మూడూ అస్సలు మిస్ కావొద్దు!
ఈ రోజు (బుధవారం, మార్చి 5) టీవీలలో వచ్చే సినిమాలు ఇవే... ఆ మూడూ అస్సలు మిస్ కావొద్దు!
Nabha Natesh: 'కల్కి 2898 ఏడీ' హీరోయిన్ దిశాకు పోటీ ఇచ్చేలా... Calvin Klein ఇన్నర్ వేర్‌లో నభా నటేష్
'కల్కి 2898 ఏడీ' హీరోయిన్ దిశాకు పోటీ ఇచ్చేలా... Calvin Klein ఇన్నర్ వేర్‌లో నభా నటేష్
Embed widget