Shatrughan Sinha: సోనాక్షి సిన్హా పెళ్లా? నాకేం చెప్పలేదు.. అదే నిజమైతే నా భార్య, నేను అలా చేస్తాం - కూతురి పెళ్లి వార్తలపై శత్రుఘ్న సిన్హా స్పందన
Shatrughan Sinha: సోనాక్షి సిన్హా.. 'హీరామండి' వెబ్ సిరీస్ లో అద్భుతమైన పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు ఆమె పెళ్లి అంటూ రూమర్స్ వస్తున్నాయి. దానిపై స్పందించారు ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా.
Shatrughan Sinha On Daughter Sonakshi's Wedding Rumours : సెలబ్రిటీలపై రూమర్స్ రావడం మామూలు అయిపోయింది. ముఖ్యంగా వాళ్ల పెళ్లిలపై వార్తలు తెగ హల్ చల్ చేస్తుంటాయి. 'హీరామండి' వెబ్ సిరీస్ యాక్టర్, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పెళ్లి అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తన బాయ్ ఫ్రెండ్ జహార్ ఇక్బాల్ ని పెళ్లాడబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయంపై ఆమె తండ్రి, ఎంపీ శత్రుఘ్న సిన్హా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో తన కూతురి పెళ్లి గురించి మాట్లాడారు ఆయన.
పెళ్లా? నాకే తెలీదే..
ఇటీవల ఎంపీగా గెలిచిన శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. జూమ్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన కూతురి పెళ్లి గురించి అడిగితే ఆశ్చర్య పోయారు. "పెళ్లా? తన పెళ్లి గురించి నాకేం చెప్పలేదే అని అన్నారు. నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఢిల్లీ వచ్చేశాను. నేను నా కూతురితో ఇప్పటి వరకు మాట్లాడలేదు. మీరేమో ఆమె పెళ్లి అని అడుగుతున్నారు. దానికి నా సమాధానం ఆమె నాకు కనీసం చెప్పలేదు అని. నాకు తెలిసి మీడియానే నాకు చెప్తోంది. ఒక వేళ తను ఆ విషయం మాకు చెప్తే నేను.. నా భార్య కచ్చితంగా ఆశీర్వదిస్తాం. ఆమె ఆనందమే మాకు కావాలి. సోనాక్షి నిర్ణయాన్ని ఎప్పుడూ తప్పుపట్టం. ఎందుకంటే ఆమె తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఆమెకు ఉంది" అంటూ చెప్పారు శత్రుఘ్న సిన్హా.
కూతురి పెళ్లి బరాత్ లో డ్యాన్స్ చేయాలి..
"నా కూతురి పెళ్లి ఎప్పుడు జరిగినా ఆమె పెళ్లి బరాత్ లో నేను డ్యాన్స్ చేయాలి. నాకు తెలియకుండా, మీడియాకి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి అని ప్రశ్నించుకుంటాను. అయినా ఈ రోజుల్లో చాలామంది పిల్లలు కనీసం పర్మీషన్ తీసుకోవడం లేదు. జస్ట్ సమాచారం ఇస్తున్నారు. నా కూతురు కూడా నాకు సమాచారం ఇస్తుందేమో అని చూస్తున్నాను" అని కూతురు పెళ్లి గురించి వివరించారు ఆయన.
జూన్ 23పెళ్లంటూ..
జూన్ 23న సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ పెళ్లి అంటూ రూమర్ క్రియేట్ అయ్యింది. దగ్గరి బంధువులు, ఇరు కుటుంబాల మధ్య పెళ్లి జరగనుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే హీరామండి యాక్టర్లకు కూడా పెళ్లి కార్డులు అందాయని నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. పెళ్లి కార్డు మీద రూమర్స్ నిజమే అని ప్రింట్ చేయించినట్లు, ముంబైలో వివాహ వేదిక అని దాంట్లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు శత్రుఘ్న సిన్హా అలా రియాక్ట్ అవ్వడంతో అవి రూమర్స్ అని తేలిపోయాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు. సోనాక్షి నిన్హా జహీర్ ఇద్దరూ 2020 నుంచి డేటింగ్ లో ఉన్నారు. ఇద్దరు కలిసి 'డబల్ ఎక్స్ఎల్' అనే సినిమాలో కలిసి నటించారు.
Also Read: హైదరాబాద్ అనగానే రామోజీ ఫిలిమ్ సిటీ గుర్తొస్తుంది: విజయ్ సేతుపతి